విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆసక్తికరం: 'తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 75 స్థానాల్లో బీజేపీ పాగా వేయడం ఖాయం'

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : కాంగ్రెస్, తెలుగుదేశం, TJS లది కలగూరగంప కూటమి | Oneindia Telugu

విజయవాడ: టెంపరరీగా సంచలనం సృష్టించేందుకే ఏపీలోకి సీబీఐ అనుమతిని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవో తీసుక వచ్చారని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సోమవారం ఆరోపించారు. అధికారాలను విచక్షణతో వాడుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు.

కానీ చంద్రబాబు అలా ఉండటం లేదన్నారు. త్వరలో జరగనున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తుందని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో 75 స్థానాల్లో బీజేపీ పాగా వేస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

IYR Krishna Rao says BJP will win 75 seats in Telangana assembly elections

కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జన సమితిలది కలగూర గంప కూటమి అన్నారు. అలా ఒక్కటవుతున్న కూటమి పార్టీలకు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని చెప్పారు. ఈ నెల 25న నవ్యాంధ్రతో నా నడక అనే పుస్తకాన్ని తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నట్లు చెప్పారు.

విభజన సమస్యలు-వాటికి పరిష్కారం, ముఖ్యమంత్రి-ప్రధాన కార్యదర్శి మధ్య ఉండాల్సి సంబంధాలు, సీసీఎల్ఏగా ఉన్న సమయంలో జరిగిన భూ లావాదేవీలు తదితర అంశాల్ని ఈ పుస్తకంలో ప్రస్తావించానని చెప్పారు. కాగా, గతంలో ఎవరి రాజధాని అమరావతి పేరుతో ఓ పుస్తకం రాసిన విషయం తెలిసిందే.

English summary
IYR Krishna Rao says BJP will win 75 seats in Telangana assembly elections. He lashed out at AP CM Nara Chandrababu Naidu over CBI issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X