వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5 చోట్ల దాడులు, రూ.2 వేల కోట్ల గుర్తింపు, దాడుల వివరాలు బయటపెట్టిన ఐటీశాఖ

|
Google Oneindia TeluguNews

తెలుగురాష్ట్రాల్లో దాడుల వివరలను ఐటీ శాఖ బయటపెట్టింది. 3 ఇన్ ఫ్రాం కంపెనీలపై దాడుల చేసి.. రూ.2 వేల కోట్ల అక్రమ ఆస్తులు గుర్తించినట్టు పేర్కొన్నది. గతవారం హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్టణంలో ఐటీ శాఖ దాడులు చేసిన సంగతి తెలిసిందే. బోగస్ కంపెనీల పేరుతో వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఐటీ శాఖ తేల్చిచెప్పింది. ఈ మేరకు వివరాలను మీడియాకు విడుదల చేసింది.

ఫేక్ కంపెనీలు

ఫేక్ కంపెనీలు


2 కోట్ల టర్నోవర్ దాటని కంపెనీలను సృష్టించి రూ.2 వేల కోట్లు దారి మళ్లించినట్టు ధ‌‌ృవీకరించింది. 40 రోజులపాటు 5 చోట్ల దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఆర్వఆర్ ఇన్ ప్రాం, ఆర్కె కంపెనీల పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని వివరించారు. నకిలీ బిల్లులతో భారీగా లావాదేవీలు జరిగాయని.. ఎఫ్‌డీఐల పేరుతో ఇన్‌ఫ్రా‌స్ట్రక్చర్ కంపెనీ మోసం చేశారని తెలిపాయి. బోగస్ బిల్లులు, అధిక రేట్లపై ఇన్వాయిస్ ద్వారా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించింది.

మాజీ పీఎస్ ద్వారా..

మాజీ పీఎస్ ద్వారా..

ఏపీకి చెందిన ప్రముఖ వ్యక్తి మాజీ పీఎస్ ఇంట్లో చేసిన దాడుల్లో కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్లోంది. దాడులతో రాకెట్ బయటపడింది. ఉనికిలో లేని కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్టు పత్రాలు సృష్టించారని తెలిపిది. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ 2,000 కోట్లు చేతులు మారినట్టు ఐటీ అధికారులు భావిస్తున్నారు. పన్ను లెక్కలకు దొరకకుండా రూ 2 కోట్ల లోపు చిన్న మొత్తాల రూపంలో నిధుల దారి మళ్లించారని పేర్కొన్నారు.

85 లక్షల నగదు

85 లక్షల నగదు


ప్రధాన కార్పొరేట్ సంస్థ ఐపీ అడ్రస్ నుంచి సబ్ కాంట్రాక్టర్లు, ప్రధాన కాంట్రాక్టర్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు గుర్తించారు. గ్రూపు కంపెనీలకు కోట్ల రూపాయల అనుమానిత విదేశీ పెట్టుబడులు వచ్చాయన్నారు. రూ .85 లక్షల అక్రమ నగదు, 75 లక్షల నగలు, 25 బ్యాంక్ లాకర్లు సీజ్ చేసినట్టు తెలిపారు.

English summary
it release about raids on telugu states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X