గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసిపి ఎంపి అభ్య‌ర్ది పై ఐటి దాడులు : నివాసం..కార్యాల‌యాల్లొ సోదాలు : అనుచ‌రుల ను వ‌ద‌ల్లేదు..!

|
Google Oneindia TeluguNews

ఏపి లో ఎన్నిక‌ల వేళ ఐటి దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. పోటీలో ఉన్న అభ్య‌ర్దుల పై ఐటి దాడులు చేయ‌కూడ‌ద నే వాద‌న ఉన్నా..ఐటి అధికారులు మ‌త్రం సోదాలు కొన‌సాగిస్తున్నారు. తాజాగా గుంటూరు నుండి వైసిపి ఎంపి అభ్య‌ర్ది గా బ‌రిలో ఉన్న మోదుగుల వేణుగోపాల రెడ్డి నివాసం..కార్యాలయం పై ఐటి అధికారులు దాడులు చేసారు.

ఈ వైసిపి అభ్య‌ర్ది ల‌క్ష్యంగా..
మంగ‌ళ‌వారం రాత్రి టిడిపి ఎంపి అభ్య‌ర్ది గ‌ల్లా జ‌య‌దేవ్ ఆడిట‌ర్ కార్యాల‌యం పై ఐటి అధికారులు దాడి చేసారు. గ‌ల్లా ఆడిట‌ర్ ను సుదీర్ఘంగా విచారించారు. దీని పై టిడిపి శ్రేణులు అందోళ‌న వ్య‌క్తం చేసాయి. టిడిపి అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల సంఘానికి దీని పై లేఖ రాయ‌టంతో పాటుగా సీఈవో కార్యాలయం ముందు ధ‌ర్నా చేసారు. ఇది జ‌రిగిన కొద్ది గంట‌ల‌కే గుంటూరు వైసిపి ఎంపి అభ్య‌ర్ది మోదుగుల వేణు గోపాల రెడ్డి నివాసం..కార్యాల‌యం పై ఐటి అధికారులు దాడులు చేసారు. మ‌రి కొద్ది గంట‌ల్లో పోలింగ్ ఉంది..తన పై ఎటువంటి ఫిర్యాదులు లేవ‌ని మోదుగుల చెప్పినా ఐటి అధికారులు వినిపించుకోలేదు. బ్యాంకు ఖాతాల లావాదేవీలు..న‌గ‌దు లెక్క‌లు..ఎన్నిక‌ల ప‌రిశీల‌కుల‌కు అప్ప‌గించిన వివ‌రాల‌ను ప‌రిశీలించారు.

IT Raids on Guntur YCP Mp Candidate Modugula : Modugula says its only political intention

అనుచ‌రుల నివాసాల్లోనూ సోదాలు..
మోదుగుల వేణు గోపాల రెడ్డి నివాసం..కార్యాల‌యం తో పాటుగా ఆయ‌న ప్ర‌ధాన ఎన్నిక‌ల ఏజెంట్ పైనా..లీగ‌ల్ స‌ల‌హా దారుడి నివాసం పైనా ఐటి అధికారులు దాడులు చేసారు. వారి ఇళ్ల‌ల్లో సోదాలు కొన‌సాగించారు. అయితే ఈ దాడుల పై వేణు గోపాల రెడ్డి స్పందిస్తూ ఐటీ దాడులకు తాను ఏమాత్రం భయపడేది లేదని, దాడులతో తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని స‍్పష్టం చేశారు. పోలింగ్‌కు మరికొద్ది గంటల సమయం ఉందని, భయపెట్టేందుకే ఈ సమయంలో ఐటీ దాడులు చేపట్టారన్నారు.అయితే, ఐటి అధికారులు ప్ర‌ధానంగా గుంటూరు నుండి పోటీలో ఉన్న టిడిపి..వైసిపి అభ్య‌ర్దుల పైనే గురి పెట్ట‌టం వెనుక ఉన్న ల‌క్ష్యం ఏంట‌నే చ‌ర్చ మొద‌లైంది. ఏపిలో మొత్తం 25 లోక్‌స‌భ స్థానాలు ఉండ‌గా..ఐటి అధికారులు మాత్రం గుంటూరు లోక్‌స‌భ నుండి పోటీలో ఉన్న అభ్య‌ర్దుల పైనే దృష్టి పెట్టారు.

English summary
IT raids continues in AP. IT officers searched in Guntur YCP loksabha contesting candidate Modugula Veu Gopal Reddy house and party office. It officials also raid on Modugula followers houses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X