వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీస్ మాధ‌వ్ వ్య‌వ‌హారంలో వైసిపి ప్లాన్ బీ : ఆయ‌న స‌తీమ‌ణి స‌విత‌కు భీ పాం..!

|
Google Oneindia TeluguNews

కొద్ది రోజులుగా వైసిపి లో ఉత్కంఠ గా మారిన పోలీసు మాధ‌వ్ వ్య‌వహారంలో జ‌గ‌న్ కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. పోలీసు అధికారిగా స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి వైసిపిలో చేరిన గోరంట్ల మాధ‌వ్ హిందూపూర్ ఎంపి టిక్కెట్ గా ఖ‌రార‌య్యారు. అయితే, విఆర్‌య‌స్ ను ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కె ఆమోదించ‌లేదు. స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌కుండా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టానికి మాధ‌వ్ కు అర్హ‌త ఉండ‌దు. దీంతో..ఇప్పుడు జ‌గ‌న్ కొత్త నిర్ణ‌యం తో ఎన్నిక‌ల బ‌రిలోకి దిగారు..

ఆమోదం పొంద‌ని వీఆర్‌య‌స్..

ఆమోదం పొంద‌ని వీఆర్‌య‌స్..

పోలీసు ఉద్యోగానికి స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి గోరంట్ల మాధ‌వ్ వైసిపి లో చేరారు. సామాజిక స‌మీక‌ర‌ణాల్లో భాగంగా మాధ‌వ్ కు జ‌గ‌న్ హిందూపూర్ ఎంపి గా పోటీకి అవ‌కాశం క‌ల్పించారు. ఇప్ప‌టికే మాధ‌వ్ హిందూపూర్ లో ప్ర‌చారం సైతం ప్రారంభించారు. అయితే, నామినేష‌న్ల ప్ర‌క్రియ మొద‌లైన త‌రువాత హిందూపూర్ వైసిపి లో టెన్ష‌న్ మొద‌లైంది. ఈ నెల 25 నామినేష‌న్ల‌ను తుది గ‌డువు. ఆ లోగా మాధవ్ నామినేష‌న్ దాఖ‌లు చేయాల్సి ఉంది. అయితే, నామినేష‌న్ దాఖ‌లు చే యాలంటే ముందుగా తాను ఉద్యోగానికి చేసిన రాజీనామాకు ప్ర‌భుత్వం ఆమోదించాల్సి ఉంది. ఉద్యోగానికి చేసిన రాజీ నామా ఆమోదం పొంద‌క‌పోతే మాధ‌వ్ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టానికి ఆర్హ‌త ఉండ‌దు. దీంతో..ఆయ‌న ట్రిబ్యున‌ల్ ను ఆశ్ర యించారు. అక్క‌డ వెంట‌నే రాజీనామా ఆమోదించాల‌ని ఆదేశాలు వ‌చ్చాయి. అయినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. దీని పై రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ని క‌లిసారు.

మాధ‌వ్ స‌తీమ‌ణికి భి ఫాం..

మాధ‌వ్ స‌తీమ‌ణికి భి ఫాం..

మాధ‌వ్ విఆర్‌య‌స్ ఆమోదం పొంద‌క‌పోవ‌టం..నామినేష‌న్ల దాఖలు కోసం ఒక్క రోజు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌టం తో దీని పై జ‌గ‌న్ దృష్టి సారించారు. ఈ రోజు ఉద‌యం మాధ‌వ్ లోట‌స్‌పాండ్ లో జ‌గ‌న్ ను క‌లిసారు. ఇంకా ఎదురు చూడ కుండా మాధ‌వ్ స‌తీమ‌ణిని బ‌రిలోకి దించాల‌ని నిర్ణ‌యించారు. ఇదే విష‌యం పై మాధ‌వ్ తో చ‌ర్చించారు. ఆయ‌న స‌తీ మ‌ణి స‌విత‌ను హిందూపూర్ వైసిపి ఎంపి అభ్య‌ర్దిగా బి ఫాం ఇవ్వాల‌ని ఆదేశించారు. దీంతో..హిందూపూర్ అభ్య‌ర్ది గా వైసిపి నుండి స‌విత పోటీ చేయ‌నున్నారు.

మాధ‌వ్ పోటీ నుండి త‌ప్పుకోవాల్సిందేనా : రిలీవ్ చేయని ప్ర‌భుత్వం : ఇసి కి ఫిర్యాదు..!మాధ‌వ్ పోటీ నుండి త‌ప్పుకోవాల్సిందేనా : రిలీవ్ చేయని ప్ర‌భుత్వం : ఇసి కి ఫిర్యాదు..!

రాజ‌కీయంగానూ సానుభూతి ద‌క్కేనా..

రాజ‌కీయంగానూ సానుభూతి ద‌క్కేనా..

ఇప్పుడు అనంత జిల్లాలో సామాజిక స‌మీక‌ర‌ణాలు ఎన్నిక‌ల ఫ‌లితాల పై ప్ర‌భావం చూపించే ప‌రిస్థితి నెల‌కొంది. జిల్లా లో కురుభ వ‌ర్గం ఓట‌ర్లు డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌. అదే విధంగా టిడిపి అధినేత చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం లోనూ ఈ సామాజిక వ‌ర్గం ఓట‌ర్లు ఎక్కువ‌. ఇప్పుడు అదే వ‌ర్గానికి చెందిన గోరంట్ల మాధ‌వ్ ను ప్ర‌భుత్వం వేధించిన తీరును విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని వైసిపి భావిస్తోంది. అదే విధంగా హిందూపూర్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో మాధ‌వ్ విష‌యంలో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరు ఆయ‌న కు సానుభూతిగా మారే అవ‌కాశం ఉంద‌ని వైసిపి నేత‌లు అంచ‌నా వేస్తున్నారు.

English summary
YCP Hindupur Loksabha Candidate has been Changed. Ex Police officer Gorantla Madhav announced few days back as YCP candidate. But his VRS not yet accepted. In place of him his wife Savitha contest on YCP b form.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X