వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ వర్గాలు కలిసేనా, నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి చేరిక టిడిపికి లాభమేనా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చెందిన చిట్ట చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరనున్నారు. అయితే కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరడంతో ఆ పార్టీకి ఏ మేరకు ప్రయోజనం కలుగుతోందననే చర్చ సాగుతోంది. కిషోర్ కుమార్ రెడ్డి టిడిపిలో చేరితే ఇప్పటివరకు టిడిపిలో ఉన్న నేతల పరిస్థితేమిటనే ఆందోళన కూడ లేకపోలేదు.

Recommended Video

నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలోకి, లోకేష్ గ్రీన్ సిగ్నల్Nallari to join in Tdp|Oneindia Telugu

కిర‌ణ్‌కు షాక్: బాబుతో నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి భేటీ, టిడిపిలోకికిర‌ణ్‌కు షాక్: బాబుతో నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి భేటీ, టిడిపిలోకి

2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకొనే ఉద్దేశ్యంతో టిడిపి నాయకత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డిని టిడిపిలో చేర్చుకొనేందుకు రంగం సిద్దం చేసిందనే ప్రచారం కూడ సాగుతోంది.

ల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలోకి, లోకేష్ గ్రీన్ సిగ్నల్ల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలోకి, లోకేష్ గ్రీన్ సిగ్నల్

చిత్తూరు జిల్లాలో 2014 ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ ఆదిపత్యాన్ని ఈ జిల్లాలో తగ్గించాలంటే నల్లారి కుటుంబం నుండి కిషోర్‌కుమార్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని టిడిపి నాయకత్వం వ్యూహన్ని రచించింది.

నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి చేరిక టిడిపికి ఏ మేరకు లాభం

నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి చేరిక టిడిపికి ఏ మేరకు లాభం

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరడం ఏ మేరకు టిడిపికి ప్రయోజమనే చర్చ ప్రస్తుతం సాగుతోంది. నల్లారి కుటుంబంతో ఇప్పటివరకు రాజకీయంగా విబేధించిన టిడిపి నేతల పరిస్థితి ఏమిటనే చర్చ సాగుతోంది. నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కిషోర్‌కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసించారు. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన పీలేరు నియోజకవర్గంలో టిడిపి నేతలు రాజకీయంగా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అయితే పార్టీ అవసరాల రీత్యా కిషోర్‌కుమార్ రెడ్డిని టిడిపిలో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఈ నిర్ణయంతో టిడిపి నేతల్లో కలవరపాటుకు గురౌతున్నారు.

కిషోర్‌కుమార్ రెడ్డితో కలిసి పనిచేసేనా?

కిషోర్‌కుమార్ రెడ్డితో కలిసి పనిచేసేనా?

పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి నుండి టిడిపిలో కొనసాగిన నేతలను కిషోర్‌కుమార్ రెడ్డి కలుపుకొని పోతారా.... పాత టిడిపి నేతలు ఆయనతో కలుస్తారా అనే చర్చ కూడ లేకపోలేదు. ఈ నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య ఉప్పు, నిప్పు తరహలో పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కిషోర్‌కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకొనే సమయంలో నియోజకవర్గంలోని పాత టిడిపి నేతలతో కూడ టిడిపి నాయకత్వం చర్చలు జరిపింది. అందరికీ ప్రాధాన్యత ఉంటుందని హమీ ఇచ్చారని సమాచారం.

 గుర్రంకొండ టిడిపి నేతల భేటీ

గుర్రంకొండ టిడిపి నేతల భేటీ

ఏపీ సీఎం చంద్రబాబునాయుడును నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి ఈ నెల 17వ, తేది రాత్రి అమరావతిలో కలిశారు. కిషోర్‌కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. ఈ నెల 23, లేదా 25వ, తేదిన టిడిపిలో చేరనున్నట్టు ఈ సమావేశంలో బాబుకు తెలిపారు.కిషోర్‌కుమార్ రెడ్డి అమరావతిలో బాబుతో సమావేశమైన తర్వాత గుర్రంకొండ మండల నాయకులతో ఆ పార్టీ అధ్యక్షుడు నాని సమావేశం నిర్వహించారు. కిషోర్ కుమార్ రెడ్డి చేరిక వల్ల పార్టీకి జరిగే ప్రయోజనాలపై చర్చించారు. అయితే కిషోర్‌కుమార్ రెడ్డి చేరిక విషయమై స్థానిక నాయకులకు జిల్లా నాయకులు నచ్చజెప్పారని సమాచారం.

రెండు వర్గాల సమన్వయం సాధ్యమేనా?

రెండు వర్గాల సమన్వయం సాధ్యమేనా?

పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిరేనా అనే చర్చ కూడ లేకపోలేదు. ఈ రెండు గ్రూపుల మధ్య చాలా ఏళ్ళుగా అగాధం ఉంది. అయితే ఈ తరుణంలో కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరాలని నిర్ణయంపై టిడిపి జిల్లా నాయకత్వం స్థానిక నేతలను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరు నేతలు మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని సమాచారం. పాత టిడిపి నేతలను కిషోర్‌కుమార్ రెడ్డి కలుపుకుపోతారా... లేదా అనేది ఆయన పార్టీలో చేరిన తర్వాత తేలనుంది.

English summary
Former United Ap chief minister Nallari Kiran kumar reddy brother Nallari Kishore kumar Reddy will join in TDP on NOv 23 or 25. Chittoor Tdp district leaders Persuading local leaders said Kishore kumar reddy followers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X