వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగొచ్చిన ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్..! విచారణకు సిద్ధమంటున్న డేటా డీలర్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గత తెలుగుదేశం పార్టీలో నెలకొన్న రాజకీయ చిక్కుముడులు ఒక్కొక్కటి విడిపోతున్నాయి. పరిష్కారానికి నోచుకోని కొన్ని సమస్యలకు ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఓ కొలిక్కి వస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో కీలక నిందితుడుగా అనుమానిస్తున్న ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ ఎట్టకేలకు దిగొచ్చారు. విచారణకు సిద్ధమంటూ ప్రత్యక్షమయ్యారు. విచారణకు సిద్ధమంటూ మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే విచారణలో భాగంగా సిట్ ఎదుట హాజరుకావాలని పోలీసులు సూచించారు. దీంతో గురువారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. గురువారం గోషామహాల్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు ఐటీ గ్రిడ్ ఎంపీ అశోక్.

IT Grid MD Ashok came into public.! Data dealer preparing for trial..!!

సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీ ప్రజల డేటాను చోరీ చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థపై దాడులు నిర్వహించారు. దాడులలో ప్రజలకు సంబంధించిన కీలక డేటా స్వాధీనం చేసుకున్న తెలంగాణ పోలీస్ శాఖ. కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. డేటా చోరీ అంశం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపడంతో తెలంగాణ ప్రభుత్వం విచారణకు సిట్ ను నియమించింది. సిట్ విచారణకు హాజరుకావాలంటూ ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ కు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. కానీ అశోక్ విచారణకు హాజరుకాలేదు. అయితే ముందస్తు బెయిల్ కోసం ఇటీవలే తెలంగాణ హైకోర్టును అశోక్ ఆశ్రయించారు. మెుత్తానికి ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ సిట్ విచారణకు సిద్ధమవ్వడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

English summary
IT grid company MD Ashok, who is suspected to be a key accused in the sensational data-grabbing case in Telugu states, has finally landed. Appeared before the trial. He went to Madapur police station to prepare for the trial.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X