• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్‌ నోట లాక్‌డౌన్‌ మాట- నిన్న ఆరు వేల కేసులు- ఏం జరుగుతోంది ?

|

ఏపీలో కరోనా దారుణంగా విజృంభిస్తోంది. రోజు వారీ కొత్త కేసులు ఆరువేలు దాటిపోయాయి. గత మూడు రోజుల్లో రోజువారీ కొత్త కేసుల సంఖ్య నాలుగు వేల నుంచి ఆరు వేలకు చేరిపోయింది. అదీ ఉపఎన్నిక జరుగుతున్న చిత్తూరు జిల్లాలో అయితే నిన్న ఏకంగా వెయ్యి కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో జనం వణికిపోతున్నారు. అదే సమయంలో ప్రభుత్వానికీ ముచ్చెమటలు పడుతున్నాయి. పైకి టీకా ఉత్సవాలు విజయవంతం అయ్యాయని చెప్పుకుంటున్నా లోలోపల మాత్రం మధనం పెరుగుతోంది. దీంతో జగన్‌ తొలిసారిగా ఓ సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు.

 ఏపీలో కరోనా కల్లోలం

ఏపీలో కరోనా కల్లోలం

ఏపీలో గత కొన్ని రోజులుగా కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. చూస్తుండగానే రోజు వారీ కరోనా కొత్త కేసుల సంఖ్య ఆరువేలు దాటిపోయింది. నిన్న ప్రభుత్వం ప్రకటించిన తాజా హెల్త్‌ బులిటెన్‌లో 24 గంటల్లో అన్ని జిల్లాల్లో కలిపి 6096 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో వెయ్యి కేసులు చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పరిస్ధితులు చేయిదాటిపోయినట్లు కనిపిస్తోంది. విచిత్రంగా అతిపెద్ద జిల్లాల్లో ఒకటైన పశ్చిమ గోదావరిలో మాత్రం 68 కేసులు నమోదయ్యాయి. మిగతా ఏ జిల్లాలోనూ గత 24 గంటల్లో 200 కంటే తక్కువ కేసులు నమోదుకాలేదు.

 ఆరు జిల్లాల్లో కరోనా తీవ్రం

ఆరు జిల్లాల్లో కరోనా తీవ్రం

ఆరు జిల్లాల్లో కరోనా తీవ్రంగా ఉన్న్టట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం జిల్లా కరోనా కేసుల్లో టాప్‌లో ఉండగా.. ఆ తర్వాత శ్రీకాకుళం, విశాఖ, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో పరిస్ధితి తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే పట్టణాల్లో 62 శాతం, గ్రామాల్లో 38 శాతం కేసులు నమోదవుతున్నట్లు ప్రభుత్వ సమాచారం. అందులోనూ గ్రామాల్లో ఉన్న వారు త్వరగా ఆస్పత్రులకు వెళ్లకపోవడం వల్ల మరణాలు పెరుగుతున్నట్లు తేల్చారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ల కొరత రాష్ట్రాన్ని వేధిస్తోంది. సీఎం జగన్ ప్రధానికి తాజాగా రాసిన లేఖలోనూ 60 లక్షల డోసులు ఇవ్వాలని కోరారు.

 జగన్ నోట లాక్‌డౌన్‌ మాట

జగన్ నోట లాక్‌డౌన్‌ మాట

పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య విచ్చలవిడిగా పెరిగిపోతుండటంతో విధిలేని పరిస్ధితుల్లో రాత్రి పూట కర్ఫ్యూతో మొదలుపెట్టి ఆ తర్వాత దాన్ని పగలు కూడా విస్తరిస్తున్నారు. లాక్‌డౌన్ విధించేందుకు కూడా వెనుకాడబోమని మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పదేపదే చెప్తున్నారు. ఇప్పుడు ఏపీలోనూ అధే పరిస్ధితి ఎదురవుతోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. నిన్న కలెక్టర్లతో తాజా పరిస్ధితిపై చర్చించిన సీఎం జగన్‌ లాక్‌డౌన్‌ ప్రస్తావన తె్చ్చారు. దీంతో కలెక్టర్లు కూడా ఉలిక్కిపడ్డారు.

 లాక్‌డౌన్‌ పరిస్ధితి తేవొద్దన్న జగన్

లాక్‌డౌన్‌ పరిస్ధితి తేవొద్దన్న జగన్

జిల్లాల్లో తాజా పరిస్ధితిపై కలెక్టర్ల నుంచి వివరాలు తీసుకున్న సీఎం జగన్ లాక్‌డౌన్ పరిస్ధితి తీసుకురావొద్దని వారికి హెచ్చరికలు జారీ చేశారు. గతంలో లాక్‌డౌన్‌తో ఆర్ధిక రంగం చాలా దెబ్బతిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని కలెక్టర్లకు జగన్ గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పరిస్దితి రావొద్దన్నారు. ఇందుకు తగినట్లుగా కలెక్టర్లు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని జగన్ సూచించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, కరోనాను అడ్డుకునేందుకు ప్రస్తుతం ఇంతకు మించిన అస్త్రం లేదన్నారు.

  Pawan Kalyan కి Covid పాజిటివ్, ఊపిరితిత్తుల్లో నిమ్ము, పూర్తి వివరాలు !! || Oneindia Telugu
  English summary
  andhra pradesh chief minister ys jagan has warned district collectors not to bring lockdown situation again and increase pace of vaccination.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X