వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ అనే నేను..: ప్ర‌మాణ స్వీకారం ఇలా ..వైయ‌స్‌ను గుర్తు చేస్తూ: కీల‌క ప్ర‌సంగం దిశ‌గా..!

|
Google Oneindia TeluguNews

ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ మ‌రి కొద్ది గంట‌ల్లో ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. 2004, 2009 లో వైయ‌స్ ఏ విధంగా అయితే ప్ర‌మాణ స్వీకారం స‌మ‌యంలో వ్య‌వ‌హ‌రించారో అదే విధంగా జ‌గ‌న్ సైతం ప్లాన్ చేసారు. ఎక్కువ ఆర్భాటం..హంగామా లేకుండా ప్ర‌మాణ స్వీకారం కోసం రెండు వేదిక‌ల‌ను సిద్దం చేసారు. ప్ర‌ధాన వేదిక మీద జ‌గ‌న్‌తో పాటుగా మరో ఇద్ద‌రు..మ‌రో వేదిక మీద ముఖ్య ఆహుతుల కోసం కేటాయిస్తున్నారు. ఇక‌, జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం త‌రువాత చేయ‌బోయే ప్ర‌సంగం త‌న పాల‌నకు అద్దం ప‌ట్ట‌నుంది.

త‌న తండ్రిని గుర్తు చేసేలా..
2004..2009 ఈ రెండు సంద‌ర్బాలు..వైయ‌స్ ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన సంద‌ర్భం ఇప్పుడు మ‌రో సారి జ‌గ‌న్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ స‌రిగ్గా 30వ తేదీ మ‌ధ్యాహ్నం 12.23 గంట‌ల‌కు ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. విజ‌య‌వాడ మున్సిప‌ల్ స్టేడియంలో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్రమం కోసం ఇప్ప‌టికే జ‌గ‌న్ అనేక మంది ప్ర‌ముఖులను ఆహ్వానించారు. ఇక‌, ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి ఇంటి నుండి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స్టేడియం వ‌ద్ద‌కు 12 గంట‌ల‌కు చేరుకుంటారు.

Jagan following his father tradition in swearing time and preparing to give key speech

స్టేడియం ప్ర‌వేశం నుండి వేదిక వ‌ర‌కూ ఓపెన్ జీపులో రానున్నారు. కార్య‌క్ర‌మానికి హాజ‌రైన అతిధులు..అభిమానులు..పార్టీ నేత‌ల‌కు అభివాదం చేస్తూ..వేదిక మీద‌కు చేరుకుంటారు. ఆయ‌న‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం స్వాగ‌తం ప‌లుకుతారు. 2009లో వైయ‌స్ ప్ర‌మాణ స్వీకారం కోసం ఎల్బీ స్టేడియం లోప‌ల‌కు ఇదే విధంగా ఓపెన్ జీపు లో వ‌చ్చే స‌మ‌యంలో జ‌గ‌న్ ప‌క్క‌నే ఉన్నారు.

కీల‌క ప్ర‌సంగం దిశ‌గా..
స్డేడియం ప్రాంగ‌ణంలో రెండు వేదిక‌ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్ర‌ధాన వేదిక మీద గ‌వ‌ర్న‌ర్..జ‌గ‌న్‌..ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం ఉంటారు. రెండో వేదిక అతిధుల‌కు..ఆహుతుల‌కు..ముఖ్య‌మైన నేత‌ల‌కు కేటాయించ‌నున్నారు. ఇక‌, జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత ఎంపిక చేసిన ప్ర‌ముఖ‌ల‌ను మాత్ర‌మే ఆయ‌నను అభినందించానికి ప్ర‌ధాన వేదిక వ‌ద్ద‌కు అనుమ‌తిస్తారు. త‌రువాత జ‌గ‌న్ కీల‌క ప్ర‌సంగం చేయ‌నున్నారు.

Jagan following his father tradition in swearing time and preparing to give key speech

న‌వ‌ర‌త్నాల‌తో పాటుగా..త‌న పాల‌న ఏ ర‌కంగా ఉండేదీ జ‌గ‌న్ వివ‌రించ‌నున్నారు. అవినీతి ర‌హిత‌.. విప్ల‌వాత్మ‌క పాల‌న అందిస్తానంటూ జ‌గ‌న్ ప్ర‌కటించ‌నున్నారు. ఇదే స‌మ‌యంలో సీఎస్..డీజీపీ..సీఎంఓ అధికారుల నియామ‌కానికి సంబంధించి కీల‌క ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఆ త‌రువాత జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లి..మోదీ ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌ర‌వుతారు.

English summary
Jagan swearing ceremony arrangements completed. Jagan following his father tradition in swearing time. Jagan preparing to give key speech after swearing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X