వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ప్రజలను మోసం చేస్తున్నాడు.. ఏపీలో స్వరం పెంచుతున్న బీజేపీ..!!

|
Google Oneindia TeluguNews

గుంటూరు : దక్షిణాదిలో తమ పార్టీని క్రమంగా విస్తరించుకోవాలనుంటున్న బీజేపీ .. ఆ దిశగా అడుగులేస్తోంది. ప్రాంతీయ పార్టీలతో మంచిగా ఉంటూనే తమ పార్టీ విస్తరణపై ఫోకస్ చేస్తోంది. తెలంగాణలో బీజేపీకి ఓ ఎమ్మెల్యే, నలుగురు ఎంపీలు ఉన్నారు. ఏపీలో మాత్రం అందుకు విరుద్ధ పరిస్థితి. ఈ క్రమంలో అధికార వైసీపీ టార్గెట్‌గా బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. సీఎం జన్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

jagan cheat people .. purandeshwari

సాధ్యం కాదు కదా ..
ఏపీ సహా మిగతా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం ఇదివరకే స్పష్టంచేసింది. లోక్ సభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానం కూడా ఇచ్చారు. ఈ క్రమంలో ఏపీకి ప్రత్యేక హదా కోసం పోరాడుతామని జగన్ వ్యాఖ్యానించడాన్ని బీజేపీ సీనియర్ నేత పురంధేశ్వరి తప్పుపట్టారు. హోదా సాధ్యం కాదని కేంద్రం చెప్పినా .. పదే పదే అదే విషయం వల్లించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఒక విషయ పదే పదే చెప్పినా అమలు కాదని తేల్చిచెప్పారు. దీంతో బీజేపీని దోషిగా నిలబెట్టాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు పురందేశ్వరి.

అభ్యర్థుల పాట్లు ..
ఏపీ సర్కార్ తీసుకొచ్చిన పలు పథకాలను లోపభూయిష్టంగా ఉన్నాయని విమర్శించారు. గ్రామ సచివాలయ విధానంతో అనేకమంది ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. ఇదీ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలకు భద్రత ఇవ్వరా అని నిలదీశారు. వారి భవిష్యత్‌తో ఆడుకోవడం ఏంటని మండిపడ్డారు. ఇసుక, మట్టి విధానంపై ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇసుకపై నిషేధం విధించడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

English summary
Senior BJP leader Purandeshwari had criticized Jagan's comments that he would fight for a separate mandate for the AP. The Center has said that the status quo is not possible .. repeatedly asked the same thing. It has been concluded that one thing repeatedly does not work. This is why Jagan is looking to keep the BJP guilty. Purandeswari spoke to the media in Guntur on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X