వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవికి ఇదే స‌రైన స‌మ‌యం, లాజిక్ మిస్ అవుతున్నారు : విజ‌య‌శాంతి మ‌న‌సులో మాట‌..!

|
Google Oneindia TeluguNews

కొద్ది కాలంగా క్రియా శీల‌క రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న చిరంజీవి పై ఆయ‌న‌ పార్టీకి చెందిన విజ‌య శాంతి ఆస క్తి క‌ర కామెంట్లు చేసారు. చిరంజీవి యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నా..కాంగ్రెస్ లోనే కొన‌సాగుతున్నారు. ఇక‌, ఏపి రాజ‌కీయాల పై స్పందించిన విజ‌య‌శాంతి ఇప్పుడు చిరంజీవి గురించి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారుతు న్నాయి. అదే స‌మ‌యంలో ఏపి లోని పార్టీల‌పైనా స్పందించారు.

ఏపి రాజ‌కీయాలు గంద‌ర‌గోళంగా..

ఏపి రాజ‌కీయాలు గంద‌ర‌గోళంగా..

తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో స్టార్ క్యాంపెయిన‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన విజ‌య‌శాంతి ఈ మ‌ధ్య కాలంలో ఏపి రాజ‌కీ యాల పై త‌న అభిప్రాయాల‌ను స్ప‌ష్టంగా చెబుతున్నారు. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఏపి పొలిటిక‌ల్ స‌ర్కి ల్స్ లో హ‌ట్ టాపిక్ అయింది. గత రెండు రోజులుగా ఏపీ రాజకీయ పరిమాణాలను గమనించి చూస్తుంటే ప్రధాన పార్టీల తీరు ఒకింత ఆశ్చర్యంగా, మరింత గందరగోళంగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. విజ‌య‌శాంతి చేసిన ట్వీట్ ల‌ను చూస్తే.. బీజేపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలూ ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఈ వాదంతో అన్ని పార్టీలూ మైలేజ్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేకానీ.. వారు ఏకథాటి పైకి రారు. వైసీపీ, టీడీపీలు ఒకరితో మరొకరు వాదనలు చేసుకుంటారు. కానీ ఇద్దరూ కలిసి బీజేపీతో పోరాటం చెయ్యరు. వైసీపీ, జనసేన పార్టీల మధ్య కూడా ఇదే దృశ్యం కనిపిస్తోంది. మరి ఒక లక్ష్య సాధన కోసం ఏకథాటి పైకి రాలేకపోతే ఈ పార్టీలు బీజేపీపై ఎలా ఒత్తిడి తీసుకొస్తాయి అంటూ ప్ర‌శ్నించారు.

చిరంజీవి ప్ర‌జ‌ల క‌ల నిజం చేయాలి..

చిరంజీవి ప్ర‌జ‌ల క‌ల నిజం చేయాలి..

ఇదే స‌మ‌యంలో చిరంజీవి గురించి విజ‌య‌శాంతి ఆస‌క్తి క‌ర కామెంట్లు చేసారు. జనసేనతో సహా అన్ని ప్రధాన పార్టీలు, కాంగ్రెస్‌ను బలపరచకుండా ప్రత్యేక హోదా రాదన్న లాజిక్ మిస్సవుతున్నాయి. ఎందుకంటే ప్రత్యేక హోదాకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తీర్మానం చేసింది. ఈ తరుణంలో, వారి లక్ష్యసాధన కోసం ఏపీకి చెందిన అన్ని ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి రావాలని నేను అనుకుంటున్నాను. తెలుగు ప్రజలలో మంచి పాపులారిటీ ఉన్న చిరంజీవి గారి లాంటి ప్రముఖులంతా ఏపీ ప్రజల ప్రత్యేక హోదా కలను నిజం చేయడానికి.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఇదే సరైన సమయం. లేదంటే ఈ ఆపరేషన్ మరియు ఆందోళనలు విజయవంతం అవుతాయి. కానీ ప్రత్యేక హోదా ఆశ మాత్రం జీవం కోల్పోతుంది. నిబద్ధత కలిగిన ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఇది నా అభిప్రాయం అని విజ‌య‌శాంతి ట్వీట్ చేసారు.

చిరంజీవి స్పందిస్తారా..

చిరంజీవి స్పందిస్తారా..

విజ‌య‌శాంతి చేసిన సూచ‌న‌ల పై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తారా లేదా అనేది చూడాలి. కొంత కాలంగా ఆయ‌న ఏపి రాజ‌కీయాల్లో జోక్యం చేసుకోవ‌టం లేదు. కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగుతున్నా..యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటు న్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ గురించి రెండు రోజుల క్రితం విజ‌య శాంతి కామెంట్ చేసారు. కేసీఆర్ ఉచ్చులో ప వ‌న్ అంత త్వ‌ర‌గా ప‌డ‌క‌పోవ‌చ్చ‌ని పేర్కొన్నారు. ఇప్పుడు ఏపిలో నెల‌కొన్ని రాజ‌కీయ ప‌రిస్థితుల్లో మంచి పాపులారిటీ
ఉన్న చిరంజీవి హోదా పై ముందుకు రావాలి..ప్ర‌జ‌ల క‌ల నిజం చేయాలంటూ విజ‌య‌శాంతి చేసిన సూచ‌న పాటిస్తా రా లేదా అనేది ఇప్పుడు ఆస‌క్తి క‌రంగా మారింది.

English summary
Telangana Congress leder Vijayasanthi Tweeted interesting comments o Chiranjeevi. She suggested Chiranjeevi to take active role for AP Special stauts issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X