• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ కేసు: సూరీడు చెప్పినా కేవీపీ పేరేదని హెటెరో ట్విస్ట్

By Srinivas
|

హైదరాబాద్: ఆధారాలు ఉన్నప్పటికీ కేవీపీ రామచంద్ర రావును విస్మరించారని, ప్రభుత్వ పనుల పైన వచ్చే వాళ్లు తొలుత ఆయననే కలిసే వారని, ఈ విషయాలను సూరీడు వెల్లడించారని, అయినా సీబీఐ ఛార్జీషీటులో ఆయన పేరును చేర్చలేదని డిశ్చార్జి పిటిషన్‌లో హెటిరో తన వాదనలు వినిపించింది.

ఇన్ని ఆధారాలున్నా కేవీపీని కేసులో చేర్చనప్పుడు.. తమకు వ్యతిరేకంగా ఎవరు ఏమీ చెప్పకపోయినా ప్రాజెక్టు నిమిత్తం కలిసిన తమ పైన సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టి వేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఫార్మా కంపెనీలకు భూకేటాయింపుల కేసులో నిందితుల జాబితాలో ఉన్న హెటిరో ఫార్మా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ పైన మంగళవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.

ఈ నేపథ్యంలో జగన్‌ కేసులో భాగమైన హెటిరో ఫార్మా కొత్త వాదన లేవనెత్తింది. కేవీపీపై వైయస్‌ ప్రైవేటు సెక్రటరీ సూరీడు తీవ్ర ఆరోపణలు చేసినా ఆయన పేరును సీబీఐ చార్జిషీటులో చూపలేదని సంస్థ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఏ ఆరోపణలు లేని తమపైన, సంస్థ ఎండీ మీద కేసులు ఎలా పెట్టిందన్నారు.

Jagan case: Hetero new twist

ఫార్మా కంపెనీ కోసం ఎకరా రూ.7లక్షలకు ఇవ్వడాన్నే క్విడ్‌ ప్రో కో అంటోందని, ఈ కేసులను కొట్టివేయాలని అభ్యర్థించారు.

అప్పటి సీఎంవోకు వచ్చేవారంతా కేవీపీనే ముందు కలిసేవారని, లావాదేవీలు పూర్తయ్యాకే వైయస్‌ వద్దకు వెళ్లేవారని సూరీడు ఇచ్చిన వాంగ్మూలాన్ని ప్రస్తావించారు.

ఆ ఆరోపణలనే పట్టించుకోని సీబీఐ, చట్టబద్ధంగా భూములు తీసుకున్న తమ పైన కేసులు ఎలా పెట్టిందన్నారు. సాధారణంగా మౌలిక సదుపాయాలు కల్పించాక పరిశ్రమలకు ప్రభుత్వం భూమి ఇస్తుందని, అవేవీ చేయనందున ఎకరా రూ.7 లక్షలకు ఇచ్చారని చెప్పారు. సీబీఐ సాక్షులుగా పేర్కొన్న ఆనాటి సీఎం సెక్యూరిటీ అధికారి రమేష్‌, పర్యాటక శాఖ సెక్రటరీ జ్వాలా నరసింహా రావు, సూరీడు తమపై ఎలాంటి ఆరోపణలు చేయలేదన్నారు.

తాము పొందిన దానికన్నా ఎక్కువ పెట్టుబడి పెడితే క్విడ్‌ ప్రో కో ఎలా అవుతుందన్నారు. భూకేటాయింపులను, జగన్‌తో ముడిపెట్టడం తగదన్నారు. తమ సంస్థ ఆడిట్‌ రిపోర్టు తీసుకున్న సీబీఐ, అందులో కొన్ని ఖాళీలున్నా వివరాలు ఎందుకు తెలుసుకోలేదన్నారు. వాదనలు కొనసాగనుండటంతో విచారణను న్యాయమూర్తి 24కు వాయిదా వేశారు.

English summary

 Several accused persons in eleven quid pro quo investment cases against YSR Congress president Y.S. Jaganmohan Reddy, including India Cements MD N. Srinivasan, former Home Minister Sabita Indra Reddy and Dalmia Cements CMD Puneeth Dalmia, appeared before the Principal Special Court for CBI Cases here on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X