వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కు 'అడ్మినిస్ట్రేషన్ గురు' గా అజేయ కల్లం.. ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

ఏపీ లో పాలనాపరమైన అనేక అంశాలను రిటైర్డ్ మాజీ ఐఏఎస్ అజేయ కల్లం నుండి గత సంవత్సర కాలంగా ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేర్చుకుంటున్నారని ప్రచారం వుంది. ఏపీలో చంద్రబాబు పాలనా సమయంలో సీఎస్ గా పని చేసిన అజేయ కల్లం కు ఒక ఐఏఎస్ అధికారిగా ప్రసంశానీయమైన రికార్డ్ ఉంది. ఈ నేపధ్యంలోనే ఏపీ సీఎం వై ఎస్ జగన్ ఆయనకు అతి పెద్ద పదవిని అప్పగించారు. ఏపీ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా క్యాబినెట్ హోదాలో అజేయ కల్లంను నియమించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి .

ఏపీ సీఎం స్పెషల్ అడ్వైజర్ గా అజేయ కల్లం.. సీఎం పేషీకి ఇంచార్జ్ గా వ్యవహరించనున్న అజేయ కల్లం

ఏపీ సీఎం స్పెషల్ అడ్వైజర్ గా అజేయ కల్లం.. సీఎం పేషీకి ఇంచార్జ్ గా వ్యవహరించనున్న అజేయ కల్లం

ముఖ్యమంత్రి కార్యాలయం కు సంబంధించి సీఎం పేషీలో అధిపతిగా ఆయన వ్యవహరిస్తారు. సీఎంవో కార్యదర్శులకు శాఖలను కేటాయించే బాధ్యత కూడా ఆయనకే అప్పగించారు. ప్రభుత్వ సలహాదారులతోపాటు రాష్ట్రంలో ఏ శాఖకు చెందిన అధికారినైనా పిలిచి సలహాలు ఇచ్చే అధికారాన్ని ప్రభుత్వం ఆయనకు కల్పించింది. అందరూ ఆయనకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.

అజేయ కల్లంను క్యాబినెట్ హోదాలో ముఖ్య సలహాదారుగా నియమించుకున్న జగన్ .. పాలన పై కమాండ్ కోసమే

అజేయ కల్లంను క్యాబినెట్ హోదాలో ముఖ్య సలహాదారుగా నియమించుకున్న జగన్ .. పాలన పై కమాండ్ కోసమే

అజయ్ కల్లం మాత్రమే పరిపాలనలో జగన్ కు మార్గదర్శకత్వం చేస్తారు, కాని ఒక క్యాబినెట్ మంత్రి వలె ఆయన స్వతంత్రంగా పనిచేస్తారు. అంతేకాకుండా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జగన్ నియమించుకున్న స్పెషల్ అడ్వైజర్ జగన్ కు మార్గనిర్దేశనం చెయ్యటంతో పాటుగా ఐఐఎస్, ఐపిఎస్ అధికారులను కూడా హ్యాండిల్ చేస్తారు.పాలనాపరమైన వ్యవహారాల్లో అధికారుల విదులపైన ఫుల్ కమాండ్ ఉన్న మాజీ సీఎస్ ను జగన్ ముఖ్య సలహాదారుగా నియమించుకోవటం వల్ల పాలనాపరమైన అంశాల్లో జగన్ సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని తద్వారా రాష్ట్ర పాలన తానూ అనుకున్నట్టు ప్రగతి పథాన సాగుతుంది అని జగన్ భావిస్తున్నారు.

అజేయ కల్లంకు అత్యధిక వార్షిక వేతనం .. స్పెషల్ అలవెన్సులు

అజేయ కల్లంకు అత్యధిక వార్షిక వేతనం .. స్పెషల్ అలవెన్సులు

జగన్ యొక్క అడ్మినిస్ట్రేషన్ గురువు, 30 లక్షల వార్షిక వేతనంతో ఈ విధులు నిర్వర్తించనున్నారు. ప్రభుత్వం అజేయ కల్లం కోసం అత్యధిక చెల్లింపు చేస్తున్నట్టు తెలుస్తుంది. పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్‌ కాకముందు ఉన్న టీఏ, డీఏలు వర్తిస్తాయి. ప్రభుత్వ వాహనంతోపాటు నివాస వసతి సౌకర్యం కల్పిస్తారు. లేదంటే ప్రభుత్వం అద్దె చెల్లిస్తుంది. వైయస్ జగన్ మెరుగైన పరిపాలన ఇవ్వాలనుకుంటున్నారు, అందుకే ఆయన ప్రతిభావంతులైన మరియు సమర్ధవంతులైన అధికారులను నియమించుకునే పనిలో పడ్డారు .

డైనమిక్ ఆఫీసర్ గా గుర్తింపు .. అజేయ కల్లం మార్గ నిర్దేశనలో జగన్ పాలన

డైనమిక్ ఆఫీసర్ గా గుర్తింపు .. అజేయ కల్లం మార్గ నిర్దేశనలో జగన్ పాలన

అజేయ కల్లం డైనమిక్ ఐఏ ఎస్ ఆఫీసర్ గా గుర్తించబడిన అధికారి . గతంలో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌ ఛైర్మన్‌గా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేశారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, సీఎస్‌గా పనిచేసిన సమయంలో రాజధాని అమరావతిలో స్విస్‌ ఛాలెంజ్‌ విధానాన్ని తప్పుబడుతూ ఫైలులో కుండబద్దలు కొట్టినట్లు రాశారు. ‘స్విస్‌ ఛాలెంజ్‌ లోపభూయిష్టంగా ఉంది. ఇది పనికిమాలిన విధానం. దీనివల్ల నష్టం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు. ఈ విధానాన్ని ఉపసంహరించుకోవడం ఉత్తమం..' అని ఫైలులో మూడు పేరాలు పొందుపరిచారు. ఆయన ఎక్కడ ఏ స్థాయిలో పనిచేసినా మంచి అధికారిగాగుర్తించబడ్డారు. ఇప్పుడు తాజాగా ఏపీ సీఎం కు స్పెషల్ అడ్వైజర్ గా ఆయన నియామకం సైతం పాలనలో అంతే నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది అని జగన్ భావన . అందుకే ఆయనకు జగన్ ఈ అతిపెద్ద బాధ్యత అప్పగించారు . చూడాలి అజేయ కల్లం మార్గ నిర్దేశనం జగన్ పాలనను సక్సెస్ చేస్తుందో లేదో ...

English summary
From the last one year, there are rumours that the then CM aspirant YS Jagan is actually taking 'administration' related classes from just retired AP Chief Secretary Ajeya Kallam, who has a meritorious track record as a commendable IAS officer. And now, the CM rewarded him with a big post.A while ago, Andhra Pradesh government has appointed Ex IAS officer Ajeya Kallam as a Special Advisor to AP CM YS Jagan. Not only Ajeya Kallam will be guiding Jagan in the administration but will function independently like a cabinet minister with almost 10 officers working under him directly. Also, the retired IAS is going to handle all the top IAS and IPS officers for Jagan, as he knows all of them inside out.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X