గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జే గ్యాంగ్‌ వేధింపులకు గిరిజన మహిళ రైతు బలి:అప్పు తీర్చలేదని ట్రాక్టర్‌తో తొక్కించడంతో...

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో జే గ్యాంగ్ వేధింపులు ఎక్కువవుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. జే గ్యాంగ్ కాల్ మనీ వేధింపులతో సామాన్యులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని చెప్పారు. ఇందుకు నిన్న చనిపోయిన మహిళ రైతు రమావంత్ మంత్రూభాయ్ సజీవ సాక్ష్యమని పేర్కొన్నారు. తీసుకున్న అప్పు తీర్చలేదని.. రమావంత్‌ను ట్రాక్టర్‌తో తొక్కియడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో నారా లోకేశ్ స్పందించారు. రాష్ట్రంలో జరుగుతోన్న అరాచకాలకు ఇదీ పరకాష్ట అని విమర్శించారు.

రాజధాని కథ ముగియలేదు: జగన్‌కు నేతల సవాల్ - ఇప్పుడే వద్దన్న వైవీ సుబ్బారెడ్డి - లోకేశ్ శపథంరాజధాని కథ ముగియలేదు: జగన్‌కు నేతల సవాల్ - ఇప్పుడే వద్దన్న వైవీ సుబ్బారెడ్డి - లోకేశ్ శపథం

రూ.3.80 లక్షల అప్పు..

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శివాపురంలో గిరిజన మహిళ రమావంత్ మంత్రూభాయి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తోంది. అయితే ఆమె వైసీపీ నేత వైసీపీ నేత శ్రీనివాసరెడ్డి వద్ద అప్పు తన భూమి తాకట్టు పెట్టి తీసుకుంది. తీసుకున్న రూ.3.80 లక్షల అప్పు, వడ్డీ చెల్లించలేకపోయింది. ఇంకేముంది అప్పుచ్చిన శ్రీనివాస ఆగ్రహావేశానికి లోనయ్యాడు. అప్పు ఇస్తావా అంటూ బెదిరింపులకు దిగాడు.

పొలంలో పనిచేసుకుంటుండగా..

సోమవారం తన పొలంలో రమావంత్ పనిచేసుకుంటున్నది. ఇంతలో అక్కడికి శ్రీనివాస్ మనుషులు వచ్చారు. అప్పు తీర్చాలని మాట మాట పెరిగింది. కానీ ఆమె చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. దీంతో ట్రాక్టర్‌తో తొక్కించాడు. తీవ్రగాయాలైన మహిళ రమావంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన పలువురికి కలచివేసింది.

రెచ్చిపోతున్న వైసీపీ గుండాలు: లోకేశ్

రెచ్చిపోతున్న వైసీపీ గుండాలు: లోకేశ్

రాష్ట్రంలో వైసీపీ గుండాలు రెచ్చిపోతున్నారని నారా లోకేశ్ మండిపడ్డారు. అప్పు తీర్చలేదని మహిళ రైతును ట్రాక్టర్‌తో తొక్కించడం ఏంటీ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు అధికారం తలకెక్కి ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన మహిళ రైతు రమావంత్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Recommended Video

Sonu Sood Help to AP Farmer With Tractor
చంపడానికి లైసెన్స్ ఇచ్చారా..? టీడీపీ అనిత

చంపడానికి లైసెన్స్ ఇచ్చారా..? టీడీపీ అనిత

ఘటనను టీడీపీ మహిళా నేత అనిత కూడా ఖండించారు. రెడ్డి గారు మరో ఎస్టీ మహిళను చంపించారు ఉందా అని ఫైరయ్యారు. అసైన్డ్ భూమి తాకట్టుపెట్టుకోవడం నేరం.. అప్పు తీర్చలేదని ట్రాక్టర్ ఎక్కించి చంపడం అంతకన్నా ఘోరం అని మండిపడ్డారు. కానీ జగన్ రాజ్యంలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయని మండిపడ్డారు. మనుషులను చంపేందుకు వారికి లైసెన్స్ ఏమైనాఇచ్చారా అని మండిపడ్డారు.

English summary
j gang harassment: woman farmer ramavanth trample with tractor in guntur district. she died with severe injuries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X