వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షర్మిలకు జగన్ బంపర్ ఆఫర్ ... కీలక పదవి ఇచ్చే ఆలోచనలో జగన్ .. పార్టీలో జోరుగా చర్చ

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సోదరి షర్మిలకు కీలక బాధ్యతలు అప్పజెప్పబోతున్నా రా? 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన జగనన్న వదిలిన బాణం షర్మిల ఇప్పుడు పార్టీలో కీలక భూమిక పోషించనున్నారా ? జగన్ జైల్లో ఉన్న సమయంలోనూ, అన్న బాటలో పాదయాత్ర సాగించిన షర్మిలకు కీలక పదవి ఇవ్వాలని నిర్ణయించిన జగన్ ఆమెకు సముచిత స్థానం ఇచ్చే పనిలో ఉన్నారా? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది.

వైసీపీ కోసం కీలకంగా పని చేసిన రాజన్న బిడ్డ షర్మిల

వైసీపీ కోసం కీలకంగా పని చేసిన రాజన్న బిడ్డ షర్మిల

ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిలకు అత్యంత కీలకమైన పదవిని కట్టబెడుతున్నారని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. షర్మిల... రాజకీయాల్లో ఆమె జగన్ వదిలిన బాణం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పాదయాత్ర పేరుతో ముందుకు సాగిన రాజన్న బిడ్డ. 2014 ఎన్నికల్లోనూ, 2019 ఎన్నికల్లోనూ జగన్ పార్టీ విజయం కోసం ప్రచారం చేసి, చంద్రబాబు పై విరుచుకుపడిన షర్మిల గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు.

గత ఎన్నికల్లో తన నినాదాలతో ట్రెండ్ సెట్ చేసిన షర్మిల

గత ఎన్నికల్లో తన నినాదాలతో ట్రెండ్ సెట్ చేసిన షర్మిల

ప్రచారంలో దూసుకుపోయిన షర్మిళ బై బై బాబు, బై బై పప్పు నినాదంతో వైసీపీలో జోష్ కు కారణమయ్యారు. రాష్ట్రంలో ట్రెండ్ సృష్టించారు . అంతేకాదు గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని తన భుజాలపై వేసుకొని పాదయాత్ర చేసి మరి పార్టీని ముందుకు నడిపించారు షర్మిల. ఇక అలాంటి షర్మిలకు గత ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఎలాంటి కీలక పదవిని అప్పగించలేదు వైయస్ జగన్మోహన్ రెడ్డి.

షర్మిలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక బాధ్యతలు

షర్మిలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక బాధ్యతలు

ప్రస్తుతం ఏపీ సీఎం గా రాష్ట్ర పాలన లో బిజీగా ఉన్న ఆయన, మరోపక్క పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కార్యకలాపాలను చూస్తూ బాగా బిజీగా ఉంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. షర్మిలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పజెప్తే పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి, పార్టీ కార్యకలాపాలు చూడడానికి షర్మిల సమర్థంగా పని చేస్తారు అని జగన్ నమ్ముతున్నారు.

ఒక పార్టీ , మరో పక్క రాష్ట్ర బాధ్యతలతో బిజీగా మారిన జగన్

ఒక పార్టీ , మరో పక్క రాష్ట్ర బాధ్యతలతో బిజీగా మారిన జగన్

ఇక ఈ నేపథ్యంలోనే షర్మిలకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇవ్వనున్నారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక గతంలోనూ షర్మిలను తెలంగాణ వైయస్సార్ సిపి అధ్యక్షురాలిగా నియమించారని జగన్ భావించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం లేనందున ఆ ఆలోచనను విరమించుకున్నారు జగన్. ఇక ఇప్పుడు ఓ పక్క రాష్ట్ర బాధ్యతలను, మరొక పార్టీ బాధ్యతలను రెండింటినీ నిర్వహించడం తలకు మించిన భారంగా భావిస్తున్న జగన్, పార్టీ బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తే బావుంటుందనే భావనలో ఉన్నారు.

వర్కింగ్ ప్రెసిడెంట్ గా షర్మిలను చేసే ఆలోచనలో జగన్ .. పార్టీలో జోరుగా చర్చ

వర్కింగ్ ప్రెసిడెంట్ గా షర్మిలను చేసే ఆలోచనలో జగన్ .. పార్టీలో జోరుగా చర్చ

షర్మిలకు ఏపీ వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగిస్తే పార్టీని మరింత బలోపేతం చేయడానికి షర్మిల కృషి చేస్తుందని అనుకుంటున్నారు. ఇక షర్మిల కూడా అన్న బాటలోనే ముందుకు సాగుతామని, తనకు పదవులపై పెద్ద వ్యామోహం ఏదీ లేదని చెప్పిన విషయం తెలిసిందే. కానీ అన్న ఆదేశిస్తే పార్టీ కోసం పని చేయడానికి సిద్ధంగా ఉంటారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో షర్మిలమ్మ కు జగన్ ఈ బంపర్ ఆఫర్ ఇస్తారా? షర్మిల అన్న ఇచ్చే ఆఫర్ ను తీసుకుంటారా ? అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

English summary
Jagan is currently busy in the state administration as AP CM, and on the other hand, as the party president. It is in this backdrop that Jagan is expected to hand over key responsibilities to Sharmila as the party's working president. Jagan believes that Sharmila will do her best to advance the party and watch the party's activities if Sharmila becomes the party's working president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X