వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పై దాడి కేసు:నవంబర్ 2 వరకు నిందితుడి విచారణ;మరో యువతిని ప్రశ్నించారు...ఈ కోణాల్లో కూడా!

|
Google Oneindia TeluguNews

అమరావతి:జగన్‌పై హత్నాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును సిట్ క్షుణ్నంగా విచారిస్తోంది. ఈ క్రమంలో నవంబర్ 2 వరకు శ్రీనివాసరావు విచారణ కొనసాగుతుందని తెలిసింది.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నిందితుడి కుటుంబసభ్యులు, బంధువులతో సిట్ అధికారులు మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం మరోసారి వారిని సంప్రదించనున్నారని తెలిసింది. ఇదిలావుంటే శ్రీనివాసరావుకు లేఖ రాయడంలో సహకరించిన రేవతీపతి, సోదరితోపాటు తాజాగా మరో యువతిని కూడా సిట్ పోలీసులు విచారించారని సమాచారం. ఇటు శ్రీనివాసరావు చెప్పిన సమాచారాన్ని వారు చెప్పిన వివరాలతో పోల్చిచూడటం చేశారని తెలిసింది.

సిట్...ప్రశ్నావళి

సిట్...ప్రశ్నావళి

జగన్ పై కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావు గడచిన ఏడాది కాలంలో 9 ఫోన్లను ఎందుకు మార్చాడు?...వాటిని కొనడానికి అవసరమైన డబ్బు అతడికి ఎలా వచ్చింది?...
ఆ ఫోన్లతో వేల సంఖ్యలో కాల్స్ మాట్లాడడానికి కారణాలు ఏమిటి?...అతడు ఎక్కువసార్లు ఎవరితో మాట్లాడాడు?...గత ఆరు నెలల్లో అతడు ఎవరెవరిని కలిశాడు?...ఏయే ప్రాంతాలకు వెళ్లాడు?...ఎందుకోసం వెళ్లాడు?...ఏ పార్టీలతో సన్నిహితంగా మెలిగాడు? తదితర వివరాలు రాబట్టేందుకు సిట్ బృందం ప్రశ్నావళి సిద్దం చేసుకుందని తెలిసింది.

 ఆర్థిక వనరులు...ఎలా సమకూరాయి?

ఆర్థిక వనరులు...ఎలా సమకూరాయి?

అలాగే శ్రీనివాసరావు ఇన్ని ఫోన్లను కొనుగోలు చేయడానికి అతనికి ఆర్థిక వనరులు ఎలా సమకూరాయి?...అసలు అతడికి ఎన్ని బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి?... అందులో నగదు లావాదేవీలు, కొనుగోళ్లు తదిదర వివరాలు ఏమిటి?...ఈ అంశాలపై సోమవారమే శ్రీనివాసరావును సిట్ పోలీసులు విచారించి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. ప్రాధమిక దర్యాప్తులో శ్రీనివాసరావుకు మూడు బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు, వాటిలో భారీగా నగదు జమలు జరిగినట్లు పోలీసులు గుర్తించారని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

లేఖ గురించి...అన్ని కోణాల్లో

లేఖ గురించి...అన్ని కోణాల్లో

ఇక శ్రీనివాసరావు రాసినట్లు చెబుతున్న లేఖపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అతడు స్వయంగా రాయగలిగే స్థితిలో ఉండి కూడా...లేఖను ఇతరులతో రాయించడానికి గల కారణాలు ఏంటి?...విమానాశ్రయంలో భద్రతాపరమైన లోపాలను అతడు ఎలా గుర్తించగలిగాడు...అందుకోసం ఎంత సమయం వెచ్చించాడు...ఆ లోపాలను ఏ విధంగా ఉపయోగించుకున్నాడు?...జగన్ పై హత్యాయత్నం విషయం గురించి ఎవరితోనైనా ముందుగా చెప్పాడా?...ఈ కోణంలో కూడా విచారణ జరుగుతుందని న్యాయనిపుణులు అంచానా వేస్తున్నారు.

నాలుగో రోజు...కీలక విషయాలు?

నాలుగో రోజు...కీలక విషయాలు?

అలాగే జగన్ పై దాడి తరువాత ఆ కత్తిని విమానాశ్రయం నుంచి బయటకు తీసుకువెళ్లినవారు ఎవరు?...మళ్లీ వారు ఆ కత్తిని లోపలికి ఎలా తేగలిగారు?...అసలు ఈ కత్తిని ఎక్కడ కొనుగోలు చేశారు?...శ్రీనివాసరావుకు ఉద్దేశ్యపూర్వకంగా ఎయిర్‌పోర్టులో భద్రతా సిబ్బంది సహకారం ఉందా?...అక్కడి సిబ్బందితో శ్రీనివాసరావుకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి?...ఇలా దాడికి సంబంధించి అన్ని కోణాల్లో సిట్ బృందం విచారించనుంది విచారణలో నాలుగో రోజు మరిన్ని కీలక విషయాలు బైటపడతాయని భావిస్తున్నారు.

English summary
Amaravathi:SIT has inquired Srinivasa Rao, Who is attacked on YCP Chief Jagan. A lady and sister of Accused 1, Srinivas, who allegedly helped her brother in writing the letter that was found in his pocket when he attacked YSRCP chief, Jagan, has been face questions in custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X