వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"అదో పెద్ద స్కామ్.. బాబు చొక్కా చించుతా!, ఆది నిక్కరూ విప్పుతా"

'అంత డబ్బును కేశవరెడ్డి స్కూల్స్ ఎగ్గొడితే.. సీబీఐ విచారణకు ఆదేశించకుండా.. చంద్రబాబు తన ఆధీనంలోని సీఐడీ విచారణకు ఆదేశించారు.' అని మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో తొలి నుంచి సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ అధినేత జగన్.. ఐదో రోజు ప్రచార పర్వంలోను అదే తీరును కొనసాగించారు. ప్రభుత్వ పరిధిలో జరుగుతున్న అవినీతిని ఎండగడుతూనే ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డారు.

కేశవరెడ్డి స్కూల్స్ వ్యవహారంలో విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వం మోసం చేసిందంటూ జగన్ ఫైర్ అయ్యారు. 'కష్టపడి సంపాదించుకున్న డబ్బును పిల్లల చదువుకోసమని తల్లిదండ్రులు రూ.850కోట్లకు పైగా కేశవరెడ్డి స్కూల్‌లో డిపాజిట్ చేశారు. అంత డబ్బును కేశవరెడ్డి స్కూల్స్ ఎగ్గొడితే.. సీబీఐ విచారణకు ఆదేశించకుండా.. చంద్రబాబు తన ఆధీనంలోని సీఐడీ విచారణకు ఆదేశించారు.' అని మండిపడ్డారు.

వచ్చేది మా ప్రభుత్వమే..:

వచ్చేది మా ప్రభుత్వమే..:

వచ్చే దఫా తమ పార్టీ అధికారంలోకి వస్తే డిపాజిట్లను ప్రభుత్వమే చెల్లిస్తుందని జగన్ పేర్కొనడం గమనార్హం. మరో ఏడాది ఆగితే వచ్చేది తమ ప్రభుత్వమేనని, కేశవరెడ్డి, అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్ల డబ్బులు ప్రభుత్వం నుంచే అందుతాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఆ తర్వాత సీఎం చంద్రబాబు చొక్కా.. మంత్రి ఆదినారాయణ రెడ్డి నిక్కరు విప్పుతానంటూ ఎద్దేవా చేశారు.

Recommended Video

Pawan Kalyan meets Chandrababu Naidu, Fans Bike rally
అభ్యర్థిని పెట్టాం కాబట్టే ఇలా:

అభ్యర్థిని పెట్టాం కాబట్టే ఇలా:

ఆదివారం నంద్యాలలో రోడ్ షో నిర్వహించే ముందు హోలీక్రాస్‌ కెథడ్రల్‌ చర్చిలో జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం రోడ్ షోలో పాల్గొన్న ఆయన చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై తీవ్ర విమర్శలు చేశారు.

నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థిని దింపింది కాబట్టే.. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ నంద్యాల రోడ్లపైకి వచ్చారని అన్నారు. బాబు మంత్రి వర్గం అంతా నంద్యాల లాడ్జీలలోనే మకాం వేసిందని చెప్పారు.
వైసీపీ పోటీ పెట్టకుండా ఉంటే ముఖ్యమంత్రి, మంత్రులు నంద్యాలకు వచ్చేవారా? అని ప్రశ్నించారు.

అడ్డంగా భవనాలు పడగొట్టి:

అడ్డంగా భవనాలు పడగొట్టి:

రోడ్డుకు రెండు పక్కల ఇష్టానుసారం కి.మీ మేర భవనాలు తొలగిస్తే దాన్ని అభివృద్ధి అంటారా? అని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రోడ్ల విస్తరణ జరుగుతున్న తీరును ఆయన తప్పుపట్టారు. జనాభా పెరుగుతున్నప్పుడు రోడ్లు విస్తరణ చేయాల్సిందేనని, అయితే నంద్యాలలో మాత్రం చంద్రబాబు నంద్యాలలో అడ్డంగా భవనాలు పడగొట్టించారని ఆరోపించారు.

అదో పెద్ద స్కామ్:

అదో పెద్ద స్కామ్:

రోడ్ల విస్తరణలో భవనాలు కోల్పోయిన వారికి సెంటుకు రూ.18వేలు ఇస్తామన్నారని జగన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. వాస్తవానికి నంద్యాలలో సెంటు ధర రూ.5లక్షలకు పైగా ఉందని చెప్పారు. రోడ్ల విస్తరణలో ఇళ్లు, భవనాలు కోల్పోయిన బాధితులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు కావస్తున్నా.. ఎన్నడూ నంద్యాల అభివృద్ధిని పట్టించుకోని చంద్రబాబు ఎన్నికలు రాగానే 13 వేల ఇళ్లు పేదలకు కట్టిస్తామనడాన్ని జగన్ ఒక బూటకంగానే పేర్కొన్నారు.

300 చదరపు అడుగుల్లో కట్టించి ఇచ్చే ఫ్లాట్‌కు అడుగు రూ.1000 కూడా కాదని, ఆ లెక్కన రూ.3 లక్షలకు కట్టించి ఇవ్వాల్సిన ఫ్లాట్‌ను రూ.6 లక్షలకు నిర్మించబోతున్నారని ఆరోపించారు. ఈ లెక్కలన్ని ఇదో పెద్ద స్కామ్ అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు.

English summary
YSRCP President Jagan conducted a road show in Nandyala on Sunday. He targets CM Chandrababu Naidu over the failure of govt
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X