వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ఫార్ములాను ఫాలో అవుతున్న జగన్.. రాజధానిపై కొత్త వ్యూహం..

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే సెక్రటేరియట్ అని.. అక్కడి నుంచే పాలన జరుగుతుందని గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సెక్రటేరియట్‌కు రాని సీఎం,ఫామ్‌హౌజ్ సీఎం అంటూ ప్రతిపక్షాలు ఆయనపై విమర్శలు చేస్తున్న తరుణంలో.. కేసీఆర్ ఈ కామెంట్స్ చేశారు. అంతేకాదు, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలుపొంది.. ఆ కామెంట్స్ చేసినవాళ్లు ఎక్కడా..? అంటూ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ సెక్రటేరియట్ విషయంలో విమర్శలను ఎదుర్కొన్నట్టే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తరహాలో జగన్ కూడా.. సీఎం ఎక్కడుంటే అక్కడి నుంచే పాలన జరుగుతుందని తాజాగా అసెంబ్లీలో స్పష్టం చేశారు.

రాజధానుల అంశంపై గురువారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. అసలు రాజ్యాంగంలో రాజధాని అన్న పదమే లేదన్నారు. ఉన్నదల్లా సీట్ ఆఫ్ గవర్నెన్స్(పాలన నడిచే స్థానం) మాత్రమే అని చెప్పారు. దాని ప్రకారం రాష్ట్రంలో ఎక్కడైనా అసెంబ్లీ పెట్టుకోవచ్చునని చెప్పారు. ఆర్టికల్ 174 ప్రకారం రాష్ట్రంలో ఎక్కడ కూర్చొనైనా చట్టాలు చేయవచ్చునని అన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడి నుంచే అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందన్నారు. ఇందుకోసం దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఉదాహరణగా చెప్పారు. జయలలిత బతికి ఉన్నప్పుడు ఊటీ నుంచే పాలన సాగించారని గుర్తుచేశారు. అలాగే రాష్ట్రంలోనూ హుద్‌హుద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు విశాఖ నుంచే అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలను పర్యవేక్షించారని గుర్తుచేశారు. రేప్పొద్దున ఇంకెక్కడైనా ప్రకృతి విపత్తు సంభవిస్తే.. ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లి పర్యవేక్షించరా.. అప్పుడు అక్కడినుంచే గవర్నెన్స్ జరగదా అని జగన్ ప్రశ్నించారు. కాబట్టి ముఖ్యమంత్రి,మంత్రులు,సెక్రటరీలు ఎక్కడినుంచి పనిచేస్తే అక్కడి నుంచే అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందన్నారు.

jagan following kcr foot steps to defend three capital plan for andhra pradesh

రాజధానుల విషయంలో తమ నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు జగన్ ఈ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారని చెప్పుకోవచ్చు. అసలు రాజ్యాంగంలో రాజధాని అన్న పదమే లేదని చెప్పడం ద్వారా.. ప్రస్తుతం దాని చుట్టూ నెలకొన్న వివాదానికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఏదేమైనా ఏపీకి మూడు రాజధానులు ప్రకటించిన సీఎం జగన్.. అసలు రాజ్యాంగంలో రాజధాని పదమే లేదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

ఇక దేశంలోని కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే మండలి ఉందని గుర్తుచేసిన సీఎం జగన్.. ఏపీ లాంటి పేద రాష్ట్రానికి మండలి అవసరమా అని ప్రశ్నించారు. అసెంబ్లీలోనే ఇంతమంది విజ్ఞులు ఉన్నప్పుడు అదనంగా మండలితో ఉపయోగమేమిటన్నారు. అంతేకాదు, మండలి నిర్వహణకు ఏటా రూ.60కోట్లు ఖర్చు అవుతున్నాయని,సగటున మండలి జరిగే ప్రతీ రోజు రూ.1కోటి ఖర్చు అవుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మండలిపై ఇంత ఖర్చు చేయడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. మొత్తం మీద

English summary
After CM YS Jagan statements on administration political analysts saying that he is following CM KCR foot stepsto defend three capital plan in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X