హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చివరి నిముషంలో రద్దయిన జగన్ సీబీఐ కోర్టు హాజరు ...కారణం ఇదే

|
Google Oneindia TeluguNews

Recommended Video

Good Morning India : 3 Minutes 10 Headlines | Actor Vijay It Raids | Astronaut Christina Koch

అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు కావాల్సి ఉంది అయితే ఆయన ఈ రోజు కోర్టుకు హాజరు కానున్నారు అని అందుకు సన్నాహాలు కూడా చేసుకున్నారని తెలిసిందే . అయితే అనూహ్యంగా చివరి నిముషంలో సీఎం జగన్ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు హాజరు పర్యటన రద్దు అయ్యింది.

నేడు అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరు కానున్న జగన్నేడు అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరు కానున్న జగన్

చివరి నిముషంలో రద్దయిన జగన్ ప్రయాణం

చివరి నిముషంలో రద్దయిన జగన్ ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నేడు హైదరాబాద్, నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి వుండగా, ఆయన ప్రయాణం చివరి నిమిషంలో రద్దు అయింది. సిబిఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లు, ఈ డి వేసిన 5 అభియోగ పత్రాల పై విచారణ జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ నేడు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరవుతారని అంతా భావించారు కానీ నాంపల్లి కోర్టులో సీబీఐ, ఈడీ న్యాయమూర్తి సెలవులో ఉండటంతో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

న్యాయమూర్తి సెలవులో ఉండటమే కారణం

న్యాయమూర్తి సెలవులో ఉండటమే కారణం

తనపై ఉన్న ఈడీ అక్రమాస్తుల కేసు విచారణకు జగన్ హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేయడంతో, నేడు జగన్ హైదరాబాద్ కు రానున్నారని, కోర్టులో హాజరై తిరిగి 11గంటలకు వెళ్లనున్నారు అని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, న్యాయమూర్తి సెలవులో ఉన్నారని, ఇక్కడి న్యాయవాదులు సీఎంఓ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. దీంతో సీఎం జగన్ ప్రయాణం వాయిదా పడింది. కోర్టు నుండి సమాచారం వచ్చే సమయానికే జగన్, గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరారు.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోనే సీఎం జగన్

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోనే సీఎం జగన్

చివరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేసుకున్న జగన్, నేడు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కొన్ని విభాగాల సమీక్షలు నిర్వహిస్తారని తెలుస్తుంది. నేడు సీబీఐ కోర్టులోహాజరు కావాల్సిన కారణంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తలపెట్టిన ‘దిశ' పోలీసు స్టేషన్‌ ప్రారంభోత్సవాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. అయితే న్యాయమూర్తి సెలవులో ఉండటంతో జగన్ కోర్టుకు హాజరు కావటం క్యాన్సిల్ అయ్యింది.

English summary
AP Chief Minister Jagan Mohan Reddy is scheduled to appear in a special CBI court today, However, at the last minute, CM Jagan's visit to the Hyderabad CBI court was canceled. Jagan tour was postponed because the judge was on vacation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X