కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు షాక్: వైయస్ వివేకానంద రెడ్డి అసంతృప్తి, కారణం అదేనా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన బాబాయి, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి అసంతృప్తితో ఉన్నారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన బాబాయి, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి అసంతృప్తితో ఉన్నారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.

ఏపీకి బిల్‌గేట్స్ వస్తున్నారు, అందుకే, ఆ పథకాలు తీసేస్తా: చంద్రబాబుఏపీకి బిల్‌గేట్స్ వస్తున్నారు, అందుకే, ఆ పథకాలు తీసేస్తా: చంద్రబాబు

వైయస్ వివేకానంద రెడ్డి

వైయస్ వివేకానంద రెడ్డి

వైయస్ రాజశేఖర రెడ్డి మృతి చెందిన కొన్నాళ్లకు వైయస్ జగన్ పార్టీ పెట్టారు. కానీ వైయస్ వివేకానంద మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. అంతేకాదు, ఆ తర్వాత ఉప ఎన్నికలలోను వైయస్ కుటుంబ సభ్యులపై పోటీ చేసి ఓడిపోయారు. తొలుత జగన్‌కు దూరంగా ఉన్న వివేకా.. ఆ తర్వాత దగ్గరయ్యారు. వైసిపిలో చేరారు.

జగన్ హామీ ఇచ్చారా?

జగన్ హామీ ఇచ్చారా?

అయితే, ప్రస్తుతం ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సంతృప్తిగా లేరనే ప్రచారం సాగుతోంది. అందుకు జగన్ తీరు కారణమని అంటున్నారు. 2019 ఎన్నికల్లో కడప టిక్కెట్ కావాలని వైయస్ వివేకా అడగ్గా.. అప్పుడు జగన్ అంగీకరించారని అంటున్నారు. కానీ ఇప్పుడు అది నెరవేరేలా లేదని, దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు.

అవినాశ్ రెడ్డిస్థానంలో వైయస్ వివేకా

అవినాశ్ రెడ్డిస్థానంలో వైయస్ వివేకా

ప్రస్తుతం కడప ఎంపీగా అవినాశ్ రెడ్డి ఉన్నారు. 2019లో ఆయనను మరో శాసన సభ నియోజకవర్గానికి పంపించి, వైయస్ వివేకానంద రెడ్డికి కడప లోకసభ టిక్కెట్ ఇవ్వాలని భావించారట.

వివేకానంద అసంతృప్తితో ఉన్నారా?

వివేకానంద అసంతృప్తితో ఉన్నారా?

అయితే, అవినాస్ రెడ్డిని కడప నుంచి కదపవద్దని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. దీనిని వైయస్ వివేకానంద రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన జగన్ పైన అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.

English summary
It is sait that YSR Congress Party leader and former minister YS Vivekandna Reddy is unhappy with party chief YS Jaganmohan Reddy over Kadapa MP issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X