వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్ర‌తీ ఎమ్మెల్యేకు కోటి రూపాయాలు: చ‌ంద్ర‌బాబుకీ ఇస్తాం..మీ వ‌ల‌నే ఈ దుస్థితి: సీఎం జ‌గ‌న్‌..!

|
Google Oneindia TeluguNews

ఏపీ శాస‌న‌స‌భలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ క‌రువు మీద ప్ర‌క‌ట‌న చేసారు. ఏపీలో ప్ర‌స్తుతం నెల‌కొన్న క‌రువు ప‌రిస్థితుల‌ను వివ‌రించ‌టంతో పాటుగా..రైతుల‌ను ఆదుకొనేందుకు ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లను వివ‌రించారు. రైత‌లకు విత్త‌నాల కొనుగోలుకు చంద్ర‌బాబు నిధులు ఇవ్వ‌లేదంటూ..అధికారులు రాసిన లేఖ‌ల‌ను ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష న్ ద్వారా వివ‌రించారు. వైఎస్సార్‌ రైతు భరోసా.. సున్నా వ‌డ్డీ ప‌ధ‌కం..ఇన్‌పుట్ స‌బ్సిడీ..ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి వంటి వాటి గురించి వివ‌రించారు. క‌రువు నివార‌ణ చర్య‌ల కోసం ప్ర‌తీ ఎమ్మెల్యేకు కోటి చొప్పున విడుద‌ల చేస్తున్న‌ట్లుగా సీఎం ప్ర‌క‌టించారు.

స‌భ‌లో సున్నావ‌డ్డీ ర‌చ్చ‌: జ‌గ‌న్ స‌వాల్‌..చంద్ర‌బాబు సీరియ‌స్‌: నాటి ఘ‌ట‌న‌కు నేడు సీఎం ఇలా..! స‌భ‌లో సున్నావ‌డ్డీ ర‌చ్చ‌: జ‌గ‌న్ స‌వాల్‌..చంద్ర‌బాబు సీరియ‌స్‌: నాటి ఘ‌ట‌న‌కు నేడు సీఎం ఇలా..!

Recommended Video

హామీలను నెరవేర్చే పరిస్థితి కనిపించడంలేదు
నెల‌లోగానే మాట నిల‌బెట్టుకున్నాం..

నెల‌లోగానే మాట నిల‌బెట్టుకున్నాం..

రాష్ట్రంలో క‌రువు ప‌రిస్థితుల పైన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చేసారు. రైతాంగాన్ని ఆదుకొనేందుకు తమ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లను వివ‌రించారు. రైతుల కోసం వైయ‌స్సార్ భ‌రోసా అమ‌లు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రూ.2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేస్తామని ముఖ్యమం‍త్రి ప్ర‌క‌టించారు. రుణమాఫీపై 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన వాగ్దానాన్ని శాసనసభలో స్క్రీన్‌పై ముఖ్యమంత్రి చూపించారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.384 కోట్ల బకాయిలు కూడా తమ ప్రభుత్వం చెల్లిందని ముఖ్యమంత్రి వివ‌రించారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు కుటుంబాలకు తమ ప్రభుత్వం రూ.7 లక్షల పరిహారం ఇస్తుందని తెలిపారు. అక్టోబర్‌ 15 నుంచే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. రూ.3వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. అలాగే 16 లక్షల మంది కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తింపు చేస్తామని, దేశ చరిత్రలో ఇది ఒక రికార్డు గా జ‌గ‌న్ చెప్పారు.

ప్ర‌తీ ఎమ్మెల్యేకు కోటి రూపాయాలు..

ప్ర‌తీ ఎమ్మెల్యేకు కోటి రూపాయాలు..

రాష్ట్రంలోని ప్ర‌తీ ఎమ్మెల్యేకు కోటి రూపాయాలు ఇస్తామ‌ని.. ప్ర‌తీ ఎమ్మెల్యే త‌మ నియోక‌వ‌ర్గాల్లోని క‌రువు ప‌రిస్థితుల‌ను అధ్య‌య‌నం చేసి అవ‌స‌రం మేర ఖ‌ర్చు చేయాల‌ని జ‌గ‌న్ సూచించారు. ఈ మొత్తాన్ని ముఖ్య‌మంత్రి ఫండ్ నుండి విడుద‌ల చేస్తామ‌న్నారు. ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌కు..ప్ర‌తిప‌క్ష నేత‌కు సైతం విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు. రాష్ట్రంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా వ‌ర్షాభావ ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని..అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని..అయినా
సరే ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం అని స్ప‌ష్టం చేసారు. వర్షాలు ఆలస్యమయ్యాయి. గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. వీటిని అన్నింటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నా మ‌ని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం 2,300 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని రైతులకు ఎగ్గొట్టిందని..గత ఖరీఫ్‌లో కరువును ఎదుర్కొనేందుకు రూ.1800 కోట్లు లెక్కకట్టారు. కేంద్రం రూ.900కోట్లు ఇచ్చినా రైతులకు ఒక్క పైసా ఇవ్వలేదంటూ జ‌గ‌న్ ఆరోపించారు. మార్కెట్‌ కమిటీలకు ఎమ్మెల్యేలను గౌరవ చైర్మన్లుగా నియమిస్తున్నాం. దీనివల్ల రైతులకు ఎలాంటి లబ్ది చేకూరుతుందని జ‌గ‌న్ వివ‌రించారు.

విత్త‌న కొర‌త‌కు కార‌ణం గ‌త ప్ర‌భుత్వ‌మే..

విత్త‌న కొర‌త‌కు కార‌ణం గ‌త ప్ర‌భుత్వ‌మే..

ప్ర‌స్తుతం నెల‌కొన్న విత్త‌న స‌మ‌స్య‌కు కార‌ణం గ‌త ప్ర‌భుత్వ‌మే అని సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేసారు. విత్తన సేకరణ ఏప్రిల్‌ నాటికి పూర్తయి మే నెలలో పంపిణీ కావాల్సి ఉంది. అలా కాకపోవడం వల్ల రైతన్నలు రోడ్డుపైకి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. విత్తన సేకరణకు నిధులు విడుదల చేయాలంటూ అధికారులు ఎన్నిలేఖలు రాసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. రూ.330 కోట్ల విత్తన బకాయిలను చెల్లించాలని కోరినా అప్పటి సర్కార్‌ స్పందించలేదంటూ రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారులు రాసిన లేఖ‌ల‌ను స‌భ‌లో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా వివ‌రించారు. ఆ లేఖ‌ల‌ను సైతం ప్ర‌ద‌ర్శించారు. అయిదేళ్లలో రుణాల రీ షెడ్యూల్‌, రైతుల వడ్డీలు చెల్లించాలనే ఆలోచన లేదు. రూ.87వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక రూ.24వేల కోట్లకు తగ్గించారని విమ‌ర్శించారు. 16 లక్షల మంది కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తింపు చేస్తాం. భారతదేశ చరిత్రలో ఇది ఒక రికార్డు. వైఎస్సార్ రైతు భరోసా కింద వచ్చే నగదును బ్యాంకర్లు పాత బకాయిలు కింద తీసుకోకుండా నిబంధనలు తీసుకొస్తాం. 11నెలలు మాత్రమే సాగు ఒప్పందం ఉండేలా చట్టాన్ని తీసుకొస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

English summary
CM Jagan given statement on drought situation in AP. He announced that govt release one crore rupees for each MLA to face Drought in constituency. Jagan cornered Chandra babu for present situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X