గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పేలుళ్లకు కుట్ర: ఐసీస్‌లో చేరుతున్న ఏపీ యువకులు, ఓ సైంటిస్ట్ కూడా

తెలుగు రాష్ట్రాల నుంచి ఉగ్రవాద సంస్థ ఐసీస్(ఐస్ఎస్ఐఎస్)లో చేరుతున్న యువకుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల నుంచి ఉగ్రవాద సంస్థ ఐసీస్(ఐస్ఎస్ఐఎస్)లో చేరుతున్న యువకుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది. మంగళవారం ఓ ఐసీస్ అనుమానితుడ్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ అరెస్ట్ చేసిన ఆ విద్యార్థి అబు.. హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. అంతేగాక, మరిన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి.

గల్ఫ్‌లో ఉద్యోగం పేరుతో తెలుగు రాష్ట్రాల నుంచి వెళుతున్న యువకులు.. ఉగ్రవాద సంస్థలో చేరుతున్నట్లు సమాచారం. ఇప్పటికే 70మంది యువకులను అరెస్ట్ చేసి కౌన్సలింగ్ ఇస్తున్నారు ఎన్ఐఏ అధికారులు, పోలీసులు. గల్ఫ్ వెళ్లే యువకులపై ప్రభుత్వం నిఘా పెట్టడంతోనే వీరంతా చిక్కినట్లు తెలుస్తోంది.

ISIS attracts AP youth

మచిలీపట్నంకు చెందిన తరీరుల్ రహమాన్, గుంటూరుకు చెందిన ఓ సైంటిస్టు కూడా ఐసీస్‌లో చేరినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఇండియా నుంచి 300మంది యువకులు ఐసీస్ తరపున యుద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఒక్క కేరళ నుంచే 60మంది యువకులు యెమన్, సిరియాల్లో ఐసీస్ తరపున పని చేస్తుండటం గమనార్హం.

గుంటూరు, మచిలీపట్నం, హైదరాబాద్‌ల నుంచి ఐసీస్ కోసం ఆరుగురు యువకులు పని చేస్తున్నారని తెలిసింది. గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన 26మంది యువకులను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు.. కౌన్సిలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. సోషల్ మీడియా ద్వారానే ఐసీస్ తన రిక్రూట్‌మెంట్లను
చేస్తున్నట్లు సమాచారం. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీకి చెందిన యువకులు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.

English summary
An Intelligence official from AP said, “A person identified as Tulfizur Rehman, 38, an engineer from Machilipatnam who took up a job in Kuwait, has reportedly joined the ISIS. One more person, a scientist from Guntur, is working for the ISIS in Yemen.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X