అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీకి జ‌గ‌న్ : ప‌్ర‌ధానితో ఏం చెప్ప‌బోతున్నారు : ఇద్దరి ల‌క్ష్యం నెర‌వేరింది..వాట్ నెక్ట్స్‌...!

|
Google Oneindia TeluguNews

ఏపీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన జ‌గ‌న్ ఈనెల 30న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. అదే రోజున రెండో సారి ప్ర‌ధానిగా మోదీ ప్ర‌మాణ స్వీకార ముహూర్తం ఖరారైంది. అయితే, త‌న ప్ర‌మాణ స్వీకారం లోగానే ఢిల్లీ వెళ్లాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ప్ర‌ధాని మోదీతో స‌మావేశం అవ్వాల‌ని డిసైడ్ అయ్యారు. ఏపీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన జ‌గ‌న్‌కు మోదీ అభినంద‌న‌లు తెలిపారు. దీంతో..స్వ‌యంగా వెళ్లి క‌లిసి..ఆయ‌న స‌హ‌కారం కోరాల‌ని జ‌గ‌న్ డిసైడ్ అయ్యారు. అయితే, ఇదే స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగే రాజ‌కీయ చ‌ర్చ‌ల పైనే ఆస‌క్తి నెల‌కొని ఉంది.

జ‌గ‌న్ డ్రీం కేబినెట్ సిద్దం: స్పీక‌ర్‌గా ఇద్ద‌రి పేర్లు ప‌రిశీల‌న‌: మ‌ంత్రుల శాఖ‌లు ఖ‌రారు..!జ‌గ‌న్ డ్రీం కేబినెట్ సిద్దం: స్పీక‌ర్‌గా ఇద్ద‌రి పేర్లు ప‌రిశీల‌న‌: మ‌ంత్రుల శాఖ‌లు ఖ‌రారు..!

26 లేదా 27న ఢిల్లీకి జ‌గ‌న్..
ఈ నెల 25వ తేదీన వైసీపీ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఆ స‌మావేశంలో త‌మ నేత‌గా జ‌గ‌న్‌ను స‌మావేశం ఏక‌గ్రీవంగా ఎన్నుకోనుంది. ఆ కాపీతో జ‌గ‌న్ రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లి గ‌వ‌ర్న‌ర్‌తో స‌మావేశ‌మ‌వుతారు. ఈనెల 30న ప్ర‌మాణ స్వీకార అంశం ఆయ‌న‌తో చ‌ర్చించ‌టంతో పాటుగా..శాస‌న‌స‌భా ప‌క్షం తీసుకున్న నిర్ణ‌యాన్ని వివ‌రించనున్నారు. ఇక‌, ప‌ర‌మాణ స్వీకారానికి ముందే ఢిల్లీ వెళ్లి ప్ర‌ధానిని క‌ల‌వాలని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. కేంద్రంలో మోదీ రెండో సారి ప్ర‌ధానిగా ఈ నెల 30న ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

Jagan Delhi tour in next week,,meeting with Modi on state issues..

ఏపీలో ప్ర‌స్తుతం పాల‌నా ప‌రంగా జ‌గ‌న్ ముందున్న స‌వాళ్ల‌ను ఎదుర్కోవాలంటే కేంద్ర సాయం త‌ప్ప‌ని స‌రి. అయితే, కేంద్రంలో ఇత‌రుల సాయం అవ‌స‌రం లేకుండానే బిజేపీకి పూర్తి మెజార్టీ ద‌క్కింది. దీంతో..ఇప్పుడు కేంద్రంతో స‌న్నిహితంగా ఉంటూ నిధులు సాధించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో..ప్ర‌ధానితో ముందుగానే స‌మావేశం కావాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ఈ నెల 26 లేదా 27న జ‌గ‌న్ ఢిల్లీ వెళ్ల‌నున్నారు.

ఇద్ద‌రి ల‌క్ష్యం నెర‌వేరింది..
ఏపీలో చంద్ర‌బాబును ఓడించి అధికారంలోకి రావాల‌నే జ‌గ‌న్ ల‌క్ష్యం..చంద్ర‌బాబు ఏపీలో ఓడాలి..ఢిల్లీలో తాను గెల‌వాల‌ని అనేది మోదీ ఆకాంక్ష‌. ఇద్ద‌రి ల‌క్ష్యం నెర‌వేరింది. ఇప్పుడు ఇద్ద‌రూ భేటీ అవుతున్నారు. కేంద్రంలో ఇప్పుడు వైసీపీ ఎంపీల మ‌ద్ద‌తు అవ‌స‌రం లేక‌పోయినా..జ‌గ‌న్ పార్టీ లోక్‌స‌భ‌లో మూడో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది. ఇక‌, ఇప్పుడు ఏపీకీ ప్ర‌త్యేక హోదా..పోల‌వరం పూర్తి చేయ‌టం..రాజ‌ధాని నిర్మాణం జ‌గ‌న్ ముందున్న అతి పెద్ద స‌వాళ్లు. అదే విధంగా జ‌గ‌న్ వ‌స్తే ఏపీకి పెట్టుబ‌డులు రావ‌నే చంద్ర‌బాబు ప్ర‌చారాన్ని జ‌గ‌న్ ఆచ‌ర‌ణ రూపంలో త‌ప్ప‌ని నిరూపించాలి.

దీని కోసం మోదీ మ‌ద్ద‌తు చాలా అవ‌స‌రం. మోదీతో స‌ఖ్య‌త‌గా ఉంటూనే సాధించాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మోదీ సైతం జ‌గ‌న్ ప‌ట్ల సానుకూలంగానే ఉన్నార‌ని..ఏపీకి సాయం విష‌యంలో త‌మ పైన జ‌రిగిన ప్ర‌చారం ప‌ట్ల ఆగ్ర‌హంగా ఉన్నార‌ని స‌మాచారం. ఇదే స‌మ‌యంలో..ఎన్డీఏలో వైసీపీ చేర‌టం..కేంద్ర కేబినెట్‌లో చేర‌టం..ఏపీలో బిజేపీ ఎమ్మెల్సీల‌కు మంత్రి ప‌ద‌వులు వంటి విష‌యాల పైన చ‌ర్చ జ‌రిగి..ఒక నిర్ణ‌యానికి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

English summary
Becoming CM of AP Jagan may going Delhi tour on 26th to meet Prime Minister Modi. He discuss about AP pending issues and political matters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X