వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు వ్యూహంలో భాగమే, అందులో దిట్ట: మరోసారి టార్గెట్ చేసిన ఐవైఆర్

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు మాజీ సీఎస్, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్నారావు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు మాజీ సీఎస్, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్నారావు. కాపు కార్పొరేషన్‌ ఎండి బదిలీపై ఐవైఆర్ కృష్ణారావు సోషల్‌ మీడియాలో స్పందింస్తూ.. మీడియాకు లీకులు ఇచ్చి అధికారులను బదిలీ చేయడం చంద్రబాబు వ్యూహంలో భాగమని ఆ ఆరోపించారు. ఇందులో చంద్రబాబు దిట్ట అని అన్నారు. ఈ మేరకు ఐవైఆర్ సోమవారం తన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.

 మనో దెబ్బతీసేలా..

మనో దెబ్బతీసేలా..

ఉద్యోగుల మనోభావాలు దెబ్బ తీసేలా బదిలీలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కాపు కార్పొరేషన్‌ ఎండీగా పనిచేసిన అమరేందర్‌ చాలా మంచివ్యక్తి అని, ఆయనను ప్రభుత్వం పదవి నుంచి తొలగించడం సరికాదన్నారు. అయితే అమరేందర్‌ ఆ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ, ఆయన ఇప్పటికీ ప్రభుత్వంలోనే ఉన్నారని, అందుకే తాజా పరిణామాణలపై అమరేందర్‌ నోరు తెరవలేరన్నారు.

 చెప్పింది చేయకపోతే..

చెప్పింది చేయకపోతే..

చంద్రబాబు చెప్పింది చేయకపోతే ఇలాగే ప్రవర్తిస్తారంటూ ఐవైఆర్‌ మరోసారి ధ్వజమెత్తారు. కాగా ఏపీ కాపు కార్పొరేషన్‌ కార్యాలయంలో హైడ్రామా నెలకొన్న విషయం తెలిసిందే. కార్పొరేషన్ ఎండీగా ఉన్న అమరేందర్‌ను ప్రభుత్వం బాధ్యతల నుంచి తొలగించింది.

 అడ్డుకున్న రామునుజయ..

అడ్డుకున్న రామునుజయ..

కాగా, తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు అమరేందర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. అయితే అమరేందర్ ప్రెస్‌మీట్ పెట్టడాన్ని కాపు కార్పొరేషన్‌ చైర్మన్ రామానుజయ అడ్డుకున్నారు. తనకు ప్రెస్‌మీట్ పెట్టుకునేందుకు సీఎంవో నుంచి ఆదేశాలున్నాయని అమరేందర్‌ చెప్పడంతో తాను కూడా ప్రెస్‌మీట్‌లోనే కూర్చుంటానంటూ రామానుజయ పట్టుబట్టారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ద్వేషపూరిత ఆరోపణలు..

ద్వేషపూరిత ఆరోపణలు..

ఈ క్రమంలో అక్కడ్నుంచి వెళ్లిపోయి కాపు కార్పొరేషన్ కార్యాలయం బయట అమరేందర్ ప్రెస్‌మీట్ పెట్టారు. వ్యక్తిగత ద్వేషంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే తనపై కొన్ని పత్రికల్లో తప్పుడు వార్తలు రాయించారని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనకుందని అమరేందర్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఐవైఆర్ కృష్ణారావు.. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం గమనార్హం.

English summary
Andhra Pradesh CS IYR Krishna Rao on Monday lashed ouat at CM Chandrababu Naidu for remoing Amarender from Kapu Corporation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X