కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ఆర్ సీపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన వాయిదా?

|
Google Oneindia TeluguNews

Recommended Video

మళ్లీ వాయిదా పడ్డ వైసిపి అభ్యర్థుల తొలి జాబితా.. వాయిదాకు కారణం ఇదే ! | Oneindia Telugu

కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెదనాన్న వివేకానంద రెడ్డి అనుమానాస్పద మృతి వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. రాజకీయ రంగు పులుముకుంటోంది. వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినట్లు తొలుత వార్తలు వచ్చినప్పటికీ.. ఆయన భౌతిక కాయం రక్తపు మడుగులో పడి ఉండటంతో పాటు తల, ముఖం, చేతులపై గాయాలు ఉండటంతో అనుమానాలు చెలరేగాయి. పోలీసులు కూడా అనుమానాస్పద మరణం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.

జ‌గ‌న్ కుటుంబంలో విషాదం : వైయ‌స్ వివేకా క‌న్నుమూత : పులివెందుల‌కు జ‌గ‌న్‌..!జ‌గ‌న్ కుటుంబంలో విషాదం : వైయ‌స్ వివేకా క‌న్నుమూత : పులివెందుల‌కు జ‌గ‌న్‌..!

వివేకానంద రెడ్డి మరణం వైఎస్ జగన్ కుటుంబంలో పెను విషాదాన్ని మిగిల్చింది. పార్టీలోకి కొత్తగా చేరుతున్న నాయకులతో ఎన్నికలను ఎదుర్కొనడానికి సమరోత్సాహంతో సన్నద్ధమౌతున్న వైఎస్ఆర్ సీపీకి ఇది ఊహించని విఘాతంలా మారింది. పార్టీ నాయకులు సైతం విషాదంలో మునిగిపోయారు. దీని ప్రభావం- తొలి జాబితాపై పడే అవకాశం ఉంది.

Is YSRCP first list of candidates declared postpone?

నిజానికి- ఈ నెల 16వ తేదీన అంటే.. శనివారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించాల్సి ఉంది. 16న ఉదయం 10:30 గంటల సమయంలో ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ప్రార్థనల అనంతరం.. తొలి జాబితాను వెలువరించాల్సి ఉంది. అనూహ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి అనుమానాస్పద మరణం వల్ల ఈ జాబితా ప్రకటించడాన్ని వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
YSR Congress Party candidates first list may be postponed in the row of YS Vivekananda Reddy's suspicious death, party sources said. YS Vivekananda Reddy, who is the former Lok Sabha member and former minister of Andhra Pradesh died in suspicious circumstances at his residence in Pulivendula.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X