వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చూస్తుంటే ఏం జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తోంది: మోడీకి పవన్ షాక్, ఫ్రెండ్ కవిత అటాచ్

వయో వృద్ధుల విషయంలో ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నోట్ల రద్దు పైన ప్రజల్లో ఉన్న అశాంతిని తొలగించాలని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఆదివారం నాడు స్పందించారు. ఈ సందర్భంగా పవన్ మోడీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.

వయో వృద్ధుల విషయంలో ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నోట్ల రద్దు పైన ప్రజల్లో ఉన్న అశాంతిని తొలగించాలన్నారు. కొత్త నోట్లు ఎంత శాతం ఉందనే దాని పైన కేంద్రం స్పష్టత ఇవ్వాలని చెప్పారు. నోట్ల మార్పిడి విషయంలో ప్రభుత్వం సరైన కసరత్తు చేసిందా అని ప్రశ్నించారు.

It is evident from the current situation that government has not done enough exercise: Pawan Kalyan

గ్రామీణ ఆర్థిక వ్యవస్థష అసంఘటిత అర్బన్ మార్కెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. నోట్ల రద్దు నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉండెనని అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దుకు ముందు ఎలాంటి ఎక్సర్‌సైజ్ చేయనట్లుగా కనిపిస్తోందన్నారు.

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రభుత్వం ఏ ముందస్తు చర్యలు తీసుకున్నట్లుగా కనిపించడం లేదన్నారు. అలాగే ఇలా ప్రజలు ఇబ్బంది పడతారని భావించినట్లుగా లేదని అభిప్రాయపడ్డారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూ, ప్రజల ఇబ్బందులను ఉద్దేశించి ఆయన అలా చెప్పారు. ఈ సందర్భంగా పవన్ తన స్నేహితుడు సాయి మాదవ్ రాసిన ఓ కవితను ట్వీట్ చేశారు.

English summary
It is evident from the current situation that government has not done enough exercise, says Pawan Kalyan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X