వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్Vsకాంగ్రెస్: అరగంట వట్టి, 10ని.ల్లో దామోదర

By Srinivas
|
Google Oneindia TeluguNews

 damodara rajanarasimha and vatti vasanth kumar
న్యూఢిల్లీ: మంత్రుల బృందం(జివోఎం) ముందు రాష్ట్ర కాంగ్రెసు పార్టీ మళ్లీ రెండు వాదనలు వినిపించింది. జివోఎం అఖిల పక్షానికి కాంగ్రెసు పార్టీ తరఫున ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి వట్టి వసంత్ కుమార్‌లు వెళ్లారు. జివోఎం భేటీలో వట్టి అరగంట పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దామోదర రాజనర్సింహ పది నిమిషాలు ఇచ్చారు. విభజనకు అనుకూలంగా దామోదర, వ్యతిరేకంగా వట్టి జివోఎం ముందు చెప్పారు.

అనంతరం దామోదర విలేకరులతో మాట్లాడుతూ... పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. రాజ్యాంగ్ ప్రకారం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలన్నారు. ఉమ్మడి రాజధానిని హైదరాబాదు రెవెన్యూ జిల్లాకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఐదేళ్లు ఉంచాలని కోరినట్లు చెప్పారు.

భద్రాచలం తెలంగాణలోనే ఉంటుందన్నారు. సీమాంధ్రకు దానిని ఇస్తే చిక్కులొస్తాయన్నారు. గోదావరి పైన రెగ్యురేటరీ అథారిటీ అవసరం లేదన్నారు. ఆంధ్రా ప్రాంతానికి అవసరమైన ప్యాకేజీని ఇవ్వాలని, ఉద్యోగుల విషయంలో 371 డిని కొనసాగించాలని కోరినట్లు చెప్పారు. జనవరి 1 నాటికి తెలంగాణ ఏర్పడుతుందన్నారు.

జివోఎంకు నివేదిక ఇచ్చిన వట్టి మాట్లాడుతూ... విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. విభజనతో రెండు ప్రాంతాలకు అన్నీ నష్టాలే అన్నారు. విభజన నిర్ణయం అనాలోచితమని, కచ్చితంగా పునరాలోచించుకోవాలన్నారు. జల వనరుల పంపిణీ అసాధ్యమని, ఏ కమిటీ, ఏ కమిషన్ కూడా నీటి పంపిణీని పర్యవేక్షించలేవన్నారు. హైదరాబాదు చుట్టు పక్కల అనేక సమస్యలు ఉన్నాయని, వీటిని ఎవరు పరిష్కరించలేరన్నారు.

English summary
Deputy CM Damodara Rajanarasimha and Minister Vatti Vasanth Kumar gave different reports on AP division to GoM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X