వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది పవన్ కల్యాణ్ వ్యక్తిగతం: సోము వీర్రాజు, "చెల్లని డ్రగ్ లాంటివాడు"

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడం ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ వ్యక్తిగతమని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. తనపై, పార్టీపై వస్తున్న విమర్శలకు అభివృద్ధే సమాధానం చెబుతుందని ఆయన గురువారం విశాఖపట్నంలో మీడియాతో అన్నారు.

పవన్ కళ్యాణ్ కష్టపడితే, చంద్రబాబు అధికారం: రూటుమార్చిన బిజెపి, కాంగ్రెస్

రైతుల కోసం కేంద్ర ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 26వ తేదీన తాడేపల్లిగూడెం రైతు మహాసభలో పాల్గొంటారని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 23వ తేదీన తిరుపతిలో జరిగే సైన్స్ కాంగ్రెసుకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారని ఆయన చెప్పారు. రైతులను దోచుకుంటున్న దళారీ వ్యవస్థపై ప్రభుత్వం దృష్టించి సారించాలని ఆయన అన్నారు.

ఆయన కాలం చెల్లిన డ్రగ్ లాంటివాడు

పిసిసి అధ్యక్షుడు కాలం చెల్లిన డ్రగ్ లాంటివాడని తెలుగుదేశం పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. పాదయాత్రలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆయన గురువారం మీడియాతో అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలో ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయాయని ఆయన అన్నారు.

BJP MLC Somu Veerraju said that it is Jana sena chief Pawan klayan's personal to expand his party.

క్యాడర్‌నుు నిలబెట్టుకోవడానికే కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు. దమ్ముంటే ఆ పార్టీలు అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు.

చంద్రబాబు కోరినా

జనచైతన్య యాత్రలు చేయడం కాదు, మొదట తెలుగుదేశం పార్టీ నాయకుల్లో మార్పు రావాలని కాంగ్రెసు నాయకుడు సి. రామచంద్రయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాలని చంద్రబాబు కోరినా అరుణ్ జైట్లీ స్పందించకపోవడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు.

బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాయలసీమ నష్టపోతుందని ఆయన గురువారం కడపలో మీడియాతో అన్నారు. అయినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం సరి కాదని ఆయన అన్నారు.

English summary
BJP MLC Somu Veerraju said that it is Jana sena chief Pawan klayan's personal to expand his party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X