దళితుల హక్కులను జగన్ కాలరాశారు: నిధులు దారిమళ్లాయి- ఏపీ ప్రభుత్వ పాలనపై వర్లరామయ్య రిపోర్ట్ కార్డు
జగన్ మోహన్ రెడ్డి రెండున్నరేళ్ల పాలనపై సి.ఎస్ సమీర్ శర్మకు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డి రెండున్నర ఏళ్ల పాలనలో దళితులను అన్నిరకాలుగా మోసం చేశారంటూ లేఖలో వర్ల రామయ్య పేర్కొన్నారు .దళితులకు కేటాయించిన నిధులు దారి మళ్ళాయని, దళితుల హక్కులను జగన్ కాలరాశారని వర్ల రామయ్య లేఖలో స్పష్టం చేశారు.

30 నెలల జగన్ పాలనలో 29 ఎస్సీ, ఎస్టీ పథకాల రద్దు
అబద్ధపు మాటలతో, అసాధ్యపు వాగ్దానాలతో దళితులను మభ్యపెట్టి సీఎం జగన్ అధికారం చేపట్టారని, రాజ్యాంగ పరంగా దళితులకు రావాల్సిన హక్కులను సైతం సీఎం జగన్ కాలరాశారని వర్ల రామయ్య అసహనం వ్యక్తం చేశారు. 30 నెలల జగన్ పాలనలో 29 ఎస్సీ, ఎస్టీ పథకాలను రద్దు చేసి 26, 663 కోట్ల రూపాయల సబ్ నిధులను దారి మళ్లించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక రాయితీలతో ఇచ్చిన ప్రభుత్వ పథకాలను అన్నింటిని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారని వర్ల రామయ్య ఆరోపించారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన లాంటి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను కూడా నిర్వీర్యం చేశారని వర్ల రామయ్య మండిపడ్డారు.

12వేల ఎకరాల ఎస్సీ, ఎస్టీల భూమి అన్యాయంగా లాక్కున్న జగన్ సర్కార్
ఎస్సీ, ఎస్టీలకు చెందిన 12 వేల ఎకరాల అసైన్డ్ భూములను అన్యాయంగా ప్రభుత్వమే లాక్కుందని వర్ల రామయ్య ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి తన రెండున్నర ఏళ్ల పాలనలో దళితులను అన్ని విధాలుగా వంచించారని, జగన్ మోహన్ రెడ్డి పాలనలో దళితులకు జరిగిన అన్యాయాన్ని వర్ల రామయ్య తన లేఖలో ఏకరువు పెట్టారు. నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రుణాలను రెండు సంవత్సరాల నుండి ఒక్కరికి కూడా ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. నేషనల్ సఫాయి కరంచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులను దారి మళ్లించారు అని, దళితులకు రావాల్సిన అన్ని ప్రయోజనాలను జగన్ దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

30 నెలల జగన్ రెడ్డి పాలన సాగింది ఇలా
జీవో
ఎంఎస్
నెంబర్
77
తెచ్చి
కన్వీనర్
కోటాలో
లేని
విద్యార్థులను
మోసం
చేశారని
వర్ల
రామయ్య
తీవ్ర
అసహనం
వ్యక్తం
చేశారు.
జగన్
సర్కారు
పాలనలో
రాష్ట్రంలో
దళితులపై
157
సార్లు
దాడులు
జరిగినా
ఒక్కరికీ
న్యాయం
చేయలేదని
వర్ల
రామయ్య
మండిపడ్డారు.
30
నెలల
జగన్
రెడ్డి
పాలన
అడిగితే
అణచివేతలు,
దాడులు,
అక్రమ
కేసులు,
ప్రశ్నిస్తే
శిరోముండనాలు
అన్నట్టే
సాగిందని
వర్ల
రామయ్య
పేర్కొన్నారు.
డాక్టర్
సుధాకర్
మరణానికి
కారణమయ్యారని,
వరప్రసాద్
కు
గుండు
గీయించారు
అని,
కిరణ్
ను
కొట్టి
చంపారని
వర్ల
రామయ్య
లేఖలో
పేర్కొన్నారు.
దళిత
మహిళా
డాక్టర్
అనిత
రాణి
వీడియోలు
తీసి
ఆమెను
క్షోభకు
గురి
చేశారని
లేఖలో
స్పష్టం
చేశారు.

దారి మళ్లిన 26, 663 కోట్ల సబ్ నిధులు .. చర్యలు తీసుకోండి
జడ్జి
రామకృష్ణ,
అతని
సోదరుడు
రామచంద్ర
పై
దాడి
చేసి
కొట్టారని
వర్ల
రామయ్య
సిఎస్
కు
రాసిన
లేఖలో
వైసిపి
సర్కారు
హయాంలో
జరిగిన
దాడుల
గురించి
ప్రస్తావించారు.
ఎస్సీ
ఎస్టీలకు
సంబంధించి
బాధలు
జగన్
రెడ్డి
దృష్టికి
తీసుకువెళ్లినా
చెవిటి
వాడి
ముందు
శంఖం
ఊదినట్లు
అయిందని
ఎలాంటి
ప్రయోజనం
చేకూర
లేదని
వర్ల
రామయ్య
లేఖలో
స్పష్టం
చేశారు.
అందుకే
ప్రభుత్వ
పరిపాలన
అధికారిగా
ఉన్న
సీఎస్
సృష్టికి
వీటిని
తీసుకొస్తున్నామంటూ
వర్ల
రామయ్య
పేర్కొన్నారు.
దారి
మళ్లిన
26,
663
కోట్ల
సబ్
నిధులను
తిరిగి
ఎస్సీ
ఎస్టీల
సంక్షేమం
కోసం
ఖర్చు
చేసేలా
చర్యలు
తీసుకోవాలని
వర్ల
రామయ్య
లేఖ
ద్వారా
ఏపీ
సీఎస్
సమీర్
శర్మ
దృష్టికి
తీసుకువెళ్లారు
.