వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీలోకి గంటా ఎంట్రీ - అఫీషియల్ : చిరంజీవితో భేటీ - వెంటనే..!!

|
Google Oneindia TeluguNews

ఉత్తరాంధ్రలో టీడీపీ గట్టి షాక్. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా పార్టీ వీడటం ఖాయమైంది. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ అయింది. దీంతో కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి గంటా పూర్తి క్లారిటీతో ముందు అడుగు వేయబోతున్నారు. విశాఖ పరిపాలన రాజధానిగా వైసీపీ ముందుకు వెళ్తున్న సమయంలో ఇది రాజకీయంగా టీడీపీకి షాక్ గా మారుతోంది. ఇదే సమయంలో గంటా వైసీపీకి ఎంట్రీ వేళ.. మరోసారి చిరంజీవి తో భేటీకి గంటా నిర్ణయించారు. ఇప్పటికే చిరంజీవితో చర్చలు చేసిన తరువాతనే గంటా వైసీపీలో చేరిక పైన అధికారిక ప్రకటనకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

Its now official: Ganta entry to YSRCP,decision after meeting with Chiranjeevi -deets here

టీడీపీకి గంటా గుడ్ బై.. వైసీపీలోకి ఎంట్రీ

2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాస రావు విశాఖ నార్త్ నుంచి గెలుపొందారు. ఆ తరువాత కొద్ది కాలం నుంచే గంటా పార్టీ మారుతారనే చర్చ మొదలైంది. వైసీపీ ముఖ్యనేత విజయ సాయిరెడ్డి ఓపెన్ గా నే ఈ విషయం ప్రకటించారు. కానీ, గంటా పార్టీ మారలేదు. అదే సమయంలో..టీడీపీతోనూ దూరంగా ఉంటున్నారు. కొద్ది నెలల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ లేఖ పంపారు.

విశాఖలో పరిపాలనా రాజధాని నిర్ణయం పైన అక్కడి టీడీపీ నేతలు వ్యతిరేకంగా మాట్లాడినా..గంటా నోరు విప్పలేదు. ఇక, మాజీ మంత్రి నారాయణతో బంధుత్వం ఉన్న గంటా.. కుటుంబ సభ్యులతో ఇప్పటికే పార్టీ మార్పు పైన చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు ఇస్తున్నట్లు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అదే సమయంలో విశాఖ నార్త్ నుంచి వైసీపీ ఇంఛార్జ్ గా ఉన్న రాజుకు సీఎం జగన్ టికెట్ హామీ ఇచ్చారు. ఈ సమయంలో పార్టీ మార్పు పైన నిర్ణయం ప్రకటించేందుకు గంటా సిద్దమయ్యారు.

Its now official: Ganta entry to YSRCP,decision after meeting with Chiranjeevi -deets here

వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్...

గతంలో కాంగ్రెస్ - టీడీపీలో మంత్రిగా పని చేసిన గంటా శ్రీనివాస రావు ఇప్పుడు వైసీపీల చేరాలని నిర్ణయించారు. విశాఖ పరిపాలనా రాజధానికి మద్దతుగా వైసీపీలో చేరేందుకు నిర్ణయించినట్లుగా ప్రకటించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇందు కోసం డిసెంబర్ 1న గంటా జన్మదినం నాడు ముహూర్తంగా ఫిక్స్ అయింది. కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవితోనూ గంటా సమావేశమయ్యారు. ఒక దశలో గంటా జనసేనలో చేరుతారనే ప్రచారం జరిగింది.

కానీ, వైసీపీలో చేరబోతున్నట్లు సన్నిహితులకు గంటా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తన శ్రేయాభిలాషులతో చర్చలు చేసిన తరువాత మరోసారి చిరంజీవిని కలిసి ఆ వెంటనే నిర్ణయం ప్రకటించాలని గంటా డిసైడ్ అయ్యారు. డిసెంబర్ తొలి వారంలోనే సీఎం జగన్ విశాఖ కేంద్రంగా సభలో పాల్గొనునున్నారు. ఆ సమయంలో విశాఖలోనే సీఎం జగన్ సమక్షంలో గంటా వైసీపీలో చేరుతారని తెలుస్తోంది.

Its now official: Ganta entry to YSRCP,decision after meeting with Chiranjeevi -deets here

వైసీపీతో టచ్ లో..వ్యూహాత్మక అడుగులు

గంటా శ్రీనివాస రావు చాలా రోజులుగా వైసీపీతో టచ్ లో ఉన్నారు. కానీ, స్థానికంగా ఉన్న కారణాలు.. అవంతి మంత్రిగా ఉంటూ గంటా రాకను వ్యతిరేకించటంతో వైసీపీలోకి ఎంట్రీ నిలిచిపోయిందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక, ఇప్పుడు గంటా మిత్రుడు పంచకర్ల రమేష్ బాబు వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడగా నియమితులయ్యారు. ఈ నియామకం వెనుక విశాఖలోని టీడీపీ నేతలు..గంటా అనుచరులు వైసీపీలోకి చేరే విధంగా ముందస్తు నియామకం జరిగింది.

ఇప్పుడు గంటా వైసీపీలోకి ఎంట్రీ ఖాయం కావటంతో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందన ఏంటనేది తెలియాల్సి ఉంది. గంటా - అవంతి ఇద్దరూ మాజీ మిత్రులు. ఇప్పుడు రాజకీయంగా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. దీంతో, వైసీపీలో ఇద్దరి మధ్య రాజీ జరుగుతుందా..లేక, అవంతి మరో నిర్ణయం తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది.

English summary
TDP MLA Ganta Srinivasa Rao set all for join in YSRCP in presence of CM Jagan in next month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X