• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గుర్తుకొస్తున్నాయి..ఎక్క‌డైతే అరెస్ట‌య్య‌డో అక్క‌డే సీఎంగా జ‌గ‌న్ : అక్క‌డే భార‌తికి నాడు అవ‌మానం..

|

హైదరాబాద్ : కాలం ఎప్పుడూ ఒకే లాగ ఉండ‌దు. 2012 మే 26. రాజ్‌భ‌వ‌న్ ప‌క్క‌నే ఉన్న దిల్‌కుష్ గెస్ట్ హౌస్‌. సీబీఐ అధికారులు విచార‌ణ పేరుతో పిలిపించి..జ‌గ‌న్‌ను అరెస్ట్ చేసారు. అదే రాజ్‌భ‌వ‌న్ రోడ్డులో నేడు జ‌గ‌న్ సీఎంగా అధికార ట్రీట్‌మెంట్ అందుకున్నారు. అదే రోడ్డులో అదే రోజు జ‌గ‌న్ అరెస్ట్ త‌రువాత భార‌తి..విజ‌య‌మ్మ‌...ష‌ర్మిళ‌తో నాడు పోలీసులు దురుసుగా ప్ర‌వ‌ర్తించి అరెస్ట్ చేసారు. ఇప్పుడు అదే రోడ్డులో భార‌తికి అదే పోలీసులు సెల్యూట్ చేసారు.

వెల్ కం

వెల్ కం

ఇక‌, వైయ‌స్ మ‌ర‌ణం త‌రువాత నాటి సీఎం క్యాంపు కార్యాల‌యం..నేటి ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుండి జ‌గ‌న్‌-భార‌తి దంపతులు బాధ‌తో బ‌య‌ట‌కు వ‌చ్చారు. నేడు సీఎం దంప‌తులుగా అదే భ‌వ‌నంలో గ్రాండ్ వెల్‌క‌మ్ అందుకున్నారు.

నాడు నిందితుడిగా....

నాడు నిందితుడిగా....

మొండి. జ‌గ‌మొండి. తండ్రి త‌ర‌హాలోనే ప‌ట్టుద‌ల‌..క‌సి. అదే ఇప్పుడు జ‌గ‌న్ నాడు-నేడు అనే చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. ఈ నెల 30న ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఏపీలో గెలిచిన త‌రువాత జ‌గ‌న్ తొలిసారి హైదరాబాద్ వ‌చ్చారు. ఆయ‌న‌కు అపూర్వ స్వాగ‌తం..అధికార హోదాలో అందిన ఆద‌ర‌ణ చూసిన వారికి గ‌త స‌న్నివేశాలు గుర్తుకు వ‌స్తున్నాయి. ఇదే రాజ్‌భ‌వ‌న్ ప‌క్క‌నే ఉన్న దిల్‌కుష్ గెస్ట్ హౌస్‌లో సీబీఐ అధికారులు అక్ర‌మాస్తుల కేసుల్లో జ‌గ‌న్ ను విచారించి..2012 మే 26న అరెస్ట్ చేసారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ కుటుంబ స‌భ్యులుతో స‌హా అభిమానులు ఆందోళ‌న‌కు దిగారు. ఇక‌, ఈ రోజు ఎక్క‌డైతే అరెస్ట్ చేసారో..అక్క‌డే ఈ రోజు జ‌గ‌న్‌కు జ‌నం నీరాజ‌నం ప‌లుకుతుంటే..పోలీసులు సెట్యూల్ కొడుతూ దారి క్లియ‌ర్ చేసారు.

 నేడు సీఎంగా

నేడు సీఎంగా

2009లో త‌న తండ్రి మ‌ర‌ణంలో నాటి సీఎం క్యాంపు కార్యాల‌యం...నేడు కేసీఆర్ ఉంటున్న ప్ర‌గ‌తి భ‌వ‌న్ లోకి వెళ్ల‌గానే తెలంగాణ ముఖ్య‌మంత్రి అపూర్వ స్వాగ‌తం. ఆద‌ర‌ణ‌. అభిమానం. నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి కుమారుడుగా భ‌విష్య‌త్ ఆగ‌మ్య గోచ‌రంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌గ‌న్ నేడు అదే భ‌వ‌నంలో ముఖ్య‌మంత్రి గా కాలు పెట్టారు.

నాడు భార‌తిని అవ‌మానించారు..

నాడు భార‌తిని అవ‌మానించారు..

జ‌గ‌న్‌ను సీబీఐ అధికారులు నాడు అరెస్ట్ చేయ‌గానే ఎటువంటి మ‌ద్ద‌తు లేని ఆయ‌న కుటుంబ స‌భ్యులు అక్క‌డ‌కు చేరుకున్నారు. త‌ల్లి విజ‌య‌మ్మ‌..స‌తీమ‌ణి భార‌తి..సోద‌రి ష‌ర్మిళ జ‌గ‌న్ కోసం అక్క‌డి రాగానే పోలీసులు దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. అక్క‌డే అరెస్ట్ ను నిర‌సిస్తూ రాత్రి వేళ రాజ‌భ‌వ‌న్ ప‌క్క‌నే ఉన్న ఫుట్‌పాత్ మీద బైఠాయించారు. దీంతో పోలీసులు బ‌లవంతంగా ల‌గేసారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి కుటుంబ స‌భ్యులు..మ‌హిళ‌లు అనే విష‌యం మ‌రిచి లాగి పోలీసుల జీపుల్లో తోసేసారు.

సెల్యూట్

సెల్యూట్

నేడు అదే రోడ్డులోకి భార‌తి త‌న భ‌ర్త జ‌గ‌న్‌తో స‌హా వ‌చ్చారు. అక్క‌డ భార‌తికి అదే పోలీసులు రూట్ క్లియ‌ర్ చేసారు. సెట్యూల్‌తో స్వాగ‌తం ప‌లికారు. నాడు ఎక్క‌డైతే పోలీసులు లాగేసారో..అక్క‌డే ఒక సీఎం స‌తీమ‌ణిగా త‌న‌కు ఇస్తున్న గౌర‌వం చూసి..గ‌త చేదు జ్ఞాప‌కాలు గుర్తు చేసుకొని ఖ‌చ్చితంగా క‌ళ్లు చెమ‌రుస్తాయి. శ‌రీరం ఒక్క సారిగా గ‌ర్వంగా ఉప్పొంగుతుంది. చూసిన వారు..చ‌రిత్ర తెలిసిన వారు మాత్రం వైయ‌స్ కుటుంబం అంటేనే ఇదీ అని అనుకోక మాన‌రు.

English summary
Jagan and bharathi met governor at Raj Bhavan and visited KCR in Pragathi Bhavan in Hyderabad. Both of them remember their situation at Jagan Arrest time in 2012. Jagan and his family faced insult with police. Now in that place both of them treated as VVIP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X