వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త‌డ‌బ‌డ్డ జ‌గ‌న్..! ప్ర‌త్యేక‌హోదా గురించి వ్యాఖ్యానించి నాలుక కరుచుకున్న వైసీపి చీఫ్..!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ ముఖ్యమైన విషయంలో ఏమ‌రుపాటుగా వ్య‌వ‌హ‌రించి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేసారు. గంటలు గంటలు ఏక‌దాటిగా ఉప‌న్యాసాలు ఇచ్చే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కనీస అవగాహన లేకుండా ఎలా స్పందించార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే అంశాన్ని పార్టీ నాయ‌కుల ద్వారా తెలుసుకున్న జగన్ తల పట్టుకున్నట్టు తెలుస్తోంది. జ‌గ‌న్ ఇలాంటి సున్నిత అంశాల‌ను ప్ర‌స్థావించేట‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండ‌ల‌నే సూచ‌న‌లు చేస్తున్నారు ఇత‌ర ముఖ్య నాయ‌కులు. ఇంత‌కీ జ‌గ‌న్ చేసిని ఆ వ్యాఖ్య‌లు ఏంటి.? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!

ప్ర‌కంప‌ల‌ను స్రుష్టిస్తున్న జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌..! హోదాపై నోరు జారిని వైసీపి అధినేత‌..!!

ప్ర‌కంప‌ల‌ను స్రుష్టిస్తున్న జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌..! హోదాపై నోరు జారిని వైసీపి అధినేత‌..!!

ప్రత్యేక హోదా పోరాటాన్ని తారా స్థారా స్థాయికి తానే తీసుకెళ్లిన‌ట్టు ప్ర‌చారం చేసుకున్న ఏపి ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఓ ముఖ్య విశ‌యంలో త‌డ‌బ‌డ్డారు. ఎన్నో సంద‌ర్బాల్లో ఎన్నోసార్టు ప్ర‌త్యేక హోదా గురించి ప్ర‌స్థావించిన జ‌గ‌న్ దాని ఇతివ్రుత్తాన్ని మ‌రిచిపోయి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా అనే అంశం మీదే తనకు ఏ మాత్రం అవగాహన లేన‌ట్టు మాట్లాడి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేసారు. ప్రత్యేక హోదాపై జగన్ చేసిన తాజా ప్రకటన ఆయన ఏమ‌రుపాటును ప్ర‌జ‌ల‌కు చెప్ప‌క‌నే చెప్పుకొచ్చింది.

ఏమ‌రుపాటా..? అవ‌గాహ‌నా లోప‌మా..? పార్టీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌..!

ఏమ‌రుపాటా..? అవ‌గాహ‌నా లోప‌మా..? పార్టీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌..!

అనుకోకుండా వ‌చ్చిందో లేక, అవగాహన లేకుండా మాట్లాడారో తెలియదు కానీ, తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవాల్సివ‌చ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటనను పరిశీలిస్తామని మాత్రమే విభజన చట్టంలో చెప్పారని, హోదా, విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు, దుగరాజపట్నం పోర్టు ఇలా పలు అంశాలను పరిశీలిస్తామని మాత్రమే విభజన చట్టంలో ఉందని అలా కాకుండా స్పష్టమైన హామీ ఇచ్చి ఉంటే కోర్టుకైనా వెళ్లి వాటిని సాధించుకునే వాళ్లమని' జగన్ వ్యాఖ్యానించటంతో ఆయ‌న అభిమానులు అవాక్క‌వుతున్నారు.

ప్ర‌త్యేక హోదా గురించి ప‌ట్టు త‌ప్పిన జ‌గ‌న్..! ఆశ్య‌ర్య‌పోతున్న సొంత పార్టీ నాయ‌కులు..!

ప్ర‌త్యేక హోదా గురించి ప‌ట్టు త‌ప్పిన జ‌గ‌న్..! ఆశ్య‌ర్య‌పోతున్న సొంత పార్టీ నాయ‌కులు..!

అసలు విషయానికొస్తే, రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు. విభజన వల్ల నష్టపోయే ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని హోదాలో మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో ప్రకటన చేశారు. ఈ సంగతి ఆనాడు అన్ని ప్ర‌సార మాద్య‌మాలు కావ‌ల‌సినంత ప్ర‌చారం కూడా క‌ల్పించాయి. అలాంటిది ప్రధాన ప్రతిపక్ష నేత జగన్‌కి ఈ విషయం తెలియకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందనే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా జగన్ మాటల గురించే చర్చించుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

అదికార పార్టీని ఇరుకున పెట్టాల‌న‌కున్న జ‌గ‌న్..! తొంద‌ర‌పాటు తో ఇబ్బందులు..!!

అదికార పార్టీని ఇరుకున పెట్టాల‌న‌కున్న జ‌గ‌న్..! తొంద‌ర‌పాటు తో ఇబ్బందులు..!!

హోదా చట్ట బ‌ద్ద‌త లేదు కాబట్టే ఇవ్వలేకపోతున్నామని మోడీ ప్రత్యేక హోదా విషయాన్ని దాటవేస్తుంటే, జగన్‌ మాత్రం విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఇచ్చే అంశం పరిశీలించాలని ఉన్నట్లు కనిపించడం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మౌతోంది. రాజ్యాంగ వ్య‌వ‌స్త‌లు, అందులో పొందు ప‌రిచిన అంశాలు, చ‌ట్టాల గురించి ప్ర‌స్థావించేట‌ప్పుడు త‌గు అవ‌గాహ‌న, స‌మ‌చారం తో మాట్లాడ‌క పోతే ఇబ్బందులు త‌లెత్తుతాయి. బ‌హిరంగ స‌భ‌ల్లో మాట్ల‌డే జ‌గ‌న్ స్థాయి నాయ‌కులు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండ‌క‌పోతే ఇలాంటి స‌ఘ‌ట‌న‌లే జ‌రుగుతాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

English summary
YS Jagan Mohan Reddy, the Vice-President and Leader of the Opposition, was surprised by all the important things. The discussion is about how Jagan Mohan Reddy, who gives lectures for hours and hours, has not responded to a minimum lack of awareness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X