చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎల్ఐసీ ఏజెంట్-‘కల్కి భగవాన్’: లెక్కలేని ఆస్తులు రూ.500 కోట్లు, గుట్టలుగా నగదు, ఆభరణాలు, ఏం జరిగింది

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కలియుగ ప్రత్యక్ష దైవంగా తనకు తాను ప్రకటించుకున్న కల్కి భగవాన్ అలియాస్ విజయ్ కుమార్ ఆశ్రమాలు, ఆయనకు సంబంధించిన నివాసాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. సోమవాంర కల్కీకి చెందిన వైట్ లోటస్‌లో ఐటీ దాడులు ముగిశాయి. ఐటీ దాడుల్లో గుట్టగుట్టలుగా నగదు, ఆభరణాలు బయటపడుతుండటం గమనార్హం.

300మంది ఐటీ అధికారులు..

300మంది ఐటీ అధికారులు..

వైట్ లోటస్‌లో సుమారు రూ. 44కోట్లకుపైగా నగదును ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. దేశంలోని 40 ప్రాంతాల్లో 300 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం గమనార్హం. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, చిత్తూరు, తదితర ప్రాంతాల్లో కల్కీకి చెందిన ఆస్తులపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు.

హవాలా ద్వారా కోట్లు..

హవాలా ద్వారా కోట్లు..

గత నాలుగు రోజులుగా ఐటీ అధికారులు జరుపుతున్న సోదాల్లో లెక్కల్లోకి రాని రూ. 500 కోట్లను ఐటీ అధికారులు గుర్తించడం గమనార్హం. విదేశాల్లోనూ కల్కీకి భారీగా ఆస్తులున్నట్లు తేల్చారు అధికారులు. హవాలా వ్యాపారం ద్వారా 85 కోట్ల రూపాయలు కల్కీ ఆశ్రమానికి వచ్చినట్లు ఐటీ అధికారులు గుర్తించారు.

గుట్టలుగా కరెన్సీ నోట్లు.. బంగారు ఆభరణాలు..

గుట్టలుగా కరెన్సీ నోట్లు.. బంగారు ఆభరణాలు..

ఇప్పటికే 90 కిలోల బంగారం, ఆభరణాలు, గోల్డ్ బాక్సులు, కీలకమైన డాక్యుమెంట్లను ఐటీ అధికారులు గుర్తించారు. గుట్టలుగా కరెన్సీ నోట్లు, బంగారు ఆభరణాలు లభ్యమవుతుండటంతో ఐటీ అధికారులు కూడా షాకవుతున్నారు. ఇంత భారీస్థాయిలో కల్కీ ఆస్తులు ఎలా కూడబెట్టారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

ఎల్ఐసీ ఏజెంట్ స్థాయి నుంచి..

ఎల్ఐసీ ఏజెంట్ స్థాయి నుంచి..

సేవా దృక్పథంతో స్థాపించిన సంస్థలో ఇంత భారీ ఆస్తులెలా వచ్చాయని విచారిస్తున్నారు. ఓ సాధారణ ఎల్ఐసీ ఏజెంట్‌గా జీవితాన్ని ప్రారంభించిన విజయ్ కుమార్.. ఆ స్థాయి నుంచి కల్కి భగవాన్‌గా మారి వేల కోట్ల ఆస్తులు, కిలోల కొద్ది బంగారం సంపాదించడంపై ఐటీ అధికారులు లోతుగా విచారణ జరుుపుతున్నారు.

విదేశాల్లోనూ భారీగా ఆస్తులు..

విదేశాల్లోనూ భారీగా ఆస్తులు..

కల్కి భగవాన్.. భక్తుల నుంచి వచ్చిన సొమ్మును చైనా, అమెరికా, సింగపూర్, యూఏఈల్లోని పలు వ్యాపారాలు, కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టినట్లు గుర్తించారు. బినామీ ఆస్తులు కూడా కల్కి భగవాన్ దగ్గర భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల్లోనే 500 కోట్ల రూపాయలకు పైగా లెక్కలేని ఆస్తులు బయటపడటంతో.. ఐటీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

English summary
IT raids in kalki bhagavan Ashram and residences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X