వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"మా" స్టార్ వార్ లో మరో ట్విస్టు - పోలింగ్ పై కోర్టుకు ప్రకాశ్ రాజ్ : సాక్ష్యాలుగా సీసీ ఫుటేజ్...!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

"మా" వివాదం మరింత రాజుకుంటోంది. ఇప్పల్లో తెగే అవకాశాలు కనిపించటం లేదు. ఎన్నికల వరకే ఇటువంటి పరిస్థితులు ఉంటాయని..ఎన్నికలు పూర్తయిన తరువాత ఎవరు గెలిచినా అందరూ కలిసి పని చేస్తారంటూ ఇండస్ట్రీ ప్రముఖలతో పాటుగా ఎన్నికల్లో పోటీ చేసిన వారు సైతం చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన విష్ణు రేపు (శుక్రవారం) తన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇండస్ట్రీలోని పెద్దలను కలిసి ఆహ్వానిస్తున్నారు. ఇక, ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే మెగా బ్రదర్ నాగబాబు "మా" సభ్యత్వానికి రాజీనామా చేసారు.

ఫలితాలు..వరుస రాజీనామాలు

ఫలితాలు..వరుస రాజీనామాలు

ప్రాంతీయ వాదం..సంకుచిత భావాలు ఉన్న చోట తాను పని చేయలేనని చెబుతూ రాజీనామా లేఖ పంపారు. ఇక, అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాశ్ రాజ్ సైతం తన "మా" సభ్యత్వానికి రాజీనామా చేసారు. అయితే, అనూహ్యంగా ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి కార్యవర్గ సభ్యులుగా గెలిచిన వారు సైతం తమ పదవులకు రాజీనామా చేస్తూ కలిసి కట్టుగా నిర్ణయం ప్రకటించారు. దీని పైన విష్ణు ఇంకా స్పందించలేదు. ఈసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని మాత్రం చెప్పారు. ఇక మంచు విష్ణు ప్యానల్ గెలుపొందానికి రిగ్గింగ్ చేశారని ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపిస్తున్నారు.

సీసీటీవీ ఫుటేజ్ చేతికి వస్తే..నెక్స్ట్

సీసీటీవీ ఫుటేజ్ చేతికి వస్తే..నెక్స్ట్

ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ ఎన్నికలు జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజ్ కావాలంటూ 'మా' ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు బహిరంగ లేఖ రాశారు. తాజాగా ఆయన సోమవారం ఈ విషయమై కోర్టు మెట్లు ఎక్కనున్నట్టు సమాచారం. ఎన్నికలు జరిగిన తీరుపై అసంతృప్తి గా వున్న ప్రకాష్ రాజ్ వర్గం నిన్న ఇవ్వాళ ఇదే అంశం పై చర్చించి పోలింగ్ సమయంలో తన‌ ప్యానెల్ సభ్యులను ఎలా బెదరిచారో చెప్పడానికి సాక్ష్యాలుగా సీసీ ఫుటేజ్ ను కోరినట్టు తెలుస్తోంది. అయితే, ఎన్నికల అధికారి కౌంటింగ్ రోజున ఫుటేజ్ భద్రంగా ఉందని.. నిబంధనల ప్రకారం తాను దానిని వారికి ఇస్తానని వెల్లడించారు.

మోహన్ బాబు .. నరేశ్ దాడికి దిగారంటూ

మోహన్ బాబు .. నరేశ్ దాడికి దిగారంటూ

ఇది తమ చేతికి వస్తే పోలింగ్ సమయంలో మోహన్ బాబు..నరేశ్ తమ ప్యానల్ సభ్యుల మీద దాడికి దిగారని..అసలు ఏం జరిగిందో అందరికీ తెలుస్తుందని ప్రకాశ్ రాజ్ చెబుతున్నారు. రాజీనామా సమయంలో సీనియర్ నటుడు బెనర్జీ సైతం తన మీద మోహన్ బాబు అసభ్య పదజాలంతో తిడుతూ కొట్టేందుకు వచ్చారని చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక, విష్ణుకు అధ్యక్షుడుగా ఎవరైనా కార్యవర్గ సభ్యులు రాజీనామా చేస్తే..వారి స్థానంలో కొత్త వారిని నియమాకం చేసుకొనే అధికారం ఉంటుంది .

Recommended Video

Exclusive Interview with Bigg Boss 5 Contestant Hamida || Oneindia Telugu
కోర్టుకు వెళ్లే యోచనలో ప్రకాశ్ రాజ్

కోర్టుకు వెళ్లే యోచనలో ప్రకాశ్ రాజ్

దీంతో.. ఆయన తనకున్న అధికారంతో రాజీనామా చేసిన ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి ఎన్నికైన సభ్యుల స్థానంలో కొత్త వారిని నియమిస్తారా.. లేక, ఎన్నికల్లో గెలిచిన వారితో సంప్రదింపులు జరుపుతారా అనేది తేలాల్సి ఉంది. ప్రకాశ్ రాజ్ మాత్రం పోలింగ్ రోజు జరిగిన పరిణామాలను సీరియస్ గా తీసుకుంటున్నారు. అవే అంశాల పైన ఆయన పలువురి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక, కౌంటింగ్ జరిగిన తీరును సరిగ్గా లేదని ఆరోపిస్తూ ప్రకాష్ రాజ్ బృందం కోర్టుకు ఎక్కేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని పైన ప్రకాశ్ రాజ్ అధికారికంగా వెల్లడించకపోయినా..ఆయన క్యాంపు నుంచి అందుతున్న సమాచారం మేరకు న్యాయ పోరాటం తప్పదని తెలుస్తోంది.

English summary
It seems that Prakash Raj has decided to go to court on the MAA election and counting process.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X