వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

46 ఏళ్ల‌కే సీఎంగా జ‌గ‌న్‌: 45 ఏళ్ల‌కే చంద్ర‌బాబు..అయినా అదే ఇద్ద‌రికీ తేడా : క్రెడిట్ ఎవ‌రికంటే....

|
Google Oneindia TeluguNews

Recommended Video

46 ఏళ్ల‌కే జ‌గ‌న్‌... 45 ఏళ్ల‌కు చంద్ర‌బాబు.. కానీ ఇద్ద‌రిలో తేడా ఏంటో తెలుసా..?? || Oneindia Telugu

ఏపీలో మ‌రోసారి పిన్న వ‌య‌సులోనే ముఖ్య‌మంత్రి అవుతున్నారు జ‌గ‌న్‌. ఇప్పుడు జ‌గ‌న్ వ‌య‌సు 46 సంవ‌త్స‌రాలు. గ‌తంలో చంద్ర‌బాబు 45 ఏళ్ల‌కే సీఎం అయ్యారు. 1995లో చంద్ర‌బాబు ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయ్యారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో రెండు సార్లు..విభ‌జించిన ఏపీలో ఒక సారి ముఖ్య‌మంత్రిగా మొత్తంగా 14 ఏళ్ల పాటు సీఎంగా ప‌ని చేసారు. ప‌దేళ్ల పాటు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్నారు. అయితే, చంద్ర‌బాబు కంటే చిన్న వ‌య‌సులోనే ముఖ్య‌మంత్రి రికార్డు జ‌గ‌న్‌కే ద‌క్కుతుంది..ఎందుకంటే..

చంద్ర‌బాబు @ 45 ఏపీ సీఎంగా..ఎలాగంటే..
1995, సెప్టెంబ‌ర్ 1. అతి చిన్న వ‌య‌సులో ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు బాధ్య‌త‌లు స్వీకరించారు. అయితే, ఆయ‌న టీడీపీ అధినేత‌గా బాధ్య‌త తీసుకొని పార్టీని అధికారంలోకి తీసుకురాలేదు. 1994 ఎన్నిక‌ల్లో నాటి ఉమ్మ‌డి ఏపీ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 1989-1994లో ముగ్గురు ముఖ్య‌మంత్రుల మార్పు ఫ‌లితం..ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను నాటి ప్ర‌తిప‌క్ష నేత..టీడీపీ అధినేత ఎన్టీఆర్ తన‌కు అనుకూలంగా మార్చుకున్నారు.

Jagan becoming AP CM at age of 46..Chandra Babu at 45 years.But..Difference is there..

ఫ‌లితంగా 1994ఎన్నిక‌ల్లో టీడీపీ ఏపీలో అధికారంలోకి వ‌చ్చారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌భుత్వం..పార్టీ వ్య‌వ‌హారాల్లో ల‌క్ష్మీ పార్వ‌తి జోక్యం పేరుతో చంద్ర‌బాబు నాటి ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్‌కు వ్య‌తిరేకంగా ఎమ్మెల్యేల‌ను స‌మావేశ ప‌రిచి..వైశ్రాయ్ వేదిక‌గా తాను లెచిస్లేచ‌ర్ పార్టీ నేత‌గా ఎన్నిక‌య్యారు. ఫ‌లితంగా ఎన్టీఆర్‌ను సీఎం కుర్చీ నుండి దించి చంద్ర‌బాబు ఏపీ సీఎం అయ్యారు. అప్పుడు ఆయ‌న వ‌య‌సు 45 సంవ‌త్సరాలు.

మా టైమ్ వ‌స్తుంది. మేమూ కొడ‌తాం! చెప్పిన‌ట్టే కొట్టాడు..చెప్పి మ‌రీ కొట్టాడు!మా టైమ్ వ‌స్తుంది. మేమూ కొడ‌తాం! చెప్పిన‌ట్టే కొట్టాడు..చెప్పి మ‌రీ కొట్టాడు!

జ‌గ‌న్ @ 46 ఏపీ సీఎంగా...
తండ్రి మ‌ర‌ణం త‌రువాత కాంగ్రెస్ పార్టీలో ఓదార్పు యాత్ర‌కు అనుమ‌తి నిరాక‌రించ‌టంతో..త‌న త‌ల్లితో క‌లిసి త‌న తండ్రి పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసారు. ఇద్ద‌రితో మొద‌లైన ఆ ప్ర‌యాణం నేడు ఏపీలో అధికారం ద‌క్కేతంగా జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ సంపాదించారు. అక్ర‌మార్జ‌న పేరుతో 16 నెల‌లు జైళ్లో ఉన్నారు. 2014 ఎన్నిక‌ల్లో పార్టీ ప్ర‌తిప‌క్షానికే ప‌రిమితం అయింది. కొత్త పార్టీ తొలి సారి ఎన్నిక‌ల్లో అధికారంలోకి రాక‌పోతే..ఇక అధికారం ద‌క్క‌ద‌ని చాలా మంది రాజ‌కీయ నేత‌లు..విశ్లేష‌కులు వాదించారు.

Jagan becoming AP CM at age of 46..Chandra Babu at 45 years.But..Difference is there..

కానీ, అవి జ‌గ‌న్ విష‌యంలో నిజం కాలేదు. చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసారు. ప‌క్కా ప్ర‌ణాళికా బ‌ద్దంగా..ప‌దునైన వ్యూహాల‌తో ముందుకు క‌దిలారు. సొంత పార్టీ స్థాపించి..అంచెలంచెలుగా ఎదిగి ఒంటి చేత్తో అద్బుత విజ‌యంతో అధికారంలోకి వ‌చ్చారు. ఏపీలో ముఖ్య‌మంత్రి అవుతున్న చిన్న వ‌య‌స్కుల్లో రెండో వారిగా జ‌గ‌న్‌ను చంద్ర‌బాబు త‌రువాతి వ్య‌క్తిగా చెబుతున్నారు. అయితే, చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయిన విధానం.. జ‌గ‌న్ సీఎం అవుతున్న తీరు విశ్లేష‌ణ‌ల్లో మాత్రం జ‌గ‌న్‌కే ఆ క్రెడిట్ ద‌క్కుతుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

English summary
YS Jagan becoming CM at 46 years age. previously Chandrababu became CM at age of 45 in 1995. But, Chandra Babu not got post on his own Hands. Now Jagan came with own stamina.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X