విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాయుగుండం ముప్పు: కోస్తా, ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు, హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం భారీ వర్షాలతో మరోసారి ఉత్తరాంధ్ర, కోస్తాను వణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్పపీడనం కారణంగా కోస్తాకు వాయుగుండం ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

కాగా, ఉత్తరాంధ్ర, ఒడిశా వైపు అల్పపీడనం పయనిస్తోందని, అల్పపీడనం మరింత బలపడినట్టు వాతావరణం కేంద్రం తెలిపింది. అది వాయుగుండంగా మారి మచిలీపట్నానికి 230 కి.మీ.. విశాఖకు దక్షిణంగా 300 కి.మీ, గోపాల్‌ పూర్‌కు 500 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్టు అధికారులు వెల్లడించారు.

Isolated heavy rain likely

రానున్న 24 గంటల్లో వాయుగుండం ఈశాన్య దిశగా పయనించనుంది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు పడతాయని, అక్కడక్కడ అతిభారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

తీరం వెంబడి 45 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ప్రభావిత జిల్లాలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.

English summary
The well marked low pressure area over west central and adjoining southwest Bay of Bengal and associated upper air cyclonic circulation extending up to 7.6 km above mean sea level persists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X