వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ మెజార్టీ 70వేలు. చంద్ర‌బాబుకు 30వేలు..రోజా గెలుపు భావోద్వేగం..నేను గెల్డెన్ లెగ్..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో అధికారిక ఫ‌లితాలు వెల్ల‌డ‌వున్నాయి. టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ‌తం కంటే బాగా మెజార్టీ త‌గ్గింది. ఈ ఎన్నిక‌ల్లో కుప్పం నుండి పోటీ చేసిన చంద్ర‌బాబు 29,993 ఓట్ల‌తో విజ‌యం సాధించారు. జ‌గ‌న్‌కు 70వేట మెజార్టీ ద‌క్కింది. ఇక, అనేక అనుమానాలు..సందేహాల న‌డుమ రోజా ఎట్ట‌కేల‌కు గెలుపొందారు. రీ పోలింగ్ వ్య‌వ‌హారంలో విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మైన చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో మరో సారి చెవిరెడ్డి గెలుపొందారు.

కుప్పం నుండి చంద్ర‌బాబుకు 30 వేల మెజార్టీ

కుప్పం నుండి చంద్ర‌బాబుకు 30 వేల మెజార్టీ

కుప్పం నుండి చంద్ర‌బాబు మెజార్టీ 30వేల‌కు ప‌రిమితం అయింది. ఈ సారి తాను ప్ర‌చారానికి వెళ్ల‌క‌పోయినా అక్క‌డ పార్టీ కేడ‌ర్ త‌న‌ను 75 వేల మెజార్టీతో గెలిపిస్తున్నారంటూ చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. మిగిలిన అభ్య‌ర్దులు కుప్పం ఫార్ములా ను అనుస‌రించాల‌ని సూచించారు. కుప్పంలో చంద్ర‌బాబు త‌ర‌పున ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి సైతం ప్ర‌చారం చేసారు. ఆయ‌న కుమారుడు లోకేశ్ మంగ‌ళ‌గిరి ఎదురీదుతున్నారు. ఆయ‌న పైన వైసీపీ అభ్య‌ర్ది ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఇప్ప‌టికే 11 వేల ఆధిక్య‌త‌తో ఉన్నారు. టీడీపీ ఒక్క లోక్‌స‌భ‌లోనూ ఆధిక్య‌త సాధించ‌లేదు. మొత్తం 25 స్థానాల్లోనూ వైసీపీ హ‌వా సాగుతోంది.

 జ‌గ‌న్‌కు 70 వేల మెజార్టీ

జ‌గ‌న్‌కు 70 వేల మెజార్టీ

కాబోయే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పులివెందుల నుండి రెండో సారి గెలుపొందారు. 70 వేల పైగా మెజార్టీ సాధించారు. ఆయ‌న త‌ర‌పున జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి ప్ర‌చారం చేసారు. వైయ‌స్ వివేకా హ‌త్య‌తో పులివెందుల‌, జ‌మ్మ‌లమడుగులో పార్టీని గెలిపించే బాధ్య‌త ఎవ‌రు తీసుకుంటార‌నే చ‌ర్చ సాగింది. అయితే, జ‌గ‌న్ పులివెందుల లో నామినేష‌న్ స‌మ‌యంలో ఒక్క స‌భ‌లో మాత్ర‌మే పాల్గొన్నారు. అయినా..వైయ‌స్ కుటుంబం అక్క‌డ ఉన్న ఆద‌ర‌ణ కొన‌సాగించారు. జ‌గ‌న్‌కు 70 వేల మెజార్టీతో విజ‌యం సాధించి అదే నియోజక‌వ‌ర్గం నుండి గెలిచిన రెండో ముఖ్య‌మంత్రి గా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

పార్టీల్లో... ప్రజాశాంతీ పార్టీ వేరయా... కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా...?పార్టీల్లో... ప్రజాశాంతీ పార్టీ వేరయా... కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా...?

 రోజా భావోద్వేగం..నాది గోల్డెన్ లెగ్..

రోజా భావోద్వేగం..నాది గోల్డెన్ లెగ్..

న‌గ‌రి నుండి రోజా గెలుస్తారా లేదా అని జోరుగా చ‌ర్చ సాగింది. అయితే, ఎట్ట‌కేల‌కు జ‌గ‌న్ చెప్పిన విధంగా రెండు వేల పైగా మెజార్టీతో రోజా విజ‌యం సాధించారు. 2681 ఓట్ల మెజార్టీ ల‌భించింది. గెలిచిన రోజా కౌంటింగ్ సెంట‌ర్ వ‌ద్ద భావోద్వేగానికి గుర‌య్యారు. త‌న‌ను ఇప్పటి దాకా ఐరెన్ లెగ్ అని..తాను గెలిస్తే జ‌గ‌న్ అధికారంలోకి రారంటూ ప్ర‌చారం చేసిన వారికి ఇదే హెచ్చ‌రిక అంటూ వార్నింగ్ ఇచ్చారు. త‌న‌ది ఐరెన్ లెగ్ కాద‌ని..గోల్డెన్ లెగ్ అంటూ చెబుతూ..బైబై బాబు అంటూ నినాదాలు చేసారు.

English summary
YCp chief jagan win from Pulivendula with 70,000 majority, TDP Cheif Chandra Babu won Kuppam segment with 30000 majority. Roja win nagari Assembly with 2000 majority.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X