అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లంచాధికారులకు జగన్‌ భారీ షాక్‌- ఇక 100 రోజుల్లోనే చర్యలు- ఆలస్యం చేసే వారిపైనా

|
Google Oneindia TeluguNews

ఏపీలో అవినీతి చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినా ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపై ఏళ్ల తరబడి చర్యలు లేవు. దీంతో అవినీతి చేసినా తమకేం కాదన్న ధీమా అధికారుల్లో పెరిగిపోయింది. దీనికి చెక్‌ పెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి కేసుల్లో చర్యలకు డెడ్‌లైన్‌ విధించడంతో పాటు దాన్ని ఉల్లంఘించిన వారిపైనా చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ప్రకారం ఇకపై అవినీతి చేస్తూ నేరుగా పట్టుబడితే వంద రోజుల్లో వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటారు.

ఏపీలో అవినీతి కంపు

ఏపీలో అవినీతి కంపు

ఏపీలో భారీ ఎత్తున సంక్షేమ పథగాల్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. వీటితో పాటు రోజువారీ పాలనలో కోట్లాది రూపాయల డబ్బులు చేతులు మారుతున్నాయి. ఇదే అదనుగా భారీ ఎత్తున అధికారులు అక్రమాలకు తెరలేపుతున్నారు. వీటిని గుర్తించి ఏసీబీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, విజిలెన్స్‌ వంటి సంస్ధలు కేసులు పెడుతున్నా వాటిపై చర్యలు మాత్రం ఉండటం లేదు. చివరికి కొంతకాలం వేచిచూస్తే చాలు తాము సింపుల్‌గా బయటపడొచ్చన్న ధీమా వీరిలో పెరిగిపోతోంది. దీంతో అవినీతి రాష్ట్రాల్లో ఏపీ కూడా పొటీపడుతోంది. దీనిపై నివేదికలు పరిశీలించిన సీఎం జగన్‌ అవినీతి అధికారులపై చర్యలకు సిద్దమయ్యారు.

 రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికితే 100 రోజుల్లో చర్యలు

రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికితే 100 రోజుల్లో చర్యలు


ఇకపై ఏపీలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఏసీబీతో పాటు ఇతర దర్యాప్తు సంస్ధలకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే మాత్రం వంద రోజుల్లో కచ్చితంగా విచారణ పూర్తి చేసి వారిపై క్రమశిక్షణ చర్యలు ప్రారంబించేలా నిబందనల్ని సవరించారు. ఇప్పటివరకూ రెడ్‌హ్యాండెడ్‌గానే కాదు మామూలుగా పట్టుబడినా, ఆధారాలు దొరికినా, ఏళ్ల తరబడి వారిపై విచారణలు పూర్తి కావడం లేదు. క్రమశిక్షణా చర్యల గురించి ఇక మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఇప్పుడు అలా కాదు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికితే మాత్రం 100 రోజుల్లోగా ఎట్టి పరిస్ధితుల్లోనూ విచారణ పూర్తి కావాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 వందరోజుల్లో కాకపోతే ఏసీబీపైనా చర్యలు

వందరోజుల్లో కాకపోతే ఏసీబీపైనా చర్యలు

ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది అవినీతి చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన కేసుల్లో విచారణ 100 రోజుల్లో పూర్తికాకపోతే, వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమైతే సదరు శాఖాధిపతులతో పాటు ఏసీబీ అధికారులపైనా చర్యలు తీసుకుంటారు. దీంతో శాఖాదిపతులు, ఏసీబీ అధికారులకూ ఇదో ఛాలెంజ్‌గా మారబోతోంది. ఏసీబీ అధికారులు తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి విచారణలు సాగదీస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వారికి కూడా డెడ్‌లైన్‌ పెట్టినట్లయింది.

 ఖజానాపైనా తగ్గనున్న భారం

ఖజానాపైనా తగ్గనున్న భారం

లంచాలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినా వీరిపై చర్యలు తీసుకునేందుకు ఇప్పటివరకూ ఎలాంటి గడువూ లేదు. దీంతో ప్రభుత్వం వీరిని విధులకు దూరంగా ఉంచి మరీ వేతనాలు చెల్లించాల్సిన పరిస్దితి. దీంతో పని చేయకుండానే దర్జాగా జీతాలు తీసుకుంటూ వీరంతా ఖజానాకు భారంగా మారుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న వంద రోజుల చర్యల నిర్ణయంతో ఖజానాపై ఆ మేరకు భారం కూడా తగ్గబోతోంది. అదే సమయంలో నిర్ణీత సమయంలో శిక్షలు పడటం మొదలైతే ఉద్యోగుల్లో అవినీతి ఆటోమేటిగ్గా తగ్గే అవకాశం కూడా ఉంటుంది.

English summary
ap government has fixed a new timeline of 100 days for concluding action against officials who caught red handed in corruption cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X