• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

CM Jagan Delhi Tour: మినిట్ టు మినిట్: రాత్రికి అమిత్ షా తో కీలక భేటీ: నాన్చుడు కాదు..ఇక తేల్చుడే..!!

By Lekhaka
|

ముఖ్యమంత్రి జగన్ తన టీంతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ముఖ్యమంత్రితో పాటుగా ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, మిధున్‌రెడ్డి, బాలశౌరి ఢిల్లీకి చేరుకున్నారు. ఇక ముఖ్యమంత్రి షెడ్యూల్ మినిట్‌-టూ-మినిట్ అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి.

 ప్రకాష్ జవడేకర్‌తో భేటీ

ప్రకాష్ జవడేకర్‌తో భేటీ

ముఖ్యమంతి ఈ సాయంత్రం ముందుగా అధికారులతో కలిసి మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర పర్యావరణ శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో సమావేశం కానున్నారు. ఏపీ ప్రాజెక్టుల విషయంలో ఎన్టీజీ అభ్యంతరాలు...పర్యావరణ అనుమతుల గురించి జవదేకర్ తో సీఎం చర్చించనున్నారు. ఆ వెంటనే..4 గంటలకు జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ కానున్నారు. పోలవరం పెండింగ్ నిధుల తో పాటుగా పునరావాస ప్యాకేజి విషయంలో పలు మార్లు చర్చించాన..ఆమోదం లభించకపోవటంతో దాని పైన పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వనున్నారు. పోలవరం ప్రస్తుత పనుల తీరును వివరించటంతో పాటుగా నిధులు విడుదల కోసం మంత్రిని కోరనున్నారు.

 అమిత్ షా తో ఆ అంశం తేల్చేస్తారా..

అమిత్ షా తో ఆ అంశం తేల్చేస్తారా..

ఇక, ఈ రాత్రి 9 గంటలకు హోం మంత్రి అమిత్ షా తో సీఎం అప్పాయింట్ మెంట్ ఖరారైంది. ఆ సమావేశం ఈ పర్యటన మొత్తానికి కీలకం కానుంది. ఆ సమావేశంలో అధికారిక అజెండాతో పాటుగా రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన అంశాల పైన హోం శాఖ నోడల్ వ్యవస్థ గా పని చేస్తోంది. దీంతో..ఆ నిధులకు సంబంధించిన అంశాలు అమిత్ షాతో సీఎం చర్చించనున్నారు. ఇక, రాజకీయంగా ఢిల్లీ కేంద్రంగా రఘురామ రాజు ముఖ్యమంత్రి జగన్.. ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా చేస్తున్న ఆరోపణలు.,.వారికి బీజేపీ నేతలు కొందరు మద్దతిస్తున్నారనే అంశం పై సీఎం నేరుగా అమిత్ షా తో చర్చిస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది.

 అనర్హత వేటుకు సీఎం సిఫారసు

అనర్హత వేటుకు సీఎం సిఫారసు

ఇప్పటికే రఘురామ రాజు పైన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందున ఆయన పైన అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ ఎంపీలు ఇచ్చిన పిటీషన్ స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఎంపీలు మరోసారి ఆ అంశం పైన ప్రస్తావించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అదే విధంగా..ఏపీలో ఆర్దిక పరిస్థితి..కేంద్ర సాయం పైన చర్చ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. రాజకీయంగా జగన్ కొన్ని అంశాలు అమిత్ షా ముందు ప్రస్తావించి వారి వైఖరి తెలుసుకొనే ప్రయత్నం చేస్తారని చెబుతున్నారు.

 ఇతర మంత్రులతోనూ కీలక భేటీలు..

ఇతర మంత్రులతోనూ కీలక భేటీలు..

ఇక, రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న ముఖ్యమంత్రి శుక్రవారం ఉదయం ఎంపీలతో సమావేశం కానున్నారు. ఆ తరువాత 9.30 గంటలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశం కానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం పైన చర్చించనున్నారు. తరువాత 11 గంటలకు కేంద్ర రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశం అవుతారు. విశాఖ రైల్వే జోన్... కేంద్రం- ఏపీ ప్రభుత్వం 50-50 భాగస్వామ్యంతో అమలు చేయాలని నిర్ణయించిన ప్రాజెక్టుల పైన చర్చించనున్నారు. ఆ తరువాత అమరావతి బయల్దేరుతారు. అయితే, ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ లో రాజకీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.. ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేదే ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం.

English summary
CM Jagan Reached Delhi to meet cnetral ministers. To day night CM meet with Amith Shah on official and political issues. CM stay for two days in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X