వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్‌వీ సి-46 .. రక్షణ శాఖకు కీలకంగా ఈ ప్రయోగం

|
Google Oneindia TeluguNews

ఇస్రో ఖాతాలో మరో విజయం నమోదైంది . భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ46 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. 615 కిలోల బరువు గల రీశాట్‌-2బీఆర్‌1 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ46 వాహక నౌక 557 కి.మీ ఎత్తులోని కక్షలో ప్రేవేశపెట్టింది. దీంతో పీఎస్‌ఎల్‌వీ-సీ46 ప్రయోగం దిగ్విజయమైంది.

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ46.. రక్షణ శాఖకు కీలకంగా మారనున్న ఉపగ్రహం

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ46.. రక్షణ శాఖకు కీలకంగా మారనున్న ఉపగ్రహం

ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ మంగళవారం ఉదయం 4.30 గంటలకు ప్రారంభమైంది. 25 గంటల కౌంట్‌డౌన్‌ ముగిసిన అనంతరం బుధవారం ఉదయం 5.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ46 నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ బయలుదేరిన తర్వాత 15.29 నిమిషాలకు ఉపగ్రహం విడిపోయింది. అత్యంత ఆధునిక రాడార్‌ ఇమేజింగ్‌ భూపరిశీలన ఉపగ్రహమైన రీశాట్‌-2బీఆర్‌1 కాలపరిమితి ఐదేళ్లు. ఈ ఉపగ్రహం రక్షణశాఖకు కీలకంగా మారనుంది. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను ఈ ఉపగ్రహం సులువుగా గుర్తించేందుకు వీలుంది.

విపత్తు నిర్వహణలోనూ కీలకంగా రీశాట్‌-2బీఆర్‌1

అంతేకాక వ్యవసాయం, అటవీ రంగాల సమాచారంతో పాటు ప్రకృతి విపత్తుల్లో ఈ ఉపగ్రహం సాయపడనుంది. మొదటగా 2009లో రీశాట్‌ను ఇస్రో ప్రయోగించింది. 2012లో రీశాట్‌-1ను ప్రయోగించింది. రీశాట్ సిరీస్‌లో ఇది నాలుగో ఉపగ్రహం. 2009లో పంపిన రీశాట్-2 ఉపగ్రహం స్థానంలోకి దీనిని చేరుస్తారు. ఇందులో అమర్చిన అత్యాధునిక రాడార్ భూమిపై ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా స్పష్టమైన ఛాయాచిత్రాలను అందించగలుగుతుంది. ఇది ప్రధానంగా వాతావరణ మార్పులపై నిఘా ఉంచనుంది . విపత్తుల సమయంలో అత్యవసర సహాయం అందిస్తుంది. అంతేకాకుండా సైన్యం నిఘా కార్యకలాపాలకు కూడా సహాయపడనున్నది.

ప్రయోగం సక్సెస్.... శాస్త్రవేత్తల్లో వెల్లివిరుస్తున్న ఆనందం

ప్రయోగం సక్సెస్.... శాస్త్రవేత్తల్లో వెల్లివిరుస్తున్న ఆనందం

ఇస్రో చైర్మన్ కే శివన్ మాట్లాడుతూ... రీశాట్-2బీ ప్రయోగం భారతదేశానికి, ఇస్రోకు అత్యంత ముఖ్యమైన మిషన్ అని పేర్కొన్నారు. ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్‌వీ ప్రయోగాల్లో ఇది 48వదని పేర్కొన్నారు. రక్షణా రంగానికి మాత్రమే కాకుండా , విపత్తు నిర్వహణకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ ప్రయోగం సక్సెస్ కావటంతో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరుస్తుంది.

English summary
The Indian Space Research Organisation (ISRO) scripted history on Wednesday by successfully launching earth observation satellite RISAT-2B that would enhance the country's surveillance capabilities among others.As the 25-hour countdown which began on Tuesday concluded, the agency's trusted workhorse Polar Satellite Launch Vehicle (PSLV-C46) blasted off at 5.30 am from the first launch pad of the Satish Dhawan Space Centre in Andhra Pradesh's Sriharikota on its 48th mission, carrying the 615 kg satellite.The RISAT-2B (Radar Imaging Satellite-2B), meant for application in fields such as surveillance, agriculture, forestry and disaster management support, was released into the orbit around 15 minutes after the lift-off.It would replace the RISAT-2, which was successfully launched in 2009.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X