జగన్ మరో సంచలన నిర్ణయం: అమ్మఒడి వారికీ వర్తింపు: కార్పోరేట్ విద్యా సంస్థలకు ఇలా..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు అమ్మ ఒడి పధకం మీద ఉన్న సందేహాల కు సమాధానం ఇచ్చిన ముఖ్యమంత్రి కార్యాలయం..ఇక నుండి అమ్మ ఒడి పధకం ఇంటర్ విద్యార్దులకు వర్తింప చేసే దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ విద్యార్ధుల తల్లులకు సైతం ఈ పదకం కింద ఎన్‌రోల్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అదే సమయంలో ప్రయివేటు..కార్పోరేట్ పాఠశాలలకు హెచ్చరికలు జారీ చేసారు.

ఇంటర్ విద్యార్ధులకు అమలు
ఏపీలో విద్యా రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణల పైన ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఇదే సమయంలో
ముఖ్యమంత్రి జగన్ తాను ప్రకటించిన నవ రత్నాల్లో కీలకమైన పధకం అమ్మ ఒడి. ఇప్పుడు ఈ పధకాన్ని మరింత విస్తృతం చేయాలని జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా..అమ్మఒడి పథకంపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మఒడి పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకూ వర్తింపు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే విద్యార్థులకూ అమ్మఒడి పథకం వర్తింపజేయాలని అధికారుల కు ఆదేశించారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి తల్లికీ ఏటా రూ.15వేలు అందించాలని విద్యాశాఖకు సీఎం సూచించారు. ఇప్పటికే ఈ పధకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్దుల చేరిక సంఖ్య భారీగా పెరిగింది. దీంతో..ఇప్పుడు దీనిని ఇంటర్ విద్యార్ధులను చేర్చటం ద్వారా పేదల పైన భారం తగ్గుందని సీఎం అంచనా వేస్తున్నారు.

కార్పేరేట్ స్కూళ్లకు వార్నింగ్..
ఈ పధకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్దుల సంఖ్య పెంచాలని..అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగై న సౌకర్యాలు పెంచటం..బోధనా పద్దతులను సంస్కరించటం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధిస్తా యని జగన్ పేర్కొన్నారు. దీని కారణంగా పేదల మీద చదువు భారం తగ్గటంతో పాటుగా..ప్రయివేటు-కార్పోరేట్ విద్యా వ్యవస్థ మీద మోజు తగ్గి..పేదల పైన భారం తగ్గుందని జగన్ విశ్లేషించారు. దీని కోసం మరో కీలక నిర్ణయాన్ని జగన్ ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల పక్కన ఉండే ప్రయివేటు - కార్పోరేటు స్కూళ్లను అక్కడి నుండి ఖాళీ చేయించాలి ..అదే సమయంలో అపార్ట్‌మెంట్లు- నిబంధనలకు వ్యతిరేకంగా రక్షణ లేని భవనాల్లో స్కూళ్లు నిర్వహిస్తే వాటిని వెంటనే మూసి వేయాలని సీఎం జగన్ ఆదేశించారు. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల వద్ద..అదే విధంగా చిన్న చిన్న గదుల్లో ప్రయివేటు పాఠశాలలు ఏర్పాటు చేస్తున్న యాజమన్యాలకు చెక్ చెప్పినట్లుగా కనిపిస్తోంది.

అమ్మ ఒడి ద్వారా ప్రభుత్వానికి ఇమేజ్..
నవ రత్నాల్లో ప్రతీ పధకం అమలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా విద్యార్ధులకు..వారి తల్లులకు ఎంత గానో మేలు చేసే అమ్మ ఒడి పధకం ప్రతిష్ఠాత్మకంగా పక్కాగా అమలు చేయాలని జగన్ సూచించారు. ప్రతీ ఏటా జనవరి 26న ఈ పధకం కింద పాఠశాలల్లో పిల్లలను చేర్చిన తల్లులకు వారి పేరుతోనే 15 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. తొలుత ఇది ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే అని చెప్పినా.. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగు పరిచే వరకూ ప్రయివేటు స్కూళ్ల కు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఇప్పుడు జూనియర్ కాలేజీల్లోనూ దీనిని అమలు చేయాలని డిసైడ్ అయ్యారు.