• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎస్‌గా ఎల్వీ కొన‌సాగింపు: ప‌్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా అజ‌య్ క‌ళ్లాం: జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యాలు..!

|

ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన జ‌గ‌న్ పాల‌నా ప‌రంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈనెల 30వ తేదీన ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న జ‌గ‌న్‌తో శుక్ర‌వారం ఏపీలో ప‌ని చేస్తున్న అఖిల భార‌త సర్వీసు అధికారులు క‌ల‌వనున్నారు. రాష్ట్రంలో ఆర్దిక ప‌రిస్థితి..అత్య‌వ‌స‌ర అంశాల గురించి వాక‌బు చేసారు. జ‌గ‌న్‌తో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం మ‌ర్యాద పూర్వ‌కంగా భేటీ అయ్యారు. సీఎస్‌గా ఎల్వీనే కొన‌సాగిస్తామ‌ని..ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా అజ‌య్ క‌ల్లాంను నియ‌మిస్తున్న‌ట్లు జ‌గ‌న్ వెల్ల‌డించారు..

పార్టీల్లో... ప్రజాశాంతీ పార్టీ వేరయా... కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా...?

జ‌గ‌న్‌తో ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం భేటీ..

జ‌గ‌న్‌తో ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం భేటీ..

ఎపికి కాబోయే సియం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం భేటీ అయ్యారు. వైసిపి ఎపిలో భారీ విజ‌యం సాధించ‌డంపై జ‌గ‌న్ ను అభినందించారు సియ‌స్.. ఈ నెల 30న సియం గా ప్ర‌మాణా స్వీకారోత్స‌వం చేస్తున్న‌ట్లు దానికి త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని జ‌గ‌న్ సూచించారు. సియం గా భాద్య‌త‌లు చెపట్టిన త‌రువాత‌ తోలి రోజు నుండి పాల‌న పై దృష్ణి సారించ‌నున్నారు జ‌గ‌న్. ఇందుకోసం జూన్ 1 నుండి 5 వ‌రకు సియంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారిక‌ స‌మీక్ష‌లు చేయ‌నున్నారు. ఇదే స‌మ‌యంలో ఎపిలో ప్ర‌స్తుతం ఉన్న వాస్త‌వ ప‌రిస్థితుల‌పైన జ‌గ‌న్ సీఎస్ తో ఆరా తీసారు. ఏపీలో దాదాపు 20 వేల కోట్ల మేర బిల్లులు చెల్లింపులు చేయాల్సిన‌వి ఉన్నాయ‌ని..కేంద్రం నుండి రావాల్సిన మొత్తాల గురించి వివ‌రించారు.

రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : జగన్

సీఎస్‌గా ఎల్వీ..స‌ల‌హాదారుడిగా అజయ్ క‌ళ్లాం

సీఎస్‌గా ఎల్వీ..స‌ల‌హాదారుడిగా అజయ్ క‌ళ్లాం

జ‌గ‌న్‌తో భేటీ సంద‌ర్భంగా తన‌ను సియ‌స్ గా కేంద్ర ఎన్నిక‌ల సంఘం నియ‌మించ‌డంతో ..త‌న‌కు ఏమైనా అప్ష‌న్ ఉందా అని ఎల్వీ అడిగారు. దీనికి స్పంద‌న‌గా మీరు రిటైర్ మెంట్ కావ‌డానికి ఇంకా ఏడాది ఉంద‌ని తెలుసుకున్నాను .. మా ప్ర‌భుత్వంలో కూడా మీరే రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అని జ‌గ‌న్ ఎల్వీ కి స్ప‌ష్టం చేశారు. ఇదే స‌మ‌యం లో ఉన్న‌తాధికారులు అంతా జ‌గ‌న్ క‌లివాల‌ని భావిస్తున్నార‌ని ఎల్వీ చెప్ప‌గా.. శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు అఖిల భార‌త‌స్థాయి అధికారులు క‌లిసేందుకు జ‌గ‌న్ అంగీక‌రించారు.. ఇదే స‌మాచారం సియ‌స్ ఉన్న‌తాధికారులు అంద‌రికీ స‌మాచారం అందించారు. రాష్ట్రంలో నీతివంత‌మైన పాల‌న అందించ‌డ‌మే త‌న‌ ప్ర‌ధాన ల‌క్ష్యం అని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు..ఇదే స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడుగా మాజీ సియ‌స్ అజ‌య్ క‌ల్లంని నియ‌మిస్తున్న‌ట్లు చెప్పిన జ‌గ‌న్.. అజ‌య్ క‌ల్లాంతో క‌లిసి ప‌ని చేయాల‌ని ఎల్వీకి జ‌గ‌న్ సూచించారు.

డీజీపీగా స‌వాంగ్‌..

డీజీపీగా స‌వాంగ్‌..

జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో కొత్త డీజీపీగా గౌతం స‌వాంగ్ నియ‌మితుల‌య్యే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుత డీజీపీ ఠాకూర్ పైన చాలా కాలంగా వైసీపీ అసంతృప్తితో ఉంది. అదే విధంగా నిఘా బాస్ వేంక‌టేశ్వ‌ర రావు విష‌యంలోనూ అస‌హ‌నంతో ఉంది. ఇక‌, జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తున్నార‌ని ఖ‌రారు కాగానే..ప్ర‌స్తుతం విలిజెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా ఉన్న గౌత‌రం స‌వాంగ్ నేరుగా వ‌చ్చి జ‌గ‌న్‌ను క‌లిసి శుభాకాంక్ష‌లు చెప్పారు. గ‌తంలోనే ఆయ‌న‌కు డీజీపీగా అవ‌కాశం ఉన్నా.. ద‌క్క‌లేదు. దీంతో..ఇప్పుడు పూర్తిగా అధికార వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళ‌న చేయాల‌ని నిర్ణ‌యించిన జ‌గ‌న్ డీజీపీగా స‌వాంగ్‌కు అవ‌కాశం ఇవ్వ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది.

English summary
AP CS LV Subramnayam met Jagan and greeted him. Jagan Assured that LV continue as CS and Ajay Kallam will be the govt advisor. Jagan asked about the finance position in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X