వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్‌ను గుర్తు చేసిన జగన్ కేబినెట్... ఎవరికి ఏ మంత్రి పదవి ఇచ్చాడంటే..!

|
Google Oneindia TeluguNews

ఊహించిందే జ‌రిగింది. త‌న తండ్రి బాట‌లోనే జ‌గ‌న్ సైతం మ‌హిళ‌కే హోం శాఖ అప్ప‌గించారు. గుంటూరు జిల్లా ఎస్సీ మ‌హిళ మేక‌తోటి సుచ‌రిత‌కు హోం శాఖ కేటాయించారు. కీల‌క‌మైన ఇరిగేష‌న్ శాఖ‌ను అనిల్ కుమార్ యాద‌వ్ కు కేటాయింపు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. వ్య‌వ‌సాయ శాఖ‌ను క‌న్న‌బాబుకు ఇచ్చారు. ఇక‌, జ‌గ‌న్ ప్ర‌క‌టించిన అయిదు ఉప ముఖ్య‌మంత్రులను ఖ‌రారు చేసారు.

మంత్రులు..శాఖలు

మంత్రులు..శాఖలు

వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి- ముఖ్య‌మంత్రి, సాధార‌ణ ప‌రిపాల‌న‌, వైద్య-ఆరోగ్య‌, వ్య‌వ‌సాయ‌
1. ధర్మాన కృష్ణదాస్ -రోడ్లు..భ‌వ‌నాలు
2. బొత్స సత్యనారాయణ - ప‌ట్ట‌ణాభివృద్ది
3. పాముల పుష్పశ్రీవాణి -గిరిజ‌న సంక్షేమం
4. అవంతి శ్రీనివాస్ -ప‌ర్యాట‌క‌..యువ‌జ‌న వ్య‌వ‌హారాలు
5. పిల్లి సుభాష్‌ చంద్రబోస్ - రెవిన్యూ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్
6. కురసాల కన్నబాబు -వ్య‌వ‌సాయం..స‌హ‌కార శౄఖ‌
7. పినిపె విశ్వరూప్ - సాంఘిక సంక్షేమం
8. ఆళ్ల నాని - వైద్య.ఆరోగ్య శాఖ‌
9. తానేటి వనిత -మ‌హిళా శిశు సంక్షేమం
10. చెరుకువాడ శ్రీరంగనాథరాజు -గృహ నిర్మాణ శాఖ‌
11. వెల్లంపల్లి శ్రీనివాస్ -దేవాదాయ శాఖ‌
12. కొడాలి నాని -పౌర స‌ర‌ఫ‌రాలు..వినియోగ‌దారులు
13. పేర్ని నాని -ర‌వాణా, స‌మాచార‌-పౌర సంబంధాల శాఖ‌
14. మేకతోటి సుచరిత -హోం..విప‌త్తులు
15. మోపిదేవి వెంకటరమణారావు - ప‌శు సంవ‌ర్ధ‌క‌, మ‌త్య్స‌
16.బాలినేని శ్రీనివాసరెడ్డి -విద్యుత్..ప‌ర్యావ‌ణ‌
17. ఆదిమూలపు సురేష్ -విద్యా శాఖ‌
18.పాలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్ - ఇరిగేష‌న్‌
19. మేకపాటి గౌతమ్‌రెడ్డి - ప‌రిశ్ర‌మ‌లు, వాణ‌జ్యం
20. షేక్‌ బేపారి అంజాద్‌ బాషా -మైనార్టీ సంక్షేమం
21. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - పంచాయితీ రాజ్‌, గ‌నులు
22. కళత్తూరు నారాయణస్వామి - ఎక్సైజ్ , వాణిజ్య పన్నులు
23. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి -ఆర్దిక‌.. ప్ర‌ణాళిక‌
24. గుమ్మనూరు జయరామ్ -కార్మిక‌..ఉపాధి
25. మాలగుండ్ల శంకరనారాయణ -బీసీ సంక్షేమం

ఉప ముఖ్య‌మంత్రులు..శాఖ‌లు

ఉప ముఖ్య‌మంత్రులు..శాఖ‌లు

జ‌గ‌న్ ప్ర‌క‌టించిన విధంగా అయిదుగురు ఉప ముఖ్మమంత్రుల‌ను ప్ర‌క‌టించారు. అందులో ఎస్టీ నుండి మంత్రిగా ఉన్న పుష్ప శ్రీవాణికి ఉప ముఖ్య‌మంత్రి హోదాలో గిరిజ‌న సంక్షేమం అప్ప‌గించారు. మైనార్టీ కోటాలో అంజ‌ద్ భాషాకు ఉప ముఖ్య‌మంత్రి హోదాలో మైనార్టీ శాఖ ఇచ్చారు. బీసీ కోటాలో పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌కు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ ఇచ్చారు. ఎస్సీ కేట‌గిరీలో నారాయ‌ణ‌స్వామికి ఎక్సైజ్ శాఖ డిప్యూటీ సీఎం హోదాలో అప్ప‌గించారు. ఇక‌, కాపు కోటాలో ఆళ్ల నానికి వైద్య ఆరోగ్య శాఖ కేటాయింపు చేసారు. ఇందులోనూ ప్రాంతాల వారీగా కేటాయింపులు జ‌రిగాయి. ఉభ‌య గోదావ‌రికి రెండు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు రాగా..రాయ‌ల‌సీమ‌కు సైతం రెండు ద‌క్కాయి. ఉత్త‌రాంధ్ర నుండి ఎస్టీ వ‌ర్గానికి ఉప ముఖ్య‌మంత్రి హోదా కేటాయించారు.

 యువ‌త‌కు కీల‌క శాఖ‌లు..

యువ‌త‌కు కీల‌క శాఖ‌లు..

ఇక‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న కేబినెట్‌లో యువకులైన అనిల్‌.. మేక‌పాటి గౌతం రెడ్డికి కీల‌క శాఖ‌లు కేటాయించారు. కీల‌క‌మైన ఇరిగేష‌న్ శాఖ‌ను అనిల్‌కు కేటాయించి..ఆయ‌న స‌మ‌ర్ధ‌తకు ప‌రీక్ష పెట్టారు. అదే విధంగా.. గౌతం రెడ్డి స్వ‌త‌హాగా ఉన్న‌త విద్యా వంతుడు..వ్యాపార‌వేత్త కావటంతో ప‌రిశ్ర‌మ‌ల శాఖ ఆయ‌న‌కు కేటాయించారు. ఈ రెండు శాఖ‌లు ఇప్పుడు ఏపీకీ చాలా అవ‌స‌రం. మ‌రో కీల‌క‌మైన వ్య‌వ‌సాయం...వైద్యం...రెవిన్యూ శాఖ‌ల‌ను ఉభ‌య గోదావ‌రి జిల్లాల నేత‌ల‌ను కేటాయించారు. అంద‌రి కంటే పెద్దిరెడ్డి లో పెద్ద బాధ్య‌త పెట్టారు. పంచాయితీ రాజ్..గ్రామీణా భివృద్దితో పాటుగా మైనింగ్ శాఖ‌ను కేటాయించారు.

English summary
Jagan announced port folios for his cabinet ministers. Jagan alloted Home for SC women Sucharitha form guntur dist, He allotted Irrigation for Anil Kumar Yadav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X