కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్ అనే నేను..: క‌డ‌పలో స్టీల్ ఫ్యాక్ట‌రీని ప్రారంభిస్తా: మూహూర్తం ఇదే..ఎన్నో డ్రామాలు చేసారు..

|
Google Oneindia TeluguNews

ఎంతో కాలంగా వివాదాస్ప‌దంగా మారిన క‌డ‌ప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పైన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేసారు. ముఖ్య‌మంత్రి హోదాలో క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మడుగు వ‌చ్చిన ముఖ్య‌మంత్రి..జిల్లాకు వ‌రాలు ప్ర‌క‌టించారు. అందులో భాగంగా జిల్లా వాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న స్టీల్ ఫ్యాక్ట‌రీ పైన కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ఏడాది డిసెంబ‌ర్ 26న తాను స్టీల్ ఫ్యాక్టరీకి శంఖుస్థాప‌న చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అదే విధంగా ఎప్ప‌టిలోగా ఫ్యాక్ట‌రీ ప్రారంభించేదీ వెల్ల‌డించారు. ఇక‌, జిల్లాలో ప్రాజెక్టుల గురించి జ‌గ‌న్ నిర్ణ‌యాలు తీసుకెన్నారు.

ఎంతో కాలంగా పెండింగ్‌లో..
వైయ‌స్సార్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో గాలి జ‌నార్ధ‌న‌రెడ్డి స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకు వ‌చ్చారు. దీని కోసం జ‌మ్మ‌ల‌మ‌డుగు ప్రాంతంలో భూమి కేటాయింపుతో పాటుగా శంకుస్థాప‌న సైతం జ‌రిగింది. అయితే ,ఆ త‌రువాత వైయ‌స్సార్ మ‌ర‌ణం ..రాజ‌కీయంగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో స్టీల్ ఫ్యాక్టరీ పూర్తిగా ఆగిపోయింది. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం క‌డ‌ప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, సాంకేతిక కార‌ణాలు..ఫీజ బులిటీ వంటివి అడ్డుగా చెబుతూ కేంద్రం కాల యాప‌న చేసింది.

Jagan announced key decision in Jammalamadugu. He stated that foundation stone will be laid on coming december 26 th

ఇదే స‌మ‌యంలో టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉండ‌గా క‌డ‌ప జిల్లాలో స్టీల్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేయాల‌ని..లేకుండా తామే ఏర్పాటు చేస్తామంటూ నాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఫ్యాక్ట‌రీ ఏర్పాటు కోసం జిల్లాకు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ నిర‌హార దీక్ష సైతం చేసారు. దీనికి ముగింపుగా నాడు చంద్ర‌బాబు నాయుడు క‌డ‌ప జిల్లాలో తానే స్టీల్ ఫ్యాక్ట‌రీ నిర్మిస్తానంటూ అట్ట హాసంగా శంఖుస్థాప‌న చేసారు.

Recommended Video

రైతు కోసం విపత్తు సహాయ నిధి - జగన్

జ‌గ‌న్ అనే నేను చెబుతున్నాను..26న శంకుస్థాప‌న‌
క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కీల‌క ప్రక‌ట‌న చేసారు. కడప ఉక్కు పరిశ్రమ ఏ పనీ జరగక ఆగిపోయిన పరిస్థితిలో ఉంది. డిసెంబర్‌ 26న జగన్‌ అనే నేను వచ్చి.. అదే ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తానని హామీ ఇస్తున్నాను అంటూ ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో మూడేళ్లలోనే ఆ ప్రాజెక్టును పూర్తిచేసి మీ అందరికీ అందిస్తానని మాటిస్తున్నా. మీ అందరి కలల్ని సాకారం చేస్తానని సగర్వంగా చెబుతున్నా. ఈ ప్రాజెక్టు ద్వారా 20వేల మందికి ఉద్యో గాలు వచ్చే అవకాశం ఉంటుందని జ‌గ‌న్ వివ‌రించారు.

స్టీల్ ఫ్యాక్ట‌రీ ఎంతో కాలంగా అలా నిలిచిపోయి ఉంద‌ని.. గ‌త పాల‌కులు స్టీల్ ఫ్యాక్ట‌రీ పేరుతో డ్రామాలు చేసార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. అదే విధంగా జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల గురించి జ‌గ‌న్ ప్ర‌స్తావించారు. కుందూ నదిపై రాజోలి జలదరాశి ప్రాజెక్టును సైతం పూర్తిచేస్తాం. కేసీ కెనాల్‌ కింద కడప జిల్లాలో సాగునీరు అందని పరిస్థితుల్లో రైతులు అల్లాడుతున్నారని... ఇలాంటి పరిస్థితుల్లో సాగునీటి కోసం కుందూ నదిపై జలదరాశి ప్రాజెక్టు కడతామ‌ని... దానికి కూడా డిసెంబర్‌ 26న శంకుస్థాపన చేస్తానంటూ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

English summary
CM Jagan announced key decision in Jammalamadugu. He stated that foundation stone will be laid on coming december 26 th in Kadapa. He also given many assurances to Kadapa dist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X