వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4న ఢిల్లీకి జ‌గ‌న్ : ప‌ర్య‌ట‌న పై ఉత్కంఠ : ఏం చేయ‌బోతున్నారు..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌..వైసిపి అధినేత జ‌గ‌న్ కీల‌క అడుగులు వేస్తున్నారు. సుదీర్ఘ పాద‌యాత్ర పూర్తి చేసిన జ‌గ న్ ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఈ నెల 4న ఢిల్లీ ప‌ర్య‌ట‌కు వెళ్తున్నారు. ఈ నెల 11న ముఖ్య‌మంత్రి ఢిల్లీలో దీక్ష‌క స‌మాయ‌త్తం అవుతున్న వేళ‌..జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఉత్కంఠ రేపుతోంది..

ఢిల్లీకి జ‌గ‌న్.. అదే అజెండా..

ఢిల్లీకి జ‌గ‌న్.. అదే అజెండా..

వైసిపి అధినేత పాద‌యాత్ర ముందు ఢిల్లీ వెళ్లారు. ఆ త‌రువాత ఇప్పుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఖ‌రారైంది. ఫిబ్ర‌వ‌రి 4న జ‌గ‌న్ ఢిల్లీ వెళ్ల‌నున్నారు. ఆయ‌న స‌డ‌న్ గా ఢిల్లీ ఎందుకు వెళ్తున్నార‌నేది అనేక రాజ‌కీయ అంచ‌నాల‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఏపిలో ఓటర్ల తొలిగింపు.. స‌ర్వేల పేరుతో ప్ర‌తిప‌క్ష పార్టీకి ఓటు వేస్తామ‌నే వారిని గు ర్తించి వారి ఓట్ల‌ను లక్ష్యంగా చేసు కుంటున్నార‌ని పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు. దీని పై ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం తో పాటుగా రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిని కలిసి ఫిర్యాదు చేసారు. కోర్టులోనూ పిటీష‌న్ దాఖ‌లు చేసారు. ఇదే స‌మ‌యంలో తాజాగా విజ‌య‌న‌గ రం జిల్లాలో స‌ర్వే పేరుతో టిడిపి వ్య‌తిరేక ఓట్ల‌ను గుర్తిస్తున్నార‌ని..దీనికి అధికార పార్టీ ముఖ్య‌నేత నేతృత్వం వ‌హిస్తు న్నార‌ని వైసిపి నేత‌లు ఆరోపిస్తున్నారు.

జ‌గ‌న్ త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న లో

జ‌గ‌న్ త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న లో

దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు సేక‌రించారు. జ‌గ‌న్ త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న లో ప్ర‌ధానంగా కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిని క‌లిసి ఈ విష‌యం పై ఫిర్యాదు చేయనున్న‌ట్లు స‌మాచారం. ఇదే స‌మ యంలో ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల పైనా ఎన్నిక‌ల సంఘం దృష్టి సారించాల‌ని కోరున్న‌ట్లు తెలుస్తోంది.

ఇత‌ర నేత‌ల‌ను క‌లుస్తారా..

ఇత‌ర నేత‌ల‌ను క‌లుస్తారా..

ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన ఉద‌యం 11.30 గంట‌ల‌కు జ‌గ‌న్ కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసేందుకు అప్పాయింట్ ఖారారు అయింది. ఏపిలో బోగ‌స్ ఓట్ల గురించి పార్టీ నేత‌ల‌తో క‌లిసి ఫిర్యాదు చేయ‌నున్నారు. ఇక‌,ఈ నెల 11న ముఖ్య‌మంత్రి ఢిల్లీ వేదిక‌గా కేంద్ర తీరుకు నిర‌స‌న‌గా దీక్ష చేయ‌నున్నారు. దీంతో..జ‌గ‌న్ త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఎవ‌రెవ‌రిని క‌లుస్తార‌నే దాని పై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ కేవ‌లం ఎన్నిక‌ల సంఘం అధికారుల‌ను క‌ల‌వ‌టం కోస‌మే వ‌స్తున్నార ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. కేంద్రంలో ఎవ‌రినీ క‌ల‌వ‌ర‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. అయితే, ముఖ్య‌మంత్రి ఢిల్లీ దీక్ష‌కు కౌంట‌ర్ గా జ‌గ‌న్ సైతం కార్యాచ‌ర‌ణ సిద్దం చేస్తున్న‌ట్లు సమాచారం. అయితే, జ‌గ‌న్ ఏ ర‌కంగా ముందుకు వెళ్తార‌నేది మాత్రం ఇంకా స్ప‌ష్ట‌త లేదు. దీంతో..జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌టన పై పార్టీ నేత‌లే కాదు..టిడిపి నేత‌లు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తు న్నారు.

English summary
YCP Chief Jagan Delhi tour on February 4th. He meet with Central Election Commission officials to complaint on bogus votes in Andhra Pradesh. Now jagan tour creating political interest in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X