• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Jagan cheated ap youth : నిరుద్యోగ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని లోకేష్ పిలుపు

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత పోరుబాట పట్టింది . ఏపీలో నూతన జాబ్ క్యాలెండర్ కోసం సమరభేరి మ్రోగుతుంది. నూతన జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి రెండు లక్షల 30 వేల పోస్టులను భర్తీ చేయాలని, పాత జాబ్ క్యాలెండర్ ను రద్దు చేయాలన్న డిమాండ్ నిరుద్యోగులు నిత్యం ఆందోళనల బాట పడుతూనే ఉన్నారు. ఇక వారికి మద్దతుగా ఏపీలో నిరుద్యోగ సమస్యపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ సర్కార్ టార్గెట్ గా ధ్వజమెత్తుతూనే ఉన్నారు.

నిరుదోగ్య పోరాటంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన లోకేష్


గత కొంత కాలంగా నిరుద్యోగ సమస్యపై పోరాటం చేస్తున్న లోకేష్ నిరుద్యోగ సమస్యను పరిష్కరించమని ఆందోళన చేస్తే పోలీసులతో నిరుద్యోగులను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైసిపి పాలనలో నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయం నేపథ్యంలో యువతను ప్రభుత్వంపై పోరాటం చేసే ఉద్యమంలో భాగస్వామ్యం చేసే లక్ష్యంతో jagancheatedapyouth.com వెబ్ సైట్ లో అందరూ రిజిస్టర్ అయ్యి నియంత కొమ్ములను వంచి ఉద్యోగాలు సాధించుకునే మహోద్యమంలో పాల్గొనాలని కోరుతున్నాను అంటూ లోకేష్ పేర్కొన్నారు.

వైయస్ జగన్ అనే వ్యక్తి అబద్ధాలు మాత్రమే చెప్తాడన్న లోకేష్

వైయస్ జగన్ అనే వ్యక్తి అబద్ధాలు మాత్రమే చెప్తాడన్న లోకేష్

వైయస్ జగన్ అనే వ్యక్తి అబద్ధాలు మాత్రమే చెబుతాడని, జగన్ రెడ్డి అనే వ్యక్తి మోసాలు చేస్తూనే ఉంటాడు అని సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు లోకేష్. జగన్ రెడ్డి అనే వ్యక్తి చేయలేని కూడా చేస్తానని భ్రమలు కల్పిస్తారని చెప్పేందుకు ఉదాహరణ జాదూ క్యాలెండర్ అంటూ విరుచుకుపడ్డారు లోకేష్ . ఇక ఈ మోసపూరిత క్యాలెండర్ ను రద్దు చేసి 2. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

విజయవాడలో ధర్నా చేసిన నిరుద్యోగులకు లోకేష్ మద్దతు

విజయవాడలో ధర్నా చేసిన నిరుద్యోగులకు లోకేష్ మద్దతు


ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ లో నిరాహార దీక్ష చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి సభ్యులకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నా అని చెప్పిన లోకేష్ ప్రభుత్వం మెడలు వంచి ఉద్యోగాల సాధనకు యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 2021 జగన్ ప్రభుత్వం విడుదల చేసింది జాబ్ క్యాలెండర్ కాదని, జాబ్ లెస్ క్యాలెండర్ అని ధ్వజమెత్తారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతను మోసం చేశాడని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు లోకేష్.

అంతకు ముందు పరీక్షల రద్దుకు లోకేష్ పోరాటం

అంతకు ముందు పరీక్షల రద్దుకు లోకేష్ పోరాటం


అంతకుముందు పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల రద్దుకు పెద్దఎత్తున పోరాటం చేసిన లోకేష్ ఏపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునే వరకు తన పోరాట పంథాను కొనసాగిస్తూ ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో విద్యార్థులతో సమావేశమై, వారి అభిప్రాయాలను తెలుసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. అనేకమార్లు సీఎం జగన్మోహన్ రెడ్డికి విద్యార్థుల జీవితాలను ప్రమాదంలో నెట్టొద్దు అని లేఖలు రాశారు . చివరకు సుప్రీం కోర్టు అక్షింతలు వేయడంతో ఏపీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయాన్ని మార్చుకుంది. దీంతో లోకేష్ పోరాట ఫలితంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం మార్చుకుందని టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇది లోకేష్ సాధించిన విజయంగా అభివర్ణించారు.

  Ahead of boxer Lovlina final bout construction work is underway on the road at Golaghat
  ఇప్పుడు నిరుద్యోగ సమస్యపై ఒత్తిడి తెస్తున్న లోకేష్

  ఇప్పుడు నిరుద్యోగ సమస్యపై ఒత్తిడి తెస్తున్న లోకేష్


  ఆ తర్వాత నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి తన అస్త్రశస్త్రాలను ఎక్కు పెడుతున్న లోకేష్, ఇప్పుడు నిరుద్యోగ యువతకు అండగా ఏపీ సర్కార్ పై పోరాటానికి దిగారు. రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన తన గళాన్ని వినిపిస్తున్నారు. ఏపీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను, వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నికల హామీల లో చెప్పిన విధంగా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ఆటలాడవద్దని జగన్ కు హితవు చెబుతున్నారు.

  English summary
  Lokesh,has been battling the unemployment problem, has expressed extreme impatience that the police are trying to suppress the unemployed. Lokesh said he wanted everyone to register on the jagancheatedapyouth.com website with the aim of getting the youth involved in the movement to fight the government in the wake of the injustice done to the unemployed youth under the YCP regime and take part in the campaign to bend the dictator's horns and get jobs.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X