వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగరంలో జగన్ బిజీబిజీ.. గవర్నర్‌, కేసీఆర్‌లతో భేటీ..! నేటి రాత్రికే జరూసలేం ప్రయాణం..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. నిన్న హైదరాబాద్‌కు వచ్చిన ఆయన మొదట తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఏపీకి కొత్త గవర్నర్‌ను నియమించిన తర్వాత నరసింహన్‌తో భేటీ అయిన జగన్‌, ఆయనతో పలు అంశాలపై చర్చించారు. దాదాపు గంటకు పైగా గవర్నర్‌తో సమావేశమయ్యారు. అనంతరం అక్కడి నుంచి ప్రగతిభవన్‌కు వెళ్లిన సీఎం జగన్‌ చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. చంద్రశేఖర్ రావుతో భేటీ మర్యాదపూర్వకమేనని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఇద్దరు సీఎంలు సమావేశం నేపథ్యంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశం కనబడుతోంది. కాగా రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంపై ఈ నెల 8న కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.

Jagan busy in city.. He met Governor and KCR..!Travel to Jerusalem tonight..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు జెరుసలేం వెళ్లనున్నారు. నిన్న సాయంత్రమే హైదరాబాద్‌ చేరుకున్న జగన్... తన కుటుంబసభ్యులతో కలిసి ఇవాళ సాయంత్రం శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి జెరుసలేం బయల్దేరనున్నారు. ఈ నెల 4వ తేదీ వరకు జగన్ కుటుంబసభ్యులు జెరుసలేంలో పర్యటించనున్నారు. సీఎం జగన్ తిరిగి ఈ నెల 5వ తేదీన తిరిగి నవ్యాంధ్ర రాజధాని అమరావతికి చేరుకోనున్నారు. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగతమైన పర్యటనగా అధికారులు చెబుతున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తికాగా.. ఆయన వ్యక్తిగత ఖర్చులతో ఈ పర్యటనకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. అలానే ఈ నెల 17వ తేదీ నుంచి 23 వరకు సీఎం జగన్ తన కుటుంబసభ్యులతో కలిసి అమెరికాలో పర్యటించనున్నారు.

English summary
AP CM YS Jagan will go to Jerusalem today. He arrived in Hyderabad yesterday evening with his family members.The Jagan family will be touring Jerusalem until the 4th of this month.Jagan Mohan Reddy met with Telangana Chief Minister KCR. He first met Telangana Governor Narasimhan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X