వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆలయాల్లో పోలీసులు భద్రత కోసమా.. రౌడీయిజానికా..? కంచిలో భక్తులను కొట్టి చంపుతున్న ఖాకీలు?

|
Google Oneindia TeluguNews

తమిళనాడులోని ప్రఖ్యాత కంచి దేవాలయంలో పోలీసుల దాష్టీకం, ఓ తెలుగు యువకుడి ప్రాణాలను తీసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి .ఆలయంలోకి కెమెరాను తీసుకువెళ్లిన ఆకాశ్, అనే యువకుడు సెల్ఫీ తియ్యాలని ప్రయత్నించటమే అతని తప్పైంది. అతని ప్రాణాల మీదకు తెచ్చింది . చాలా రద్దీగా ఉన్న దేవాలయ ప్రాంగణంలో ఫోటో తీసుకుంటున్న శక్తి ఆకాష్ ను గమనించిన ఆలయ పోలీసు సెక్యూరిటీ అతన్ని అడ్డుకుని, దారుణంగా లాఠీలతో కొట్టారని బంధువులు ఆరోపిస్తున్నారు . దీంతో యువకుడు మరణించాడని చెప్తున్నా పోలీసుల వాదన మాత్రం వేరేలా వుంది.

Recommended Video

తిరుమల అతిథి గృహంలో భారీ చోరీ
 కంచి ఆలయంలో భక్తుల రద్దీ .. పోలీసుల ఓవర్ యాక్షన్ తో ఇద్దరు మృతి చెందారని ఆరోపణ

కంచి ఆలయంలో భక్తుల రద్దీ .. పోలీసుల ఓవర్ యాక్షన్ తో ఇద్దరు మృతి చెందారని ఆరోపణ

కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బందోబస్ట్ డ్యూటీలో పోలీసులు అత్యుత్సాహంతో వ్యవహరించారనే ఆరోపణలు ఈ ఘటనలపై విచారణకు ఆదేశించేలా చేశాయి. అతి ప్రాచీనమైన వరదార్ యొక్క పవిత్ర విగ్రహాన్ని 40 సంవత్సరాల తరువాత ఆలయ చెరువు నుండి బయటకు తీసినప్పటి నుండి గత కొన్ని రోజులుగా ఈ ఆలయం భారీగా భక్త జనంతో క్రిక్కిరిసిపోతుంది. ఇక నిన్నటికి నిన్న ఈ ఆలయం వద్ద పోలీసుల లాఠీ చార్జ్ వల్ల ఇద్దరు మరణించారన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి.

ఒక ఆటో డ్రైవర్ ను కొట్టిన పోలీసులు .. ఆత్మహత్య చేసుకుని మృతి చెందారని చెప్తున్న స్థానికులు

ఒక ఆటో డ్రైవర్ ను కొట్టిన పోలీసులు .. ఆత్మహత్య చేసుకుని మృతి చెందారని చెప్తున్న స్థానికులు

మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆలయం చుట్టూ ఉంచిన బారికేడ్ల వద్ద షేర్-ఆటో డ్రైవర్ కుమార్ (35) ను పోలీసులు ఆపారు. ఆలయ రహదారుల్లోకి ప్రవేశం లేదని చెప్పి అతనిపై దాడి చేశారు. కుమార్ తన వాహనాన్ని వదిలి వెళ్ళిపోయాడు. పోలీసులు అతని వాహనాన్ని తొలగించగా, కుమార్ పెట్రోల్ బాటిల్‌తో తిరిగి వచ్చి ఆత్మహత్యా యత్నం చేశాడని కుమార్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించాడని స్థానికులు కొందరు పోలీసుల వల్లే కుమార్ అనే ఆటో డ్రైవర్ చనిపోయాడని చెప్తున్నారు.

సెల్ఫీ తీసుకునే ఆంధ్రా యువకుడ్ని లాఠీలతో బాదిన పోలీసులు .. యువకుడు మృతి

సెల్ఫీ తీసుకునే ఆంధ్రా యువకుడ్ని లాఠీలతో బాదిన పోలీసులు .. యువకుడు మృతి

ఇక మధ్యాహ్నం 3 గంటల సమయంలో, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శక్తి ఆకాష్ (23) ఆలయ ప్రాంగణంలో తన తల్లి, సోదరుడితో కలిసి సెల్ఫీ తీసుకుంటుండగా, ఒక మహిళా పోలీసు, జనాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తూ , అతన్ని రెండుసార్లు లాఠీతో కొట్టారని ఆరోపించారు. వెంటనే శక్తి క్రింద పడిపోయారని అతన్ని ఆసుపత్రికి తరలించారు, ఈ ఘటనలో ఆకాశ్ కు తీవ్రగాయాలు కాగా, మరణించాడని బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆకాశ్, రాజమండ్రి వాసిగా తెలుస్తోంది. తెలుగు భక్తుని మృతిపై కంచి దేవాలయంలో ఇతర భక్తులు ఆందోళనకు దిగారు దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. జరిగిన ఘటనపై సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి, సెక్యూరిటీ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు.

గుండె పోటుతో భక్తుడు మృతి చెందాడని చెప్తున్న పోలీసులు .. విచారణకు కలెక్టర్ ఆదేశం

గుండె పోటుతో భక్తుడు మృతి చెందాడని చెప్తున్న పోలీసులు .. విచారణకు కలెక్టర్ ఆదేశం

అయితే ఈ ఘటనలకు తమకు ఎలాంటి సంబంధం లేదని, పోలీసులు కొట్టటం వల్లే చనిపోయారని వస్తున్న వార్తలను తాము ఖండిస్తున్నామని పోలికలు పేర్కొన్నారు. శక్తి ఆకాష్ గుండెపోటుతో మరణించారని పేర్కొంటున్నారు. ఇక ఆలయంలో పోలీసుల తీరుపై వస్తున్న ఆరోపణల నేపధ్యంలో కంచి కలెక్టర్ ఈ ఘటనలపై విచారణకు ఆదేశించారు.

English summary
An autorickshaw driver immolated himself while a youngster from Andhra Pradesh died of cardiac arrest on Wednesday due to alleged highhandedness of police on bandobust duty at the Vardaraja Perumal temple in Kancheepuram. The temple has been witnessing huge crowds for the last few days, since the holy idol of Athi Varadar was taken out of the temple pond after a gap of 40 years.Sakthi Aakash (23), from Andhra Pradesh, was taking a selfie with his mother and brother at the temple premises when a woman cop, attempting to clear the crowd, allegedly hit him twice with a lathi. Eyewitness Mani Shankar said Sakthi collapsed immediately. He was rushed to the hospital, but was declared brought dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X