నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో మరోసారి ఐటీ దాడుల కలకలం: విశాఖలో ఇప్పటికే ప్రారంభం...మరికొద్దిసేపట్లో ఇతర ప్రాంతాల్లో!

|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం: ఏపీలో మరోసారి ఐటి దాడుల కలకలం మొదలయింది. మరో విడత భారీ స్థాయిలో తనిఖీలు చేసేందుకు ఐటీ శాఖ సన్నద్ధమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో విశాఖలో ఇప్పటికే తనిఖీలు ప్రారంభం అయ్యాయి.

సీబీఐ లాంటి సంస్థలను భ్రష్టుపట్టిస్తున్నారు: కేంద్రంపై నిప్పులు చెరిగిన బాబు <br>సీబీఐ లాంటి సంస్థలను భ్రష్టుపట్టిస్తున్నారు: కేంద్రంపై నిప్పులు చెరిగిన బాబు

విశాఖలోని ఎంవీసీ కాలనీలోని అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి కొన్ని ఐటీ బృందాలు బయలుదేరి గాజువాకలోని సెజ్‌లోకి వెళ్లాయి. మరోవైపు ఏ క్షణంలోనైనా విజయవాడ, గుంటూరు, నెల్లూరుల్లోనూ సోదాలు మొదలుపెట్టేందుకు ఐటీ బృందాలు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఆయా ప్రాంతాల్లో సోదాల కోసం హెడ్‌క్వార్టర్స్‌ నుంచి ఆదేశాలు రాగానే ఐటి టీమ్ లు రంగంలోకి దిగుతాయి.

 IT raids started in Visakhapatnam

విశాఖలోని ఎంవీసీ కాలనీలోని అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం బయలుదేరి వెళ్లిన ఐటి బృందాలు ముందుగా జువాకలోని సెజ్‌లోకి వెళ్లాయి. ఐటి అధికారులు జట్లుగా విడిపోయి అందులోని ట్రాన్స్‌వరల్డ్‌ బీచ్‌ శాండ్‌ కంపెనీలో సోదాలు జరుపుతున్నారని సమాచారం. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలోనే వేచి ఉన్న మరికొన్ని బృందాలు నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలకు గాను కాసేపట్లో బయలుదేరతాయని భావిస్తున్నారు.

విశాఖలో ఐటి దాడులు జరగనున్నట్లు బుధవారం నుంచే మీడియాలో స్క్రోలింగ్స్ వెల్లువెత్తాయి. ఇటీవల టిడిపి నేతలు సుజనాచౌదరి, పోతుల రామారావు, సిఎం రమేష్‌ తదితరుల ఇళ్లపై దాడులు నిర్వహించిన ఐటి అధికారులు..ఇప్పుడు మరోసారి భారీ స్థాయిలో దాడులు జరిపేందుకు పక్కా ప్లాన్‌ రచించుకున్నారని తెలిసింది. ఈ దాడులు రెండు మూడు రోజులు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.

ఈసారి దాడుల్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక టిడిపి నాయకుడిని టార్గెట్ చేయడం ఖాయమని వదంతులు వినిపిస్తున్నాయి. పారిశ్రామికవేత్త అయిన ఆయన ఇటీవలే టిడిపిలో చేరారని...అంతకుముందు వైసిపిలో ఉండేవారని...వైసిపి ముఖ్యనేతల కోరిక మేరకు ఐటి ఆయనని టార్గెట్ చేసిందని ప్రచారం జరుగుతోంది. అలాగే రాజధాని ప్రాంతానికి చెందిన ఓ రాష్ట్ర మంత్రిపై కూడా దాడులు నిర్వహించవచ్చని మరో ప్రచారం. అలాగే ఈసారి ఐఎఎస్ అధికారులపై ఐటి దాడులు జరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు.

English summary
Visakhapatnam:Again Income Tax raids started on Thursday in Visakhapatnam. In this background the industrial zone area under Gajuwaka limits in Visakhapatnam had tensed after the IT sleuths conducted raids on Transworld Garnet India Pvt.Ltd (TGI) company which was established at Vizag Special Economic Zone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X