వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో చంద్రబాబు సన్నిహితులపై మరోసారి ఐటీ పంజా, లింగమనేని, చైతన్య, నారాయణ కాలేజీల ఆఫీసుల్లో సోదాలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో చంద్రబాబు సన్నిహితులపై మరోసారి ఐటీ పంజా విసిరింది. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి యజమాని లింగమనేని రమేష్ తో పాటు రాష్ట్రంలోని నారాయణ, చైతన్య విద్యాసంస్ధల క్యాంపస్ లలోనూ ఇవాళ ఐటీ సోదాలు చేస్తోంది. వీటిలో పలు కీలక డాక్యుమెంట్లను, రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు సన్నిహితులపై మరోసారి ఐటీ పంజా

చంద్రబాబు సన్నిహితులపై మరోసారి ఐటీ పంజా


గత నెలలో ఏపీలోని చంద్రబాబు మాజీ కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ తో పాటు మరికొందరు టీడీపీ ముఖ్యనేతల కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో 2 వేల కోట్ల రూపాయల మేర అక్రమ లావాదేవీలకు సంబందించిన ఆధారాలు సంపాదించిన ఐటీ శాఖ.. ఇవాళ మరికొందరి కార్యాలయాల్లో దాడులు నిర్వహిస్తోంది. ఇందులో చంద్రబాబు ఉండవల్లి నివాసం యజమాని లింగమనేని రమేష్ కు చెందిన లింగమనేని ప్రాపర్టీస్ తో పాటు చైతన్య విద్యాసంస్ధలు కూడా ఉన్నాయి. విజయవాడ గాయత్రీ నగర్ లోని లింగమనేని ప్రాపర్టీస్ కార్యాలయంతో పాటు రాష్ట్రంలో చైతన్య, నారాయణ విద్యాసంస్ధలకు చెందిన పలు క్యాంపస్ లలో ఐటీ దాడులు చేస్తోంది. ఇందులో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.

ఏపీలో ఐటీ దాడులు- పార్ట్ 2

ఏపీలో ఐటీ దాడులు- పార్ట్ 2

ఏపీలో గత నెలలో జరిపిన ఐటీ సోదాల్లో 2 వేల కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు గుర్తించిన అధికారులు.. ఇప్పుడు వాటికి కొనసాగింపుగా ఈ దాడులు చేస్తున్నారా లేక ఇవి మరో కోణంలో జరుగుతున్నవా తెలియరాలేదు. అయితే గతంలోలా ఈసారి జరుగుతున్న సోదాలు కూడా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా పేరు తెచ్చుకున్న లింగమనేని రమేష్, మాజీ మంత్రి నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్ధలు, బీఎస్ రావుకు చెందిన చైతన్య విద్యాసంస్ధల క్యాంపస్ లలోనూ జరగడం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది.

Recommended Video

Muttamsetti Srinivas Slams Chandrababu Over Comments During Praja Chaitanya Yatra| Oneindia Telugu
ముగ్గురూ టీడీపీకి ఆర్ధిక మూల స్తంభాలే

ముగ్గురూ టీడీపీకి ఆర్ధిక మూల స్తంభాలే

పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ తోపాటు చైతన్య విద్యాసంస్ధల అధినేత బీఎస్ రావు, నారాయణ సంస్ధల అధినేత నారాయణ ముగ్గురూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులే. వీరంతా గతంలో టీడీపీ విజయం కోసం పలు ఎన్నికల్లో ఆర్ధిక సాయం చేసిన వారే. అలాగే గత ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కు మద్దతుగా వీరు నిధులు సరఫరా చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత ఆదేశాలతో వీరు కాంగ్రెస్ కు నిధులు పంపారా అన్న కోణంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు అర్ధమవుతోంది.

English summary
Once again IT Officials are holding rides in Naidu's Close aides properties in AP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X