వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు 'హైటెక్' ప్లాన్: విశాఖలో ఐటీ జంట టవర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: హైదరాబాదులో ఐటీ వ్యాపారం అభివృద్ధికి, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రధాన ఆకర్షణంగా మాదాపూర్‌లోని హైటెక్ సిటీ నిలిచింది! ఈ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను ఐటీ అభివృద్ధికి విశాఖలో ఐటీ జంట టవర్లు నిర్మించాలని ఏఫీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించింది.

దాదాపు 10 ఎకరాల స్థలంలో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. విశాఖలో ఇప్పటికే సాఫ్టువేర్ విలేజీని ప్రారంభించారు. తాజాగా సిగ్నేచర్ టవర్ల నిర్మాణానికి కన్సల్టెంట్ ఎంపిక చేసేందుకు ప్రతిపాదనలు కోరుతూ ఆహ్వాన ప్రకటనల జారీ చేసింది. ఈ నెల 25వ తేదీలోగా ప్రతిపాదనలు పంపించాలని సూచించింది. ఎంపికైన సంస్థ మార్చి 16 నుండి పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక పనులు మొదలు పెట్టనుంది.

IT towers in Vishaka

తిరుపతిలో చంద్రబాబు పర్యటన

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతిలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతిలో భారీ విజయంతో గెలుపొందిన ఎమ్మెల్యే సుగుణ నివాసానికి బాబు వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి తిరుపతి పట్టణంలో ఆకస్మిక తనిఖీలు చేసేందుకు చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. ఎన్టీఆర్‌ సర్కిల్‌, వెస్ట్‌చర్చి, ఎమ్మార్‌పల్లి తదితర ప్రాంతాల్లో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు చేసే అవకాశం ఉంది.

English summary
AP CM Chandrababu Naidu plans to IT towers in Vishaka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X